Mahindra Thar 2WD launch : సరికొత్త మహీంద్రా థార్ లాంచ్ డేట్ ఇదే..!
06 January 2023, 10:44 IST
- Mahindra Thar 2WD launch date : మహీంద్రా థార్ 2డబ్ల్యూడీ లాంచ్‌కు సిద్ధమవుతోంది. లాంచ్ డేట్‌తో పాటు ఫీచర్స్ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
ఈ నెల 9న మహీంద్రా థార్ లాంచ్..!
Mahindra Thar 2WD launch date : ఇండియా ఆటో మార్కెట్లో మహీంద్రా థార్‌కు ఉన్న క్రేజే వేరు! ఇక ఇప్పుడు.. సరికొత్త థార్‌ను మహీంద్రా అండ్ మహీంద్రా లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. అది కూడా తక్కువ ధరకే! థార్ మోడల్స్‌లోనే అత్యంత చౌకైన 2డబ్ల్యూడీ.. ఈ నెల 9న లాంచ్ కానున్నట్టు తెలుస్తోంది. అయితే.. లాంచ్‌కి ముందే ఈ మహీంద్రా థార్ 2డబ్ల్యూడీకి సంబంధించిన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ లీక్ అయ్యాయి. వాటిని ఓసారి చూద్దాం..
ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఇవే..!
లీక్స్ ప్రకారం.. మహీంద్రా థార్ 2డబ్ల్యూడీలో ఎవరెస్ట్ వైట్, బ్లేజింగ్ బ్రాంజ్ అనే రెండు రంగులు ఉంటాయి. ఈ కొత్త కలర్స్‌తో థార్ లుక్ మరింత ఆకర్షణీయంగా మారనుంది. మరి ప్రస్తుతం అందుబాటులో ఉన్న థార్ 4డబ్ల్యూడీ మోడల్స్‌కి కూడా వీటిని తీసుకొస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.
All new Mahindra Thar 2WD launch : డిజైన్ పరంగా.. ఈ మహీంద్రా థార్ 2డబ్ల్యూడీ.. 4డబ్ల్యూడీతో పోలి ఉంటుంది. కాకపోతే.. రేర్‌లో 4X4 బ్యాడ్జీ ఉండదు. ఆటో స్టార్ట్-స్టాప్ ఆప్షన్ కూడా కొత్తగా వస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ మహీంద్రా థార్ 2డబ్ల్యూడీలో 1.5లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుందని తెలుస్తోంది. ఇదే ఇంజిన్‌ను మహీంద్రా అండ్ మహీంద్రా ఎక్స్‌యూవీ300లో వినియోగిస్తోంది. ఇది 118.5హెచ్‌పీ పవర్‌ను, 300ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో 6 స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్ ఉండనుంది. ఈ మహీంద్రా థార్ 2డబ్ల్యూడీ వర్షెన్‌లో 2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంటుందని సమాచారం. ఇది 152హెచ్‌పీ టార్క్‌ను.. 300ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఆటోమెటిక్ గేర్‌బాక్స్ ఉంటే.. 320 ఎన్ఎం టార్క్ కూడా జనరేట్ అవుతుంది. ఇందులో 6 స్పీడ్ మేన్యువల్, 6 స్పీడ్ ఆటోమెటిక్ గేర్‌బాక్స్ ఉంటాయి.
Mahindra Thar 2WD features : 18 ఇంచ్ అలోయ్ వీల్స్, ఆల్- టెర్రైన్ టైర్స్, ఈఎస్పీ మౌల్డ్డెడ్ ఫుట్‌స్టెప్స్, క్రూయిజ్ కంట్రోల్, బ్లాక్ బంపర్స్, ఎలక్ట్రిక్ ఓఆర్వీఎమ్స్, ఫాగ్ లైట్స్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, రూఫ్- మౌంటెడ్ స్పీకర్స్ కూడా ఈ మహీంద్రా థార్ 2డబ్ల్యూడీలో ఉంటాయని లీక్స్ ద్వారా తెలుస్తోంది.
మహీంద్రా థార్ 2డబ్ల్యూడీ ధర..
ఎస్‌యూవీపై జీఎస్టీ మండలి సూచించిన నిర్వచనం కారణంగా.. మహీంద్రా థార్‌పై పన్ను తగ్గింది. ఫలితంగా ఈ వెహికిల్ ధర కూడా తగ్గనుంది. ఇక కొత్తగా లాంచ్‌కు సిద్ధమవుతున్న మహీంద్రా థార్ 2డబ్ల్యూడీ ప్రారంభ ధర రూ. 11లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉండొచ్చని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
Mahindra Thar 2WD price : లాంచ్ నేపథ్యంలో ఈ వాహనంపై మరింత సమాచారాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.