Kia EV2 : అతి చౌకైన కియా ఈవీ2 వచ్చేస్తోంది..!
13 October 2023, 7:56 IST
- Kia EV2 : కియా ఈవీ2 సిద్ధమవుతోంది! ఇది అతి చౌకైన ఎలక్ట్రిక్ వెహికిల్‌గా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.
అతి చౌకైన కియా ఈవీ2 వచ్చేస్తోంది..!
Kia EV2 price : ఈవీ సెగ్మెంట్లో ఫ్యూచరిస్టిక్ డిజైన్ మోడల్స్‌తో దూసుకెళుతున్న కియా మోటార్స్ సంస్థ.. మరో మోడల్‌ను ప్రపంచానికి పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది! 2026 నాటికి కియా ఈవీ2 ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. తొలుత ఇది యూరోపియన్ మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని సమాచారం. అంతేకాకుండా.. 'ఈవీ' సిరీస్‌లో.. ఇది అతి చౌకైన మోడల్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఈవీపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
కొత్త ఈవీ విశేషాలివే..
కియా ఈవీ2కి సంబంధించి ప్రస్తుతం పెద్దగా వివరాలేవీ బయటకు రాలేదు. కాకపోతే.. ఇదొక కాంపాక్ట్-బీ సెగ్మెంట్ మోడల్‌గా ఉంటుందని, నగరాల్లో ఉపయోగకరంగా ఉండే విధంగా దీని డిజైన్ ఉంటుందని టాక్ నడుస్తోంది. యూరోప్ ప్రజల టేస్ట్‌కి తగ్గట్టు ఇందులో మార్పులు, చేర్పులు ఉంటాయట!
కియా మోటర్స్‌లో సిగ్నేచర్‌గా మారిన డిజిటల్ టైగర్ నోస్ గ్రిల్‌ని ఇందులోనూ ఉండనుంది. మొత్తం మీద బండి సైజు చిన్నగా ఉండొచ్చు. ఇక ఈ రానున్న కియా ఈవీ2లో ఈ-జీఎంపీ మాడ్యులర్ ఆర్కిటెక్చర్‌కి చెందిన సరికొత్త 400వీని సంస్థ వాడుతుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే.. ధర చాలా వరకు తగ్గిపోతుంది.
Kia EV2 launch date India : అయితే.. ఈ వెహికిల్‌కి అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ లభించకపోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ వెహికిల్ ప్రారంభ ధర 25వేల పౌండ్లుగా ఉంటుందని సమాచారం. అంటే ఇండియన్ కరెన్సీలో అది రూ. 25.38లక్షలు! లాంచ్ తర్వాత ఈ వెహికిల్.. మినీ కూపర్ ఎలక్ట్రిక్ వంటి ఈవీలకు గట్టిపోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
రానున్న ఏళ్లల్లో ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌పై ఆధిపత్యాన్ని చెలాయించేందుకు.. పక్కా ప్లాన్ వేసింది కియా మోటార్స్! 3ఏళ్లల్లో.. ఈవీ5, ఈవీ4, ఈవీ3ని లాంచ్ చేయనుంది. ఇక కియా ఈవీ2 కూడా ఈ లైనప్‌లో చేరింది.
కియా ఈవీ5..
Kia EV5 specifications : అంతర్జాతీయ విద్యుత్ వాహన దినోత్సవం సందర్భంగా గురువారం కియా సంస్థ.. తన ఎలక్ట్రిక్ కార్ల లైనప్‌లోకి మరో కొత్త ఎస్‌యూవీని చేర్చింది. అత్యాధునిక ఫీచర్స్, నెక్ట్స్ లెవెల్ డిజైన్‌తో కొత్త ఈవీ5 ఎస్యూవీ స్పెసిఫికేషన్స్‌ని రివీల్ చేసింది.
ఈ కియా ఈవీ5 మొత్తం 3 వేరియంట్లలో లభిస్తుంది. అవి స్టాండర్డ్ వేరియంట్, లాంగ్ రేంజ్ వేరియంట్, లాంగ్ రేంజ్ ఏడబ్ల్యూడీ వేరియంట్. స్టాండర్డ్ వేరియంట్ లో 64 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్, 160 కిలోవాట్ మోటార్ ఉంటాయి. సింగిల్ చార్జ్ తో 530 కిమీలు ప్రయాణించవచ్చు. లాంగ్ రేంజ్ వేరియంట్, లాంగ్ రేంజ్ ఏడబ్ల్యూడీ వేరియంట్ లలో 88 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. సింగిల్ చార్జ్ తో లాంగ్ రేంజ్ వేరియంట్ 720 కిమీలు, లాంగ్ రేంజ్ ఏడబ్ల్యూడీ వేరియంట్ 650 కిమీలు ప్రయాణించవచ్చు.