ఈ ఏడాది 30కి పైగా స్టాక్స్ 100 నుండి 300 శాతం వరకు రాబడిని ఇచ్చాయి.. మీ దగ్గర ఇవి ఉన్నాయా?
23 December 2024, 19:00 IST
- Stock Market : కొన్ని స్టాక్స్ పెట్టుబడిదారులకు మంచి రాబడులు ఇస్తాయి. ఈ ఏడాది కొన్ని స్టాక్స్ 100 శాతం నుంచి 320 వరకూ రిటర్న్స్ ఇచ్చాయి.
స్టాక్ మార్కెట్
స్టాక్ మార్కెట్ కొంతమంది ఇన్వెస్టర్లకు మరో ఏడాది సానుకూల రాబడులతో ముగియనుంది. స్టాక్ మార్కెట్ సానుకూల రాబడులను ఇవ్వడంలో విజయం సాధించడం ఇది వరుసగా తొమ్మిదో సంవత్సరం. గత 3 నెలల్లో భారీ అమ్మకాల కారణంగా ఈసారి మార్కెట్ గత సంవత్సరం పనితీరును రిపీట్ చేయలేకపోయింది. క్యాలెండర్ ఇయర్ ప్రథమార్థంలో సెన్సెక్స్, నిఫ్టీలు 10.5 శాతం రాబడులు ఇచ్చాయి. కానీ రెండో త్రైమాసికం చాలా కష్టంగా ఉంది.
ప్రస్తుతం నిఫ్టీ సెన్సెక్స్ 8 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. ఇది 2023తో పోలిస్తే తక్కువ. గత ఏడాది సెన్సెక్స్, నిఫ్టీ 20 శాతం లాభపడ్డాయి. 2015 నుంచి ఈ సూచీ సానుకూల రాబడులను ఇస్తోంది. 2021లో అత్యధిక రాబడులు వచ్చాయి.
స్టాక్ మార్కెట్ 2024లో అన్ని పాత రికార్డులను బద్దలు కొట్టింది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సెన్సెక్స్, నిఫ్టీలు ఈ ఏడాది తమ పాత రికార్డులను చెరిపేశాయి. 2024లో నిఫ్టీ 26000 మార్కును దాటగలిగింది. అదే సమయంలో సెన్సెక్స్ కూడా 85,978 వద్ద రికార్డు గరిష్టాన్ని తాకింది. 2024లో మిడ్‌క్యాప్స్, స్టాల్ క్యాప్స్ మంచి రాబడులను ఇచ్చాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 23.20 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 23.60 శాతం రాబడులను ఇవ్వడంలో విజయవంతమయ్యాయి.
నిఫ్టీ 500 ఇండెక్స్‌లో 33 కంపెనీలు అద్భుతమైన రాబడులు ఇచ్చాయి. ఈ ఏడాది ఈ కంపెనీలు 100 శాతం నుంచి 320 శాతం వరకు రాబడులు ఇచ్చాయి. ఈ జాబితాలో టాప్ గెయినర్స్‌గా జీఈ వెర్నోవా టీ అండ్ డీ ఇండియా నిలిచింది. కంపెనీ షేర్లు 320 శాతం పెరిగాయి. 2023లో ఈ స్టాక్ ఇన్వెస్టర్లకు 336 శాతం రాబడిని ఇచ్చింది.
జ్యోతి సిఎన్‌సి ఆటోమేషన్ కూడా రాబడుల పరంగా మంచి పనితీరు కనబరిచింది. జనవరిలో లిస్టింగ్ అయినప్పటి నుంచి కంపెనీ షేర్లు 300 శాతానికి పైగా రాబడులను ఇవ్వగలిగాయి. కేఎఫ్ఐఎన్ టెక్నాలజీస్ కూడా ఈ ఏడాది ఇన్వెస్టర్లకు 197 శాతం రాబడిని ఇచ్చింది. మరోవైపు డిక్సన్ టెక్నాలజీస్ (ఇండియా) షేర్లు కూడా ఈ ఏడాది ఇన్వెస్టర్లకు మంచి రాబడులు ఇచ్చాయి. వాస్తవానికి వివో ఇండియాతో ఒప్పందం కారణంగా డిక్సన్ టెక్నాలజీస్ షేర్లలో భారీ పెరుగుదల ఉంది.
టాప్ 10 లిస్ట్
GE వెర్నోవా - 320 శాతం
జ్యోతి సీఎన్‌సీ - 302 శాతం
Kfin టెక్నాలజీ - 197 శాతం
ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ - 190 శాతం
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీస్ - 189 శాతం
అనంత్ రాజ్ - 179 శాతం
కేన్స్ టెక్నాలజీ ఇండియా శాతం-180 శాతం
డిక్సన్ టెక్నాలజీ - 175 శాతం
హిటాచీ ఎనర్జీ ఇండియా - 159 శాతం
గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా - 148 శాతం
గమనిక : ఇది పెట్టుబడి సలహా కాదు. స్టాక్ మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు నిపుణులను సంప్రదించండి.