Best Bikes : మిడిల్ క్లాస్ వాళ్లకి ఈ బైక్స్ బెస్ట్.. ఈ లిస్టులో మీకు నచ్చే బైక్ ఉందా?
Best Bikes : తక్కువ ధరలో మంచి బైక్స్ తీసుకోవాలని చూస్తే మీకోసం కొన్ని ఉన్నాయి. ధరతోపాటుగా మైలేజీ విషయంలోనూ బాగున్నాయి. ఆ బైక్స్ ఏంటో చూద్దాం..
చాలా మంది అందుబాటు ధరలో బైక్ తీసుకోవాలని చూస్తారు. ధర తక్కువ ఉండటంతోపాటుగా మైలేజీ కూడా ఇస్తాయి. రోజువారీ వినియోగానికి బైకులు అవసరం. చాలా మందికి ఏ బైక్ తీసుకోవాలో తెలియదు. అందుబాటు ధరలో మంచి బైక్ తీసుకుంటే బాగుంటుంది. మీరు ఏ బైక్ తీసుకోవాలని చూస్తుంటే.. మీకోసం కొన్ని బైక్స్ ఉన్నాయి. ఈ లిస్టులో హోండా షైన్ 125, టీవీఎస్ రైడర్ 125, బజాజ్ పల్సర్ 125, హీరో గ్లామర్, స్ప్లెండర్ ప్లస్ మోటార్‌సైకిళ్లు ఉన్నాయి. ఈ బైకుల గురించి చూద్దాం..
బజాజ్ పల్సర్ 125 బైక్ 57 కేఎంపీఎల్ మైలేజీని ఇస్తుంది. దీని బరువు దాదాపు 140 కిలోలు, 11.5 లీటర్ల సామర్థ్యం గల ఇంధన ట్యాంక్‌తో వస్తుంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో సహా వివిధ ఫీచర్లను కలిగి ఉంది. సేఫ్టీ కోసం డ్రమ్ బ్రేక్ ఎంపికతో ఉంటుంది.
హోండా షైన్ 125 బైక్ ధర రూ.81,549 నుండి రూ.85,550 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. 123.94 సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్, 5-స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి ఉంది. 55 కేఎంపీఎల్ వరకు మైలేజీని అందిస్తుంది. ఇది జెన్నీ గ్రే మెటాలిక్, డీసెంట్ బ్లూ మెటాలిక్ వంటి అనేక రంగులలో కూడా అందుబాటులో ఉంది.
బజాజ్ పల్సర్ 125 మోటార్‌సైకిల్ ధర రూ.84,269 నుండి రూ.99,373 ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ఇది 11.8 PS హార్స్ పవర్, 10.8 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 124.4సీసీ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కూడా కలిగి ఉంటుంది.
హీరో గ్లామర్ ధర రూ. 84,548 నుండి రూ. 88,548 ఎక్స్-షోరూమ్ ధరగా ఉంది. ఇది 125 సీసీ ఇంజిన్‌ను కలిగి ఉంది. 63 కేఎంపీఎల్ మైలేజీని అందిస్తుంది. క్యాండీ బ్లేజింగ్ రెడ్, బ్లాక్ స్పోర్ట్స్ రెడ్, బ్లాక్ టెక్నో బ్లూ వంటి అనేక రంగులలో కూడా అందుబాటులో ఉంది.
టీవీఎస్ రైడర్ 125 కూడా రూ. 93,859 నుండి రూ. 1.09 లక్షల ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ఇది 124.8 సీసీ పెట్రోల్, 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ని పొందుతుంది. 57 కేఎంపీఎల్ వరకు మైలేజీని అందిస్తుంది. ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఐడిల్ స్టాప్/స్టార్ట్ సిస్టమ్‌తో సహా అనేక ఫీచర్లు ఉన్నాయి.
హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.76,356 నుండి రూ.77,496గా ఉంది. ఇది 97.2 సీసీ ఇంజిన్‌ను కలిగి ఉంది. 80.6 కేఎంపీఎల్ మైలేజీని అందిస్తుంది. ఇది రైడర్ భద్రత కోసం డ్రమ్ బ్రేక్ ఎంపికతో వస్తుంది.