తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Bike : మార్కెట్‌లోకి గేర్ బాక్స్‌తో సూపర్ స్టైలిష్ ఎలక్ట్రిక్ బైక్.. ఫాస్ట్ ఛార్జింగ్

Electric Bike : మార్కెట్‌లోకి గేర్ బాక్స్‌తో సూపర్ స్టైలిష్ ఎలక్ట్రిక్ బైక్.. ఫాస్ట్ ఛార్జింగ్

Anand Sai HT Telugu

14 October 2024, 15:30 IST

google News
    • Matter Aera 5000 Electric Bikes : ఎలక్ట్రిక్ బైకుల వైపు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇంధన ధరతో సంబంధం లేకుండా వీటిపై రైడ్ చేయవచ్చు. కొత్తగా మ్యాటర్ ఏరా ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్స్ మెుదలయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో చూద్దాం..
మ్యాటర్ ఏరా ఎలక్ట్రిక్ బైక్
మ్యాటర్ ఏరా ఎలక్ట్రిక్ బైక్

మ్యాటర్ ఏరా ఎలక్ట్రిక్ బైక్

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు భారీ డిమాండ్ పెరుగుతోంది. చాలా వాహన తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ బైకులను మార్కెట్లోకి వదులుతున్నాయి. చాలా స్టార్టప్ ఆటోమేకర్లు పోటీగా ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నారు. అయితే ఎలక్ట్రిక్ బైక్‌లకు గేర్‌ లేదు, సౌండ్‌ లేదు అని చెప్పేవారు కూడా కూడా భిన్నంగా ఆలోచిస్తున్నారు. దీనికి పరిష్కారంగా అహ్మదాబాద్‌కు చెందిన మ్యాటర్ గ్రూప్ ప్రపంచంలోనే తొలిసారిగా గేర్ బాక్స్‌తో కూడిన ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసింది

ఇది మార్కెట్‌లో చాలా కాలంగా ఉన్నా.. అనేక మందికి ఈ విషయం గురించి తెలియదు. అయితే ఇప్పుడు మ్యాటర్ గ్రూప్ 5000, 5000 ప్లస్ అనే రెండు వేరియంట్లలో ఏరా ఎలక్ట్రిక్ బైక్ డెలివరీని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇటీవల ప్రారంభించిన అహ్మదాబాద్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ నుండి మొదటి దశ డెలివరీ జరిగింది.

ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఎలక్ట్రిక్ బైక్‌ల పంపిణీని ప్రారంభించాలని కంపెనీ నిర్ణయించింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైంది. మాన్యువల్ గేర్ షిఫ్టింగ్ సిస్టమ్ కలిగిన ఏకైక ఎలక్ట్రిక్ బైక్ ఈ ఏరాగా చెప్పవచ్చు. రెండు విభిన్న వేరియంట్లలో విడుదలైన వీటి ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.74 లక్షలు, రూ. 1.84 లక్షలుగా ఉంది.

మ్యాటర్ ఏరా బైక్‌లో ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్‌తో కూడిన LED హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. సైడ్ కౌల్స్ బైక్‌కు ఏరోడైనమిక్ సామర్థ్యాన్ని అందించడానికి రూపొందించారు. ఈ బైక్ సూపర్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుంది. ఇది మోటార్, బ్యాటరీ కోసం అంతర్గతంగా అభివృద్ధి చెందిన లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో వస్తుంది.

మ్యాటర్ కంపెనీ ప్రస్తుతం తమ అధికారిక వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా బుకింగ్‌లను తీసుకుంటోంది. ఏరాను ముందుగా బుక్ చేసుకున్న కస్టమర్లు మెుదట డెలివరీ అందుకుంటారు. మ్యాటర్ ఏరా 5,000, 5,000 ప్లస్ అనే రెండు వేరియంట్‌లలో విక్రయిస్తున్నారు. రెండింటిలోనూ ఒకే ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ ప్యాక్ ఉంటాయి. పవర్ అవుట్‌పుట్ 10 kW వద్ద రేట్ ఉంది. ఈ మేటర్ ఎలక్ట్రిక్ బైక్ 6 సెకన్లలో 0 నుండి 60 కిమీ వేగాన్ని అందుకుంటుంది. ఈ బైక్ 5 kWh బ్యాటరీ ప్యాక్ నుండి 125 కి.మీ పరిధిని అందిస్తుంది. ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగిస్తే 5 గంటలు, 2 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. అంతేకాకుండా ఇది ఐపీ67 రేటింగ్ పొందింది.

ఈ కొత్త మ్యాటర్ ఏరా ఎలక్ట్రిక్ బైక్ రెండు వెర్షన్లు 4-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్, నాలుగు రైడింగ్ మోడ్‌లతో వస్తాయి. ఫ్రంట్, బ్యాక్ డిస్క్ బ్రేక్‌లు కూడా ఉంటాయి. సేఫ్టీ ఫీచర్లలో భాగంగా డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ కూడా కలిగి ఉంది. మ్యాటర్ ఏరా ఎలక్ట్రిక్ బైక్ కావాలి అనుకునేవారు బుక్ చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం