తెలుగు న్యూస్  /  బిజినెస్  /  రూ.2 వేల కోట్ల పెట్టుబడి లక్ష్యంగా మారుతి ఇస్పాత్ అండ్ పైప్స్ ప్రణాళికలు.. మార్కెట్లోకి కొత్త ఉత్పత్తులు

రూ.2 వేల కోట్ల పెట్టుబడి లక్ష్యంగా మారుతి ఇస్పాత్ అండ్ పైప్స్ ప్రణాళికలు.. మార్కెట్లోకి కొత్త ఉత్పత్తులు

Anand Sai HT Telugu

27 June 2024, 12:26 IST

google News
    • Maruti Ispat and Pipes : సరికొత్త ఉత్పత్తులతో మారుతి ఇస్పాత్ అండ్ పైప్స్ మార్కెట్లోకి వస్తుంది. వచ్చే ఐదేళ్లలో రూ.2వేల కోట్ల పెట్టుబడి లక్ష్యంతో విస్తరణ ప్రణాళికలు చేస్తుంది. ఎంఎస్ వాయు పేరిట వినూత్న ఉత్పత్తులకు శ్రీకారం చుట్టింది.
సరికొత్త ఉత్పత్తులతో మారుతి ఇస్పాత్ అండ్ పైప్స్
సరికొత్త ఉత్పత్తులతో మారుతి ఇస్పాత్ అండ్ పైప్స్

సరికొత్త ఉత్పత్తులతో మారుతి ఇస్పాత్ అండ్ పైప్స్

హైదరాబాద్ కేంద్రంగా దక్షిణాదిలోని రెండో అతిపెద్ద స్టీల్ ఉత్పత్తి సంస్థ అయినా ఎంఎస్ అగర్వాల్ గ్రూప్ అనుబంధ సంస్థ మారుతీ ఇస్పాత్ అండ్ పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్ (MIPPL) సంస్థ MS VAYU అనే కొత్త బ్రాండ్‌ తీసుకొస్తుంది. దీని పేరిట ఈఆర్‌డబ్ల్యూ ​​స్టీల్ పైపులను ఆవిష్కరించింది. వాణిజ్య, వ్యాపారవిస్తరణపై దృష్టి పెట్టి వచ్చే ఐదేళ్లలో రూ. 2000 కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో సరికొత్త బ్రాండ్‌ను ప్రవేశపెట్టింది. దక్షిణాధి రాష్ట్రాలతోపాటు, మధ్య, పశ్చిమ రాష్ట్రాలకు విస్తరించగా... కొత్త బ్రాండ్‌తో వ్యాపారాన్ని మరింత విస్తరించనుంది.

విస్తరించేందుకు ప్రణాళికలు

వచ్చే ఐదేళ్లలో 6 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో MIPPL విస్తరణ ప్రణాళికలో ఇదొక కీలకమైందని పేర్కొంది. మార్కెట్లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ దేశంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాలకు వేగంగా విస్తరించేందుకు కొత్త ప్రాంతాల్లోనూ ఉత్పత్తి సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.

ఐపీఓకు

వాణిజ్య, వ్యాపార వ్యూహాత్మక విస్తరణలో భాగంగా MIPPL ఇతర విభాగాల్లోనూ అడుగుపెడుతోంది. విస్తరణ, వైవిధ్యమైన ప్రణాళికలను అమలుచేసే లక్ష్యంతో 2026 నాటికి ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO)ని నిర్వహించాలని భావిస్తోంది. నాణ్యమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి కట్టుబడి ఉంటూనే తయారీ యూనిట్‌లో ఆధునిక సౌకర్యాలతో నాణ్యమైన పైపులు, స్పాంజ్ ఐరన్, ERW స్టీల్ పైపులు, బిల్లెట్‌లను ఉత్పత్తి చేయడానికి సమర్థవంతమైన ఆర్‌అండ్‌డీ విభాగాన్ని MIPPL కలిగి ఉంది.

ఉత్పిత్తి పెంపుపై దృష్టి

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ మంత్రాలయంలో ఉన్న 300ఎకరాల ప్లాంట్ నుండి సుస్థిర భవిష్యత్తు వృద్ధి లక్ష్యంతో, మారుతీ ఇస్పాత్ ప్రస్తుతం 8 MW -WHRB శక్తిని ఉత్పత్తి చేస్తోంది. అదేవిధంగా విండ్, సోలార్ పవర్ వంటి గ్రీన్, పునరుత్పాదక వనరుల నుండి 90శాతం పైగా శక్తిని ఉత్పత్తి చేయాలని యోచిస్తోంది. వ్యర్థాల తగ్గింపు కోసం ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించి ఉత్పత్తిని పెంచాలని చూస్తోంది.

ఎంఎస్ వాయు

కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలపై మారుతీ ఇస్పాత్ అండ్ పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్ CEO అభిషేక్ అగర్వాల్ హర్షం వ్యక్తం చేశారు. ఉక్కు పరిశ్రమలో తమ స్థానాన్ని బలోపేతం చేసుకునేలా వ్యాపార విస్తరణపై దృష్టి పెట్టినట్లుగా తెలిపారు. అదేవిధంగా వినియోగదారులకు అధిక-నాణ్యత ఉత్పత్తులను అందించడం ద్వారా మార్కెట్‌లో తమ ఉనికిని పెంచుకోవడమే లక్ష్యమని వివరించారు. ప్రస్తుతం ERW స్టీల్ పైప్‌లను ఉత్పత్తి చేస్తున్నామని స్పష్టం చేశారు. MS వాయు పేరిట గాల్వనైజ్డ్ పైపులు, గాల్వనైజ్డ్ హాట్ డిప్ ఐరన్, గాల్వా వాల్యూమ్ పైపులు వంటి కొత్త ఉత్పత్తులను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తామని చెప్పారు. ఈ కొత్త ఉత్పత్తులు మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చగలుగుతాయని వివరించారు.

2026 నాటికి ఐపీవో లక్ష్యంతో ప్రస్తుతం ఉన్న మారుతీ ఇస్పాత్ అండ్ పైప్స్‌ను బ్రాండ్ నేమ్‌ను సుస్థిరం చేసుకునేలా పబ్లిక్ ఆఫర్ అండ్ అక్విజిషన్ స్ట్రాటజీని ప్లాన్ చేస్తోందన్నారు. అదేవిధంగా విస్తరణతో ఉత్తరాది రాష్ట్రాలైన జమ్మూకశ్మీర్, పంజాబ్, ఉత్తరాఖండ్, అలాగే తూర్పులోని పశ్చిమబెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాల్లోనూ గణనీయమైన ఉద్యోగ అవకాశాల కల్పన, స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా కార్యాచరణ రూపొందించామని తెలిపారు.

ఇప్పటికే మారుతీ ఇస్పాత్ అండ్ పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యాపార తీరుతెన్నులను ఆధారంగా చేసుకుని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్-రా) సంస్థ 'IND BBB+' రేటింగ్‌ను ధృవీకరించిందని అభిషేక్ అన్నారు.

తదుపరి వ్యాసం