Mahindra XUV400 EV variants : మూడు వేరియంట్లలో ఎక్స్‌యూవీ400 ఈవీ..!
Mahindra XUV400 EV variants : లాంచ్‌కు సిద్ధమవుతోంది ఎక్స్‌యూవీ400 ఈవీ. ఈ నేపథ్యంలో.. ఈ ఈవీకి సంబంధించి ఓ వార్త బయటకొచ్చింది.
Mahindra XUV400 EV variants : మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ.. 2023 జనవరిలో లాంచ్ కానున్న విషయం తెలిసిందే. తాజాగా.. ఎన్ని వేరియంట్లలో ఈ ఎలక్ట్రిక్ వెహికిల్ రాబోతోందన్న విషయంపై వార్తలు బయటకొచ్చాయి. ఆ వివరాలు..
ఎక్స్‌యూవీ400 ఈవీ వేరియంట్స్(అంచనా)..
మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ.. మొత్తం మూడు వేరియంట్లలో వస్తున్నట్టు తెలుస్తోంది. వాటి పేర్లు.. బేస్, ఈపీ, ఈఎల్ అని ఉండొచ్చు. ఈ కారు ఫీచర్స్ గురించి ఇంకా పూర్తి వివరాలు అందుబాటులో లేవు. అయితే.. టాప్ ఎండ్ మోడల్లో 7.0 ఇంచ్ టచ్‌స్క్రీన్, మహీంద్రా ఆడ్రెనో ఎక్స్ సాఫ్ట్వేర్, సింగిల్ పేన్ సన్‌రూఫ్, ఓటీఏ అప్డేట్స్తో కూడిన కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్స్ ఉండే అవకాశం ఉంది.
Mahindra XUV400 EV specifications : ఇక సేఫ్టీ విషయానికొస్తే.. ఎక్స్‌యూవీ400 ఈవీ టాప్ ఎండ్ మోడల్లో ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఆల్-రౌండ్ డిస్క్ బ్రేక్స్, ఐఎస్ఓఎఫ్ఐఎక్స్ చైల్డ్ సీట్ యాంకరేజెస్ ఉండొచ్చు.
ఈవీ లాంచ్ డేట్ దగ్గర పడేకొద్ది.. ఎక్స్‌యూవీ400 ఈవీకి సంబంధించిన ఫీచర్స్పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మైలేజీ..
ఎక్స్‌యూవీ400 ఈవీకి 39.4కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 150హెచ్‌పీ పవర్, 310ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 0-100 కేఎంపీహెచ్ వేగాన్ని సెకన్లను 8.3 సెకన్లలో చేరుకుంటుందని మహీంద్రా అండ్ మహీంద్రా చెబుతోంది. ఇండియాలోని ఈవీ సెగ్మెంట్లో ఇదే టాప్‌గా నిలుస్తుంది. ఎక్స్‌యూవీ400 టాప్ స్పీడ్ 150కేఎంపీహెచ్గా ఉంది.
Mahindra XUV400 EV mileage : ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. ఈ ఎక్స్‌యూవీ400 ఈవీ 456కి.మీల దూరం ప్రయాణిస్తుంది. 50కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌తో.. 0-80శాతం ఛార్జింగ్‌ను కేవలం 50 నిమిషాల్లో అందుకుటుంది.
ఈ మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ఫన్, ఫాస్ట్, ఫియర్లెస్ అనే త్రీ డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి.
లాంచ్ డేట్ వివరాలు..
ఎక్స్‌యూవీ400.. 2023 జనవరిలో లాంచ్ అవ్వనుంది. కానీ లాంచ్ డేట్‌పై మహీంద్రా అండ్ మహీంద్రా క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు.. ఎక్స్‌యూవీ400 ఈవీ ధర రూ. 18లక్షలు-20లక్షలు (ఎక్స్‌షోరూం) మధ్యలో ఉండొచ్చని అంచనాలు ఉండొచ్చు. ఒక్కసారి లాంచ్ అయితే.. మార్కెట్లో ఉన్న టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్‌కు ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ గట్టి పోటీనిస్తుంది.
Mahindra XUV400 EV launch date : ఎలక్ట్రిక్ వాహనాల రంగంపై దృష్టిపెట్టిన మహీంద్రా అండ్ మహీంద్రా.. అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు రచించింది. ఎలక్ట్రిక్ వాహనాల సిరీస్‌లో భాగంగా తొలుత ఎక్స్‌యూవీ400 ఈవీని విడుదల చేయనుంది. ఆ తర్వాత 2024లో ఎక్స్‌యూవీ.ఈ, బీఈ మోడల్స్ లాంచ్ కానున్నాయి.
సంబంధిత కథనం