Microsoft Surface Event | మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ 5 లాంచ్, జాబితాలో మరెన్నో ఉన్నాయి!
12 October 2022, 21:58 IST
- Microsoft Surface Event: మైక్రోసాఫ్ట్ తన తాజా సర్ఫేస్ ఈవెంట్‌లో భాగంగా సర్ఫేస్ సిరీస్‌లో ల్యాప్‌టాప్‌లు, డెస్క్ టాప్‌లు, టాబ్లెట్ పీసీలు, ఆడియో డాక్‌లు, ప్రెజెంటర్లు వంటి ఎన్నో ఆసక్తికరమైన డివైజ్‌లను లాంచ్ చేసింది. ఆ వివరాలు చూడండి.
Surface Laptop 5
అమెరికన్ టెక్నాలజీ బ్రాండ్ మైక్రోసాఫ్ట్, అక్టోబర్ 12, 2022న Microsoft Surface Event పేరిట ఒక మెగా టెక్నాలజీ ఈవెంట్ నిర్వహించింది. వర్చువల్ విధానంలో జరిగిన ఈ ఈవెంట్‌లో టెక్ కంపెనీ వివిధ రకాల ఆకట్టుకునే కంప్యూటింగ్ పరికరాలను ఆవిష్కరించింది. ఇందులో టాబ్లెట్ ఫోన్లు, ల్యాప్‌టాప్ లు మొదలైనవి ఉన్నాయి. అంతేకాకుండా లాంచ్ సమయంలో తమ మైక్రోసాఫ్ట్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ కోసం అనేక కొత్త ఆసక్తికరమైన ఫీచర్లను కూడా ప్రవేశపెట్టింది.
ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ తన సర్ఫేస్ ఈవెంట్‌లో భాగంగా సరికొత్త సర్ఫేస్ ల్యాప్‌టాప్ 5, సర్ఫేస్ ప్రో 9 , సర్ఫేస్ స్టూడియో 2+ వంటి అధునాతన గాడ్జెట్‌లను పరిచయం చేసింది.
ఇదే క్రమంలో మైక్రోసాఫ్ట్ భవిష్యత్ లక్ష్యాలను కూడా సంస్థ వెల్లడించింది. 2012 నుండి మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులు కార్బన్ న్యూట్రల్‌గా ఉన్నాయి. తమ బ్రాండ్ నుంచి వచ్చిన Windows ప్రపంచంలోనే మొట్టమొదటి కార్బన్ నెగెటివ్ అవార్డు ఆపరేటింగ్ సిస్టమ్. పర్యావరణ హితానికి పాటుపడుతూ 2030 వరకు కూడా కార్బన్ నెగెటివ్‌గానే ఉండాలనే తమ లక్ష్యాన్ని టెక్ దిగ్గజం ప్రకటించింది. ఇక, ఈ ఈవెంట్‌లో మైక్రోసాఫ్ట్ లాంచ్ చేసిన పరికరాలపై ఒక లుక్ వేయండి.
Microsoft Surface Series Details
మైక్రోసాఫ్ట్ ప్రధానంగా తమ బ్రాండ్ నుంచి నాలుగు ఉత్పత్తులను లాంచ్ చేసింది. వాటి వివరాలు క్లుప్తంగా ఇప్పుడు చూద్దాం.
Surface Laptop 5
సరికొత్త సర్ఫేస్ ల్యాప్‌టాప్ 5లో ఇంటెల్ Evo 12th Gen చిప్, 4 Thunderbolt పోర్ట్‌లు ఇచ్చారు. ఈ ల్యాప్‌టాప్ దీని పాత వెర్షన్ అయిన సర్ఫేస్ ల్యాప్‌టాప్ 4 కంటే 50 శాతం ఎక్కువ శక్తివంతమైనది. డాల్బీ విజన్ డిస్‌ప్లే, అడ్వాన్స్‌డ్ హెచ్‌డిఆర్, డాల్బీ అట్మోస్ ఆడియోతో వస్తుంది. ల్యాప్‌టాప్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ కేవలం 30 నిమిషాల ఛార్జింగ్‌తో 9 గంటల జీవితాన్ని అందిస్తుంది. మొత్తంగా 18 గంటల బ్యాటరీ జీవితాన్ని కలిగి ఉంది.
Surface 9 Pro
సర్ఫేస్ 9 ప్రోలో ఇంటెల్ 12వ జెన్ చిప్, మైక్రోసాఫ్ట్ SQ3 చిప్‌లతో అందిస్తున్నారు. సఫైర్, ఫారెస్ట్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఇది 5G సపోర్ట్ చేస్తుంది. సర్ఫేస్ స్లిమ్ పెన్ 2ని కూడా కలిగి ఉంది. ఈ పరికరం బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను తగ్గించే ఐ కాంటాక్ట్, వాయిస్ ఫోకస్ వంటి ఫీచర్లతో వెబ్‌క్యామ్‌ను కలిగి ఉంది. AI కెమెరా, మైక్ ఫీచర్లలో ఐ కరెక్షన్, బ్లర్ ఎఫెక్ట్స్, వాయిస్ క్లారిటీ, ఆటోమేటిక్ ఫ్రేమింగ్ మొదలైనవి ఉన్నాయి.
Surface Studio 2++
ఇది మైక్రోసాఫ్ట్ కొత్త డెస్క్‌టాప్ PC, పాత వెర్షన్ కంటే ఐదు రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. ఇందులో Microsoft OpenAI రూపొందించిన ప్రత్యేకమైన DALL-E 2 సాంకేతికతతో కొత్త Microsoft డిజైనర్ యాప్‌ను ఇచ్చారు. డిజైన్‌కు సంబంధించి అద్భుతమైన ఫీచర్లు ఉంటాయి. ఈ డెస్క్‌టాప్ మూడు USB-C థండర్‌బోల్ట్ పోర్ట్‌లను కలిగి ఉంది. 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన స్క్రీన్ ఉంటుంది.
Presenter+ and Audio Dock
మైక్రోసాఫ్ట్ ఈవెంట్‌లో మైక్రోసాఫ్ట్ ప్రెజెంటర్, ఆడియో డాక్‌ను కూడా లాంచ్ చేసిందు. ఈ ప్రెజెంటర్+ అనేది మ్యూట్ బటన్‌తో కూడిన రిమోట్. దీనితో 'మైక్రోసాఫ్ట్ టీమ్స్' ను నియంత్రించవచ్చు. ఇక, ఆడియో డాక్ అనేది USD 250 స్పీకర్. దీనిని ఇతర డిస్‌ప్లేలతో కనెక్ట్ చేసుకోవచ్చు.