తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Lic Overtakes Sbi Market-cap: ఎస్బీఐని దాటేసిన ఎల్ఐసీ; ఇప్పుడు విలువైన పీఎస్యూ ఎల్ఐసీ నే..

LIC overtakes SBI market-cap: ఎస్బీఐని దాటేసిన ఎల్ఐసీ; ఇప్పుడు విలువైన పీఎస్యూ ఎల్ఐసీ నే..

HT Telugu Desk HT Telugu

17 January 2024, 11:43 IST

google News
  • LIC overtakes SBI market-cap: జీవిత బీమా సంస్థ (Life Insurance Corp. of India (LIC) బుధవారం మరో రికార్డును అధిగమించింది. ఎల్ ఐసీ షేరు విలువ బుధవారం 2% వృద్ధితో 52 వారాల గరిష్టానికిి చేరుకుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Bloomberg)

ప్రతీకాత్మక చిత్రం

LIC overtakes SBI market-cap: ఎస్బీఐని వెనక్కి నెట్టి అత్యంత విలువైన పీఎస్యూగా ఎల్ఐసీ అవతరించింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) షేరు ధర బుధవారం ఉదయం ట్రేడింగ్ లో 2 శాతానికి పైగా లాభపడి 52 వారాల గరిష్టాన్ని తాకింది. దీంతో ఎల్ఐసీ మార్కెట్ క్యాప్ రూ. 5.8 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది ఎస్బీఐ మార్కెట్ క్యాప్ రూ.5.62 లక్షల కోట్ల కన్నా ఎక్కువ.

ఎస్బీఐ కన్నా ఎక్కువ

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) షేరు ధర బుధవారం ఉదయం ట్రేడింగ్ లో 2 శాతానికి పైగా లాభపడింది. దాంతో, సంస్థ మార్కెట్ క్యాప్ రూ.5.8 లక్షల కోట్ల మార్కును దాటింది. తద్వారా ఎల్ఐసీ మార్కెట్ క్యాప్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)ను అధిగమించింది. తద్వారా, ఎల్ ఐ సీ అత్యంత విలువైన ప్రభుత్వ రంగ సంస్థగా అవతరించింది. బిఎస్ ఇలో ఎస్ బిఐ షేరు ధర 1 శాతం క్షీణించింది. ఎస్బీఐ మార్కెట్ క్యాప్ సుమారు రూ.5.62 లక్షల కోట్లుగా ఉంది.

నవంబర్ నుంచి పైపైకి

నవంబర్ ప్రారంభం నుంచి ఎల్ఐసీ (LIC) షేరు ధర 50 శాతానికి పైగా లాభపడడం గమనార్హం. ఐపీఓ తరువాత లిస్టింగ్ అనంతరం ఎల్ఐసీ షేరు ధర 2023 మార్చి వరకు గణనీయంగా క్షీణించి రూ.530 వద్ద ఆల్టైమ్ కనిష్టానికి చేరుకుంది. ఆ తరువాత క్రమంగా వృద్ధి దిశగా ప్రయాణించడం ప్రారంభించింది. వంబర్లో 12.83% వృద్ధిని, డిసెంబర్ నెలలో 22.66% వృద్ధిని సాధించింది. అలాగే, ఈ జనవరిలో ఇప్పటివరకు 10% పైగా లాభపడింది.

17 వేల కోట్లు.

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగం (H1FY24) ఆర్థిక పనితీరుకు సంబంధించి ఎల్ఐసీ రూ .17,469 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. H1FY24లో కొత్త బిజినెస్ ప్రీమియం (వ్యక్తిగత) 2.65 శాతం పెరిగి రూ.24,535 కోట్ల నుంచి రూ.25,184 కోట్లకు చేరింది. కొత్త వ్యాపార ప్రీమియం అనేది జీవిత బీమా ఒప్పందం యొక్క మొదటి పాలసీ సంవత్సరంలో చెల్లించాల్సిన ప్రీమియం.

సూచన: పైన చేసిన అభిప్రాయాలు మరియు సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు లేదా బ్రోకింగ్ కంపెనీలవి. హిందుస్తాన్ టైమ్స్ తెలుగువి కావు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను తనిఖీ చేయాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.

తదుపరి వ్యాసం