Mahindra XUV. e9 : ఎం అండ్ ఎం నుంచి మరో రెండు ఈవీలు.. ఇవే!
11 February 2023, 6:23 IST
- Mahindra XUV. e9 : దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా.. రెండు కొత్త ఈవీలను ప్రదర్శించింది. వీటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాము.
మహీంద్రా ఎక్స్‌యూవీ. ఈ9
Mahindra XUV. e9 showcased in India : దేశ ఈవీ సెగ్మెంట్లో రారాజుగా కొనసాగుతున్న టాటా మోటార్స్‌కు గట్టిపోటీనిచ్చేందుకు సిద్ధమైంది మరో దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్. ఈ క్రమంలోనే మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీని లాంచ్ చేసింది. ఇక ఇప్పుడు మరికొన్ని మోడల్స్‌పై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా.. ఎక్స్‌యూవీ.ఈ9, బీఈ.05 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను తొలిసారిగా ఇండియాలో ప్రదర్శనకు ఉంచింది.
ఈవీ సెగ్మెంట్‌పై ఫోకస్..
ఈ ఎక్స్‌యూవీ. ఈ9, బీఈ.05 ఈవీలను గతేడాది యూకేలో జరిగిన ఈవెంట్లో తొలిసారి ప్రదర్శించింది మహీంద్రా అండ్ మహీంద్రా. ప్రస్తుతానికి ఇవి కాన్సెప్ట్ స్టేజ్‌లోనే ఉన్నప్పటికీ.. వీటిని పరిశీలిస్తే.. ఎస్యూవీ, ఈవీ సెగ్మెంట్‌ను ఎం అండ్ ఎం ఎంత సీరియస్‌గా పరిగణిస్తోందో స్పష్టమవుతుంది.
Mahindra XUV. e9 details : స్కార్పియో-ఎన్, అప్డేటెడ్ థార్, ఎక్స్‌యూవీ700, అప్డేటెడ్ బొలేరో వంటి లేటెస్ట్ మోడల్స్ హిట్ కొట్టడంతో మహీంద్రా అండ్ మహీంద్రా సిబ్బందికి నూతన ఉత్తేజం లభించింది. ఈ క్రమంలోనే భవిష్యత్తు లాంచ్‌లపై ఫోకస్ చేసింది. మరీ ముఖ్యంగా ఈవీ సెగ్మెంట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని చూస్తోంది. అందుకే.. ఎక్స్‌యూవీ.ఈవీ, బీఈ.05 మోడల్స్ కీలకంగా మారాయి.
Mahindra XUV700 price : భారీగా పెరిగిన మహీంద్రా ఎక్స్‌యూవీ700 ధర. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
2024 చివర్లో..
ఎక్స్‌యూవీ.ఈ రేంజ్లో రెండు మోడల్స్, ఎక్స్‌యూవీ బీఈ రెంజ్లో మూడు మోడల్స్ ఉంటాయని ఎం అండ్ ఎం ఇప్పటికే ప్రకటించింది. ఈ మోడల్స్‌ను సరికొత్త ఐఎన్జీఎల్ఓ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించనుంది. ఇక ఎక్స్‌యూవీ. ఈ ప్రొడక్షన్ 2024 డిసెంబర్లో ప్రారంభంకానుంది. ఎక్స్‌యూవీ. బీఈ మోడల్స్ ప్రొడక్షన్ 2025 అక్టోబర్‌లో మొదలవ్వనుంది.
Mahindra future electric cars : కాగా.. శుక్రవారం ప్రదర్శనకు ఉంచిన మహీంద్రా ఎక్స్‌యూవీ.ఈ9 మోడల్ 2025 ఏప్రిల్‌లో ప్రొడక్షన్‌కు వెళ్లే అవకాశం ఉంది. దీని పొడవు 4,790ఎంఎం, వెడల్పు 1,905ఎంఎం, ఎత్తు 1,690ఎంఎం. వీల్‌బేస్ వచ్చేసి 2,775ఎంఎం ఉంటుంది. మరోవైపు ఎక్స్‌యూవీ బీఈ.05 మోడల్ పొడవు 4,370ఎంఎం, వెడల్పు 1,900ఎంఎం, ఎత్తు 1,635ఎంఎం. ప్రీమియం, మిడ్-సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లోకి ఇది చేరనుంది.
M&M Q3 results 2023 పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
స్పెసిఫికేషన్స్.. ఫీచర్స్..
Mahindra XUV BE.05 variant latest news : ఈ రెండు మోడల్స్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించలేదు. అయితే.. క్యాబిన్ ఫీచర్స్‌ను బయటపెట్టింది. భారీ డిస్ప్ల స్క్రీన్, డిజిటల్ స్పీడ్ డిస్ప్లే వంటి ఫీచర్స్ అందులో కనిపిస్తున్నాయి.