Mahindra Scorpio N vs Scorpio Classic : మహీంద్రా స్కార్పియో ఎన్ వర్సెస్ క్లాసిక్.. ఏది బెటర్?
26 February 2023, 6:50 IST
- Mahindra Scorpio N vs Scorpio Classic : మహీంద్రా స్కార్పియో ఎన్, స్కార్పియో క్లాసిక్‌లో ఏది కొంటే బెటర్? అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకోసమే..
మహీంద్రా స్కార్పియో ఎన్ వర్సెస్ క్లాసిక్.. ఏది బెటర్?
Mahindra Scorpio N vs Scorpio Classic : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో మహీంద్రా అండ్ మహీంద్రా వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఎస్యూవీ సెగ్మెంట్లో ఎం అండ్ ఎం కార్లు దూసుకెళుతున్నాయ. అందుకు తగ్గట్టుగానే వెయిటింగ్ పీరియడ్ కూడా భారీగానే ఉంది. స్కార్పియో ఎన్, ఎక్స్‌యూవీ 700, స్కార్పియో క్లాసిక్ వంటి మోడల్స్ హాట్కేక్స్లాగా అమ్ముడుపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏది కొంటే బెటర్? అని కస్టమర్లలో సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో స్కార్పియో ఎన్, స్కార్పియో క్లాసిక్‌ను పోల్చి.. ఏది తీసుకుంటే బెటర్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
స్కార్పియో ఎన్ వర్సెస్ స్కార్పియో క్లాసిక్- లుక్స్..
Mahindra Scorpio N on road price : స్కార్పియో క్లాసిక్‌కు పాత కాలం నాటి స్కార్పియో లుక్స్ వచ్చాయి. అయితే.. నేటి తరం ఇష్టాలకు తగ్గట్టు డిజైన్‌ను కాస్త మాడిఫై చేశారు. బానెట్ స్కూప్, కింక్డ్ రూఫ్ వంటివి ఇంకా ఉన్నాయి. ఇక స్కార్పియో ఎన్ చాలా బోల్డ్‌గా, చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. డిజైన్ పరంగా సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. అయితే.. దీనిలోనూ పాత స్కార్పియో డిజైన్‌కు చెందిన కొన్ని అంశాలు కనిపిస్తాయి. సైడ్ హింజ్డ్ టెయిల్‌గేట్, కింక్డ్ రూఫ్ వంటివి ఉదాహరణలు.
స్కార్పియో ఎన్ వర్సెస్ స్కార్పియో క్లాసిక్- ఇంజిన్..
Mahindra Scorpio classic on road price in Hyderabad : మహీంద్రా స్కార్పియో క్లాసిక్‌లో డీజిల్ ఇంజిన్ మాత్రమే ఉంటుంది. 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్.. 3,650 ఆర్పీఎం వద్ద 130 బీహెచ్పీ పవర్‌ను, 1600- 2800 ఆర్పీఎం వద్ద 300 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో 6 స్పీడ్ గేర్‌బాక్స్ మాత్రమే ఉంటుంది.
ఇక స్కార్పియో ఎన్లో ఉన్న 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్.. 173 బీహెచ్పీ పవర్‌ను, 370 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 2.0 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ కూడా ఇందులో ఉంది. ఇది 200 బీహెచ్పీ పవర్‌ను, 380 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మేన్యువల్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌లు ఉంటాయి.
స్కార్పియో ఎన్ వర్సెస్ స్కార్పియో క్లాసిక్- ఫీచర్స్..
Mahindra Scorpio N features : ఫీచర్స్ విషయానికొస్తే.. స్కార్పియో ఎన్ చాలా మోడర్న్‌గా ఉంటుంది. సరికొత్త ఫీచర్స్ ఇందులో ఉంటాయి. ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రేర్ ఏసీ వెంట్స్, 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ విత్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్పలే, క్రూజ్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో పాటు ఇతర ఫీచర్స్ ఇందులో కనిపిస్తాయి.
ఇక స్కార్పియో క్లాసిక్‌లో హాలోజెన్ ప్రోజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, 9 ఇంచ్ టచ్‌స్క్రీన్, రేర్ పార్కింగ్ కెమెరా, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, రేర్ ఏసీ వెంట్స్, క్రూజ్ కంట్రోల్ వంటివి వస్తాయి.
స్కార్పియో ఎన్ వర్సెస్ స్కార్పియో క్లాసిక్- ధరలు..
Mahindra Scorpio N price : స్కార్పియో క్లాసిక్ ఎస్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 12.64లక్షలు. ఎస్11 వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 16.14లక్షలు. ఇక స్కార్పియో ఎన్ ఎక్స్‌షోరూం ధరలు రూ. 12.74లక్షలు- రూ. 24.05లక్షల మధ్యలో ఉంటుంది.