తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Lic Q4 Results: ఎల్ఐసీ నికర లాభాల్లో దాదాపు 450% వృద్ధి; ఆదానీ షేర్ల ర్యాలీ ఫలితం

LIC Q4 results: ఎల్ఐసీ నికర లాభాల్లో దాదాపు 450% వృద్ధి; ఆదానీ షేర్ల ర్యాలీ ఫలితం

HT Telugu Desk HT Telugu

24 May 2023, 21:48 IST

google News
    • LIC Q4 results: భారత్ లోని అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఫలితాలను బుధవారం ప్రకటించింది. ఈ Q4FY23 లో LIC రూ. 13,190.79 కోట్ల నికర లాభాలను ఆర్జించింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Ramesh Pathania/Mint.)

ప్రతీకాత్మక చిత్రం

LIC Q4 results: ఈ Q4FY23 లో LIC రూ. 13,190.79 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. ఇది LIC Q4FY22 లో ఆర్జించిన నికర లాభాల కన్నా 447.47% అధికం. Q4FY22 లో ఎల్ఐసీ సాధించిన నికర లాభాలు కేవలం రూ. 2,409.39 కోట్లు మాత్రమే. అలాగే Q3FY23 లో కన్నా Q4FY23 లో ఎల్ఐసీ 107.77% అధికంగా నికర లాభాలను ఆర్జించింది.

LIC dividend: డివిడెండ్ రూ. 3

Q4FY23 ఫలితాలతో పాటు ఎల్ఐసీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ షేర్ హోల్డర్లకు FY23లో ఫైనల్ డివిడెండ్ కూడా ప్రకటించారు. షేర్ హోల్డర్లకు ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 3 డివిడెండ్ గా అందించాలని నిర్ణయించారు.

Adani shares ralley affect: ఆదానీ గ్రూప్ లో పెట్టుబడుల్లో భారీ వృద్ధి

ఇటీవలి కాలంలో ఆదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పై పైకి దూసుకుపోతున్నాయి. ఆ కంపెనీల్లో ఎల్ఐసీ గణనీయమైన స్థాయిలో పెట్టుబడులు పెట్టింది. దాంతో, ఆదానీ గ్రూప్ కంపెనీల్లోని ఎల్ఐసీ పెట్టుబడుల విలువ కూడా విపరీతంగా పెరిగింది. ఆ పెరుగుదల ఎల్ఐసీ Q4FY23 ఫలితాల్లో కనిపించింది. ప్రస్తుతం ఆదానీ గ్రూప్ లో ఎల్ఐసీ పెట్టుబడుల విలువ సుమారు రూ. 44,600 కోట్లుగా ఉంది. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి వాటి విలువ సుమారు రూ. 5500 కోట్లు పెరగడం విశేషం. అయితే, ఆదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలకు పాల్పడిందని ఆరోపిస్తూ హిండెన్ బర్గ్ నివేదిక రావడానికి పూర్వం ఆదానీ గ్రూప్ లో ఎల్ఐసీ పెట్టుబడుల విలువకు మళ్లీ చేరడానికి మరింత సమయం పట్టే అవకాశముంది.

LIC stakes in Adani group: ఆదానీ కంపెనీల్లో ఎల్ఐసీ వాటాలు

మార్చి 31, 2023 నాటికి ఆదానీ గ్రూప్ కంపెనీల్లో ఎల్ఐసీ వాటాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

  • ఆదానీ పోర్ట్స్ - 9.12%
  • ఆదానీ ఎంటర్ ప్రైజెస్ - 4.26%
  • ఏసీసీ - 6.41%
  • అంబుజా సిమెంట్స్ - 6.3%
  • ఆదానీ టోటల్ గ్యాస్ - 6.02%
  • ఆదానీ ట్రాన్స్ మిషన్స్ - 3.68%
  • ఆదానీ గ్రీన్ ఎనర్జీ - 1.36%.

తదుపరి వ్యాసం