Mahindra XUV400 EV bookings : మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ బుకింగ్స్ షూరూ..
Mahindra XUV400 EV bookings : మహీంద్రా ఎక్స్‌యూవీ400 బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. బుకింగ్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
Mahindra XUV400 EV bookings : ఆటో మార్కెట్లో హాట్ టాపిక్‌గా ఉన్న 'ఎక్స్‌యూవీ400 ఈవీ'కి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది మహీంద్రా అండ్ మహీంద్రా. ఎక్స్‌యూవీ400 ఈవీ బుకింగ్స్‌ను ప్రారంభించినట్టు వెల్లడించింది. ఫలితంగా.. ఆసక్తి ఉన్నవారు.. మహీంద్రా డీలర్షిప్ షోరూమ్‌లలో లేదా కంపెనీ అధికారిక వెబ్సైట్లో ఈ ఎలక్ట్రిక్ వెహికిల్‌ను బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ కోసం రూ. 21వేలు చెల్లించాల్సి ఉంటుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ ఎక్స్‌షోరూం ధర రూ. 15.99లక్షలు- రూ. 18.99లక్షల మధ్యలో ఉంటుంది. అయితే.. ఇది ఇంట్రొడక్టరీ ప్రైజ్ మాత్రమే. మొదటి 5వేల బుకింగ్స్‌కు (3 వేరియంట్లను కలిపి 15వేలు) మాత్రమే ఈ ధరలు వరిస్తాయని మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ స్పష్టం చేసింది. ఫలితంగా.. ఆసక్తి ఉన్నవారు.. ధరలు పెరగకముందే వాహనాన్ని సొంతం చేసుకోవాలంటే.. వెంటనే మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీని బుక్ చేసుకోవాలి.
మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ- బ్యాటరీ, రేంజ్..
Mahindra XUV400 EV price : సరికొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీలో రెండు బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. ఒకటి 34.5కేడబ్ల్యూహెచ్, రెండోది 39.4కేడబ్ల్యూహెచ్. ఇవి సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్‌తో ముడిపడి ఉంటాయి. ఈ ఇంజిన్ 150హెచ్‌పీ పవర్‌ను, 310 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 0-100 కేపీహెచ్ను.. ఈ ఎక్స్‌యూవీ400 ఈవీ కేవలం 8.3 సెకన్లలో అందుకుంటుందని సంస్థ చెబుతోంది. ఫన్, ఫాస్ట్, ఫియర్లెస్ మోడ్స్ ఇందులో ఉంటాయి.
Mahindra XUV400 EV first drive review కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
34.5కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉన్న ఎక్స్‌యూవీ400 ఈవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 375కి.మీల దూరం ప్రయాణిస్తుందని తెలుస్తోంది. ఇక 39.4కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉన్న ఎక్స్‌యూవీ400 ఈవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. అది ఏకంగా 456కి.మీల దూరం వెళుతుందని సమచారం.
మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ- ఫీచర్స్..
Mahindra XUV400 EV specifications : మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ టాప్ ఎండ్ మోడల్లో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్, మహీంద్రా ఆడ్రీనోఎక్స్ సాఫ్ట్‌వర్, సింగిల్ పేన్ సన్‌రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ విత్ ఓటీఏ (ఓవర్ ది ఎయిర్) అప్డేట్స్ ఉంటాయి. సేఫ్టీ ఫీచర్స్ కింద ఈ ఎలక్ట్రిక్ వెహికిల్‌లో 6 ఎయిర్‌బ్యాగ్స్, 4 వీల్ డిస్క్ బ్రేక్స్, ఐపీ67 రేటింగ్‌తో కూడిన బ్యాటరీ ప్యాక్ వంటివి లభిస్తున్నాయి. పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత.. ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ.. టాటా మోటార్స్ బెస్ట్ సెల్లింగ్ 'నెక్సాన్ ఈవీ'కి గట్టిపోటీ ఇస్తుందని అంచనాలు ఉన్నాయి.
Mahindra XUV 400 vs Tata Nexon EV ఈవీల మధ్య ది బెస్ట్ ఏది? అన్న విషయం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.