Tata Electric Cars : ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌పై టాటా ఫోకస్.. 500 కి.మీ రేంజ్‌తో మార్కెట్‌లోకి మరో మూడు ఈవీలు-tata motors focus on electric car market planning to launch 3 ev with 500 km range ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Electric Cars : ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌పై టాటా ఫోకస్.. 500 కి.మీ రేంజ్‌తో మార్కెట్‌లోకి మరో మూడు ఈవీలు

Tata Electric Cars : ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌పై టాటా ఫోకస్.. 500 కి.మీ రేంజ్‌తో మార్కెట్‌లోకి మరో మూడు ఈవీలు

Anand Sai HT Telugu

Tata Electric Cars : ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్‌పై టాటా మోటర్స్ కన్నేసింది. మరో మూడు ఈవీలను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాప్‌లో ఉంది టాటా.

టాటా హారియర్ ఈవీ

భారతీయ వినియోగదారుల్లో ఎలక్ట్రిక్ కార్ల(ఈవీ)లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. అయితే టాటా మోటార్స్ ప్రస్తుతం ఈ విభాగంలో ఏకపక్ష ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. భారతదేశంలో మొత్తం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ వాటా 65 శాతంగా ఉంది. ఇప్పుడు కంపెనీ తన అమ్మకాలను పెంచుకోవడానికి రాబోయే 2 సంవత్సరాలలో అనేక కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఒక వార్త ప్రకారం కంపెనీ రాబోయే మోడళ్లు దగ్గరలోనే లాంచ్ కానున్నాయి. టాటా కంపెనీ నుంచి రాబోయే 3 ఎలక్ట్రిక్ కార్ల ఫీచర్ల గురించి తెలుసుకుందాం..

టాటా హారియర్ ఈవీ

ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తొలిసారిగా 2023 ఆటో ఎక్స్ పోలో హారియర్ ఈవీని ప్రదర్శించింది. ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2024లో దీనిని రెండోసారి ప్రదర్శించారు. టాటా హారియర్ ఎలక్ట్రిక్ వేరియంట్ 2024 చివరిలో లాంచ్ కావచ్చని అనేక మీడియా నివేదికలు చెబుతున్నాయి. రాబోయే టాటా హారియర్ ఈవీలో 60 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది, ఇది సుమారు 500 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ అందిస్తుంది.

టాటా సఫారీ ఈవీ

టాటా కంపెనీ తన పాపులర్ ఎస్‌యూవీ సఫారీ ఎలక్ట్రిక్ వేరియంట్‌ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. టాటా సఫారీ ఎలక్ట్రిక్ వేరియంట్లు రోడ్లపై టెస్టింగ్ సమయంలో చాలాసార్లు కనిపించాయి. టాటా సఫారీ ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా హారియర్ ఈవీ దగ్గరలోనే లాంచ్ కావచ్చని అనేక మీడియా నివేదికలు చెబుతున్నాయి.

టాటా సియెర్రా ఈవీ

టాటా మోటార్స్ వచ్చే ఏడాది అంటే 2025లో సియెర్రా ఈవీని భారత మార్కెట్లో విడుదల చేయనుంది. కంపెనీ తన కాన్సెప్ట్ వెర్షన్‌ను 2023 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించింది. టాటా సియెర్రా ఈవీ సఫారీ, హారియర్ ఈవీ మాదిరిగానే పవర్ట్రెయిన్‌ను పొందే అవకాశం ఉంది.