Ratan Tata: రతన్ టాటా చెప్పిన ఈ విషయాలు పాటిస్తే మీ జీవితమే మారిపోతుంది, విజయమే మీతో స్నేహం చేస్తుంది-these inspirational quotes by ratan tata will change your life success will come ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ratan Tata: రతన్ టాటా చెప్పిన ఈ విషయాలు పాటిస్తే మీ జీవితమే మారిపోతుంది, విజయమే మీతో స్నేహం చేస్తుంది

Ratan Tata: రతన్ టాటా చెప్పిన ఈ విషయాలు పాటిస్తే మీ జీవితమే మారిపోతుంది, విజయమే మీతో స్నేహం చేస్తుంది

Haritha Chappa HT Telugu

Ratan Tata: రతన్ టాటా నాటి తరానికి, నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకం. మీరు కూడా మీ జీవితంలో విజయ శిఖరాన్ని అందుకోవాలంటే, రతన్ టాటా చెప్పిన ప్రేరణాత్మక సూక్తులు మీకు సహాయపడతాయి.

రతన్ టాటా

టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా తన నిరాడంబరత, సత్ప్రవర్తనతో ప్రజల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. రతన్ టాటా నాటి తరానికే కాదు, రాబోయే తరాలకు కూడా స్ఫూర్తిదాయకం. మీరు కూడా మీ జీవితంలో విజయ శిఖరాన్ని చేరాలనుకుంటే రతన్ చెప్పిన సూక్తులను పాటించండి. జీవితంలో నిరాశ కమ్మినప్పుడు, వైఫల్యం వల్ల కుంగిపోయినప్పుడు రతన్ టాటా సూక్తులను చదవండి. కచ్చితంగా మీలో నూతనోత్సాహం ఉప్పొంగుతుంది. జీవితంలో ఏదైనా సాధించాన్న కోరిక కలుగుతుంది.

టాటా గ్రూప్ ను విజయంవంతంగా నడిపిన వ్యక్తి రతన్ టాటా. దేశంలో చిన్న వ్యాపారాలను ఎన్నో మొదలుపెట్టి పెద్ద కర్మాగారాలుగా మార్చిన శక్తి రతన్ టాటాదే. టాటా గ్రూప్ మార్కెట్ వాల్యూ ఇప్పుడు 33.6 లక్షల కోట్లు అని చెప్పుకుంటారు. ఎంత ఆస్తి ఉన్నా కూడా ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. దేశాభివృద్ధికి బాటలు వేసిన మహనీయుల్లో ఈయన ఒకరు. టాటా గ్రూప్ మీద ఆధారపడి మనదేశంలో లక్షల కుటుంబాలు జీవిస్తాయి. జీవితంలో హెచ్చుతగ్గులను ఒకేలా తీసుకుని రతన్ టాటా ముందుకెళ్లారు. విరాళాలు ఇవ్వడంలో రతన్ టాటా తరువాతే ఎవరైనా. మనదేశంలో ఏ బిలియనీర్ చేయనన్ని దానాలు రతన్ టాటా చేశారు. 

రతన్ టాటా చెప్పిన ప్రేరణాత్మక సూక్తులు

1. జీవితంలో కష్టాలు ఒకే వ్యక్తికి వస్తాయి,

వాటిని ఎదుర్కొనే సామర్థ్యం ఎవరికుందో వారికే.

 

2. ఈ ప్రపంచం అవసరాన్ని బట్టి నడుస్తుంది,

శీతాకాలంలో సూర్యుడు కోసం ఎదురు చూస్తాం,

వేసవిలో మాత్రం అదే సూర్యుడిని వద్దనుకుంటాం.

అవసరమైనంత వరకే దేనికైనా విలువ.

 

3. అన్నింట్లోకి అతి పెద్ద రిస్క్ ఏంటో తెలుసా….

ఎలాంటి రిస్క్ తీసుకోకపోవడం.

శరవేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో

రిస్క్ తీసుకోకపోతే విఫలం కావడం గ్యారంటీ.

 

4. మీ తప్పు మీదే, మీ వైఫల్యం మీదే,

దానికి ఎవరినీ నిందించకండి.

ఆ తప్పు నుంచి పాఠాలు నేర్చుకుని జీవితంలో ముందుకు సాగాలి.

 

5. ఇతరులను అనుకరించే వ్యక్తులు

తక్కువ కాలంలో విజయాన్ని సాధించవచ్చు,

కానీ వారు జీవితంలో ఎక్కువ దూరం ప్రయాణించలేరు.

 

6. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో నాకు నమ్మకం లేదు.

నేను నిర్ణయాలు తీసుకుంటాను

అవి సరైనవి అని రుజువు చేస్తాను.

 

7. ఇనుమును ఏదీ నాశనం చేయలేదు,

కానీ దానికి పట్టే సొంత తుప్పు దానిని నాశనం చేయగలదు

అదేవిధంగా, ఎవరూ ఒక వ్యక్తిని నాశనం చేయలేరు,

కానీ అతని సొంత బుద్ధి, మనస్తత్వం సరిగాలేకపోతే అతడు నాశనమైపోతాడు.

 

8. ప్రజలు మీపై రాళ్లు విసిరితే, ఆ రాళ్లను

ఉపయోగించి మీ రాజభవనాన్ని నిర్మించండి.

 

9. ఓటమికి భయపడకుండా ఉండటమే

విజయానికి ఏకైక మార్గం.

 

10. ప్రయత్నించకపోవడమే పెద్ద వైఫల్యం.