తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Redmi A4 5g : కేవలం రూ.8,499కే రెడ్‌మీ 5జీ స్మార్ట్‌ఫోన్.. ఫస్ట్ సేల్‌లో కొనేయండి

Redmi A4 5G : కేవలం రూ.8,499కే రెడ్‌మీ 5జీ స్మార్ట్‌ఫోన్.. ఫస్ట్ సేల్‌లో కొనేయండి

Anand Sai HT Telugu

27 November 2024, 9:30 IST

google News
  • Redmi A4 5G Smartphone : షియోమీ నుంచి వచ్చిన అత్యంత చౌకైన 5జీ ఫోన్ రెడ్‌మీ ఏ4 5జీ సేల్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ నుంచి రూ.8,499 ప్రత్యేక ధరకు ఈ ఫోన్‌ను ఆర్డర్ చేయవచ్చు.

రెడ్‌మీ ఏ4 5జీ స్మార్ట్‌ఫోన్
రెడ్‌మీ ఏ4 5జీ స్మార్ట్‌ఫోన్

రెడ్‌మీ ఏ4 5జీ స్మార్ట్‌ఫోన్

చైనీస్ టెక్ కంపెనీ షియోమీ తన చౌకైన 5జీ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ ఏ4 5జీని లాంచ్ చేసింది. నవంబర్ 27 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యే సేల్‌లో ఈ ఫోన్‌ను రూ.8,499 ప్రత్యేక ధరకు కొనుగోలు చేయవచ్చు. ప్రీమియం ఫీల్ డిజైన్, మంచి ఫీచర్లతో ఈ డివైస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చారు.

షియోమీ రెడ్‌మీ లైనప్‌లోని కొత్త 5జీ ఫోన్లు 8జీబీ వరకు ర్యామ్ సామర్థ్యం, వెనుక ప్యానెల్లో 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్‌తో వస్తాయి. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, 5160 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఇందులో అందించారు. హై రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 6.88 అంగుళాల మంచి డిస్‌ప్లేను ఇచ్చారు.

4 జీబీ ర్యామ్ ప్లస్ 64 జీబీ స్టోరేజ్‌తో కొత్త రెడ్‌మీ ఏ4 5జీ బేస్ వేరియంట్ ధర రూ.8,499. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.9,499గా నిర్ణయించారు. వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కారణంగా దీని ర్యామ్ సామర్థ్యం 8 జీబీకి పెరుగుతుంది. అమెజాన్‌లో దీని మొదటి సేల్ నవంబర్ 27 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ స్టారీ బ్లాక్, స్పార్కిల్ పర్పుల్ రంగుల్లో లభిస్తుంది.

ఈ బడ్జెట్ ఫోన్లో షియోమీ 6.88 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే అందించింది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. కంటి రక్షణతో వచ్చే ఈ డిస్‌ప్లే 600 అంగుళాల గరిష్ట బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ ఓఎస్ సాఫ్ట్‌వేర్ స్కిన్‌ను కలిగి ఉన్న ఈ ఫోన్ రెండు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందుకుంటుంది.

కొత్త రెడ్‌మీ ఏ4 5జీ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 4ఎస్ జెన్ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. టైప్-సి ఛార్జింగ్ ఉన్న ఈ ఫోన్‌లో 5160 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 33వాట్ ఛార్జర్ కూడా అందించారు. ఈ డివైజ్ ఐపీ54 రేటింగ్‌తో వస్తుంది.

తదుపరి వ్యాసం