తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Moo Deng Meme Coin : కేవలం 17 రోజుల్లో.. రూ. 1లక్ష పెట్టుబడి = రూ. 100 కోట్లు! ఎలా సాధ్యమైంది?

Moo Deng meme coin : కేవలం 17 రోజుల్లో.. రూ. 1లక్ష పెట్టుబడి = రూ. 100 కోట్లు! ఎలా సాధ్యమైంది?

Sharath Chitturi HT Telugu

01 October 2024, 5:45 IST

google News
  • Moo deng meme coin price : వైరల్ పిగ్మీ హిప్పో స్ఫూర్తితో వచ్చిన మూ డెంగ్ అనే మీమ్ కాయిన్​లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్.. ఏకంగా రూ. 1లక్షను రూ. 100కోట్లుగా మార్చాడు. అది కూడా కేవలం 17 రోజుల్లోనే!

వైరల్​ మూ డెంగ్​ పిగ్నీ మీమ్​ కాయిన్​..
వైరల్​ మూ డెంగ్​ పిగ్నీ మీమ్​ కాయిన్​.. (AFP, lookonchain)

వైరల్​ మూ డెంగ్​ పిగ్నీ మీమ్​ కాయిన్​..

ఒక క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్ ఇటీవల ఒక సాధారణ పెట్టుబడిని వైరల్ ఇంటర్నెట్ విషయంతో ముడిపడి ఉన్న మీమ్ కాయిన్​తో భారీ సంపదగా మార్చాడు! సెప్టెంబర్ 10న లాకోన్ చైన్ అని పిలిచే పెట్టుబడిదారుడు థాయ్​లాండ్​కు చెందిన యువ పిగ్మీ హిప్పో స్ఫూర్తితో మూ డెంగ్ అనే క్రిప్టోకరెన్సీలో 1,300 డాలర్లు (సుమారు రూ. 1 లక్ష) పెట్టాడు. నాణేనికి పెరుగుతున్న ప్రజాదరణ కారణంగా కేవలం 17 రోజుల్లోనే ఆ పెట్టుబడి రూ.100 కోట్లకు పైగా పెరిగింది!

మూ డెంగ్ అంటే ఏంటి?

తన విలక్షణ రూపానికి ప్రసిద్ధి చెందిన రెండు నెలల హిప్పోకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో నాణెం పేరు మూ డెంగ్ ఇంటర్నెట్ సెన్సేషన్​గా మారింది. ఇన్​స్టాగ్రామ్, టిక్​టాక్ వంటి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అయిన ఈ వీడియోలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించాయి. ఫలితంగా, మూ డెంగ్ ఇమేజ్, ఆకర్షణ త్వరగా అన్ని ప్రాంతాలకు వ్యాపించింది. ఫలితంగా మూ డెంగ్​ పేరు కలిగి ఉన్న క్రిప్టోకరెన్సీపై ప్రజల్లో విపరీతంగా ఆసక్తిని పెరిగింది.

మీమ్ కాయిన్స్ ఎలా పనిచేస్తాయి?

మీమ్​ కాయిన్స్​ అనేవి డిజిటల్​ కరెన్సీలో ఒక ట్రెండ్​ లాంటివి. ఇంటర్నెట్​లో వైరల్​ అయ్యే మూమెంట్స్​, జంతువులు, మీమ్స్​పై ఇవి ఆధారపడి ఉంటాయి. బిట్​కాయిన్​ వంటి సాంప్రదాయ క్రిప్టోరెన్సీల్లా కాకుండా ఈ కాయిన్స్​ వాల్యూ సోషల్​ మీడియా బజ్​, ఆన్​లైన్​ ట్రెండ్స్​ వల్ల పెరుగుతుంది. ఇప్పుడు మూ డెంగ్​ సక్సెస్​ అవ్వడంతో, ఇప్పటికే విజయం సాధించిన డోజీకాయిన్​, షిబా ఇను వంటి ప్రముఖ మీమ్​ కాయిన్స్​ సరసన చేరింది.

మూ డెంగ్ లో చిన్న పెట్టుబడి నుంచి జీవితాన్ని మార్చే లాభం వైపు తమ ప్రయాణాన్ని పంచుకున్న యూజర్ల కథ ఇప్పుడు ఆన్​లైన్​లో వైరల్​గా మారుతున్నాయి. కేవలం రెండు వారాల్లోనే, పిగ్మీపై పెరుగుతున్న ఫోకస్​, మీమ్ ఆధారిత డిజిటల్ కరెన్సీల చుట్టూ పెరుగుతున్న ధోరణి కారణంగా క్రిప్టోకరెన్సీ విలువ వృద్ధి చెందింది.

మూ డెంగ్​ సక్సెస్​తో మరిన్ని..?

మూ డెంగ్ ప్రభావం క్రిప్టోకరెన్సీ ప్రపంచానికే పరిమితం కాలేదు! ఆ వైరల్ వీడియోలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న బ్యూటీ ట్రెండ్​కు ప్రేరణగా నిలిచాయి. హిప్పో లుక్ నుంచి సూచనలు తీసుకున్న బ్యూటీ ఇన్​ఫ్లుయయెన్సర్లు దాని లక్షణాలను అనుకరించే మేకప్ స్టైల్స్​ని రూపొందించారు. ఇంటర్నెట్ ప్రియమైన హిప్పోకు వివిధ ప్రాంతాలకు చెందిన ఇన్​ఫ్లుయెన్సర్లు నివాళులు అర్పిస్తుండటంతో సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్​లో ఈ ధోరణిని కొనసాగిస్తున్నాయి.

మూ డెంగ్ కీర్తికి ఎదగడం దాని జూకీపర్​ను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ది గార్డియన్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. హిప్పోకు లభించిన అంతర్జాతీయ ఖ్యాతిపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మూ డెంగ్ థాయ్​లాండ్​లో కొంత గుర్తింపు పొందుతుందని తాను ఆశించానని, కానీ ప్రపంచవ్యాప్తంగా కీర్తి దక్కుతుందని ఊహించలేదని పేర్కొంది.

అయితే ఇక్కడ ప్రజలు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. క్రిప్టోకరెన్సీ అనేది చాలా రిస్క్​తో కూడుకున్న వ్యవహారం. దీనికి రెగ్యులేటరీ కూడా లేదు. రూ. 1 లక్ష అనేది రూ. 100 కోట్లుగా మారొచ్చు లేదా మొత్తం ఆవిరైపోవచ్చు!

(గమనిక:- ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్​వెస్ట్​మెంట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

తదుపరి వ్యాసం