తెలుగు న్యూస్  /  బిజినెస్  /  తక్కువ ధరలో 33 కి.మీ మైలేజీ ఇచ్చే మారుతి ఆల్టోపై కిర్రాక్ ఆఫర్.. ఈ కారుపై బిగ్ డిస్కౌంట్!

తక్కువ ధరలో 33 కి.మీ మైలేజీ ఇచ్చే మారుతి ఆల్టోపై కిర్రాక్ ఆఫర్.. ఈ కారుపై బిగ్ డిస్కౌంట్!

Anand Sai HT Telugu

10 November 2024, 9:16 IST

google News
    • Maruti Alto K10 Discount : మారుతి ఆల్టో కె10 కారు అమ్మకాల్లో తోపు. తక్కువ ధరతో మంచి మైలేజీ ఇస్తుంది. ఈ సూపర్ కారుపై మంచి డిస్కౌంట్ లభిస్తుంది.
మారుతి సుజుకి ఆల్టో కె10
మారుతి సుజుకి ఆల్టో కె10

మారుతి సుజుకి ఆల్టో కె10

భారత్‌లో ఎక్కువగా అమ్ముడైన కార్లలో మారుతి ఆల్టో కె10 ముందు వరుసలో ఉంటుంది. ఇది తక్కువ ధరలో అందుబాటులో ఉన్న చిన్న హ్యాచ్‌బ్యాక్. చిన్న ఫ్యామిలీలకు భళే సెట్ అవుతాయి. చాలా మంది దసరా, దీపావళి ఆఫర్లలో కార్లు కొన్నారు. కొంతమంది కొనలేకపోయారు. అలాంటి వారి కోసం బెస్ట్ ఆప్షన్ మారుతి ఆల్టో కె10. ఈ కారుపై డిస్కౌంట్ దొరుకుతుంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

మారుతి ఆల్టో కె10లో 1 లీటర్ పెట్రోల్, సీఎన్‌జీ ఇంజన్‌ ఉంటుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్‌తో ఉంటుంది. పెట్రోల్ ఆధారిత వేరియంట్‌లు 24.39 నుండి 24.90 kmpl మైలేజీని అందిస్తాయి. సీఎన్జీ పవర్డ్ వేరియంట్‌లు 33.85 కిలో మీటర్ల వరకు ఇస్తాయి. ఈ కారులో నలుగురు వ్యక్తులు హ్యాపీగా వెళ్లవచ్చు.

ఈ కారు మెటాలిక్ సిజ్లింగ్ రెడ్, మెటాలిక్ సిల్కీ సిల్వర్, మెటాలిక్ గ్రానైట్ గ్రే వంటి వివిధ రంగులలో కూడా దొరుకుతుంది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇంజిన్ స్టార్ట్-స్టాప్ బటన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో సహా పలు ఫీచర్లతో లభిస్తుంది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్(యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఉన్నాయి. ఈ కారు బేస్ ధర రూ.3.99 లక్షలుగా ఉంది. టాప్ వేరియంట్ ధర రూ.5.96(ఎక్స్ షోరూమ్‌)గా ఉంది.

మారుతి సుజుకి ఆల్టో కె10 ఈ నవంబర్‌లో భారీ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ కారు సీఎన్జీ వేరియంట్‌పై రూ.40,000, పెట్రోల్ పవర్డ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (గేర్‌బాక్స్)పై రూ.45,000, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (గేర్‌బాక్స్) వేరియంట్‌లపై రూ.50,000 తగ్గింపు అందిస్తుంది. అయితే మీ ప్రాంతాన్ని బట్టి డిస్కౌంట్ కొంచెం అటు ఇటుగా ఉండవచ్చని గమనించాలి.

మారుతి ఆల్టో కె10 ఎల్ఎక్స్ఐ  (పెట్రోల్) వేరియంట్ ఆన్-రోడ్ ధర సుమారు రూ. 5.80 లక్షలుగా ఉంది. మీరు రూ.2.50 లక్షల డౌన్‌పేమెంట్‌తో ఈ కారును కొనుగోలు చేస్తే, మీకు రూ.3.30 లక్షల వరకు రుణం దొరుకుతుంది. 8 శాతం వడ్డీ రేటుతో 5 సంవత్సరాల పాటు నెలకు రూ.6,500 వరకు ఈఎంఐ చెల్లించాలి.

మారుతి ఆల్టో K10 హ్యాచ్‌బ్యాక్ వీఎక్స్ఐ (పెట్రోల్) వేరియంట్ ఆన్ రోడ్ ధర రూ.6 లక్షల వరకూ ఉంది. రూ.2.50 లక్షల డౌన్‌పేమెంట్‌తో కొనుగోలు చేస్తే.. రూ.3.50 లక్షల వరకు రుణం బకాయి ఉంటుంది. 8 శాతం వడ్డీ చెల్లించాలి. 5 సంవత్సరాలకు రూ.7,000 వరకు నెలవారీ ఈఎంఐ కట్టాలి.

ఆల్టో కె10 వీఎక్స్ఐ ప్లస్ (పెట్రోల్) వేరియంట్ ఆన్ రోడ్ ధర రూ. 6.50 లక్షలుగా ఉంటుంది. రూ.2.50 లక్షల డౌన్‌పేమెంట్‌తో ఈ హ్యాచ్‌బ్యాక్‌ను కొనుగోలు చేస్తే రూ.4 లక్షల వరకు లోన్ దొరుకుతుంది. 8 శాతం వడ్డీ రేటుతో ఐదేళ్లపాటు నెలకు రూ.8,000 వరకు ఈఎంఐ చెల్లించాలి.

కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ VXI AT (పెట్రోల్) వేరియంట్ ఆన్-రోడ్ ధర రూ. 6.60 లక్షలుగా నిర్ణయించారు. రూ.2.50 లక్షల డౌన్‌పేమెంట్‌ చేస్తే.. ఈ కారుపై రూ.4.10 లక్షల వరకు లోన్ ఉంటుంది. 8 శాతం వడ్డీతో 5 సంవత్సరాల పాటు రూ.8,000 కంటే ఎక్కువ నెలవారీ ఈఎంఐ చెల్లించాలి.

మీకు మరింత సమాచారం కావాలి అంటే దగ్గరలోని డిలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. ఇక్కడ కొన్ని వేరియంట్ల గురించి మాత్రమే చెప్పాం.

తదుపరి వ్యాసం