తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Jeep India Price Hike : భారీగా పెరగనున్న 'జీప్​' ఎస్​యూవీల ధరలు!

Jeep India price hike : భారీగా పెరగనున్న 'జీప్​' ఎస్​యూవీల ధరలు!

16 December 2022, 8:16 IST

google News
    • Jeep India price hike : వాహనాల ధరలను భారీగా పెంచాలని జీప్​ ఇండియా ఫిక్స్​ అయ్యింది. 2023 జనవరి నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.
భారీగా పెరగనున్న 'జీప్​' ఎస్​యూవీల ధరలు!
భారీగా పెరగనున్న 'జీప్​' ఎస్​యూవీల ధరలు!

భారీగా పెరగనున్న 'జీప్​' ఎస్​యూవీల ధరలు!

Jeep India price hike : 2023 తొలినాళ్లల్లో వాహనాల ధరలు పెంచుతున్న ఆటో సంస్థల జాబితాలో జీప్​ ఇండియా కూడా చేరింది. మోడల్​, వేరియంట్​ను బట్టి.. 2-4శాతం వరకు ధరలను పెంచాలని నిర్ణయించుకుంది ఈ ఆటో సంస్థ. జీప్​ కంపాస్​, మెరీడియన్​, వ్రాంగ్లన్​తో పాటు కొత్త లాంచ్​ అయిన జీప్​ గ్రాండ్​ చెరోకీ ఎస్​యూవీపైనా ఈ భారం పడనుంది.

జీప్​ ఇండియా తీసుకున్న ధరల పెంపు నిర్ణయం.. 2023 జనవరి నుంచే అమల్లోకి రానుంది. వాస్తవానికి జీప్​ కంపాస్​ ధర నవంబర్​లోనే పెరిగింది. సంస్థకు ఎంట్రీ లెవెల్​ వెహికిల్​గా భావిస్తున్న కంపాస్​ ధర అప్పుడే.. ఏకంగా రూ. 1.20లక్షలు పెరగడం గమనార్హం. హ్యుందాయ్​ టుక్సన్​, సిట్రోయెన్​ సీ5 ఎయిర్​క్రాస్​ వంటి వెహికిల్స్​కు ఈ జీప్​ కంపాస్​ గట్టిపోటీనిస్తోంది.

రీసెంట్​గా లాంచ్​ అయిన మోడల్స్​పై ధరలు పెంచడం చాలా అరుదు. కానీ ఇటీవలే మార్కెట్​లోకి అడుగుపెట్టిన జీప్​ గ్రాండ్​ చెరోకీపైనా ధరలు పెరగడం గమనార్హం. గత నెలలో రూ. 77.50లక్షల(ఎక్స్​షోరూం) వద్ద లాంచ్​ అయ్యింది ఈ ఎస్​యూవీ.

జీప్​ గ్రాండ్​ చెరోకీ ఫీచర్స్​..

Jeep Grand Cherokee price in India : ఈ జీప్​ గ్రాండ్​ చెరోకీకి మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఇందులో డీజిల్​ ఇంజిన్​ లేదు. 2.0 లీటర్​ 4 సిలిండర్​ టర్బోఛార్జ్​డ్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 268బీహెచ్​పీ పవర్​ను, 400ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులో 8 స్పీడ్​ ఆటోమెటిక్​ గేర్​ బాక్స్​ ఉంటుంది. ఫోర్​ వీల్​ డ్రైవ్​ సిస్టెమ్​ దీని సొంతం. ఆటో, స్పోర్ట్​, మడ్​, స్నో వంటి మోడ్స్​ ఇందులో ఉన్నాయి.

ఈ జీప్​ గ్రాండ చెరోకీలో 10.25 ఇంచ్​ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ కన్సోల్​, 10 ఇంచ్​ హెచ్​యూడీ యూనిట్​, వయర్​లెస్​ ఛార్జింగ్​, 10.1 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, ఆండ్రాయిడ్​ ఆటో, యాపిల్​ కార్​ప్లే కనెక్టివిటీ, ఫ్రెంట్​ ప్యాసింజర్​ల కోసం 10.1 ఇంచ్​ స్క్రీన్​, రేర్​ ప్యాసింజర్స్​ కోసం ఎంటర్​నైన్​మెంట్​ స్క్రీన్స్​ ఉన్నాయి. పవర్డ్​ టెయిల్​గేట్​, పానారోమిక్​ సన్​రూఫ్​, వెంటిలేటెడ్​ ఫ్రెంట్​ సీట్స్​ కూడా ఉన్నాయి.

Tata motors price hike : టాటా మోటార్స్​, మారుతీ సుజుకీ, హోండా, హ్యుందాయ్​, సిట్రోయెన్​తో పాటు అనేక సంస్థల వాహనాల ధరలు 2023 జనవరి నుంచి పెరగనున్నాయి. ఈ మేరకు సంస్థలు ఇప్పటికే ప్రకటనలు చేసేశాయి. ద్రవ్యోల్బణం, ముడిసరకు ధరలు పెరగడం వంటి కారణాలతో వాహనాల ధరలు పెంచక తప్పడం లేదని ఆటో సంస్థలు చెబుతూనే ఉన్నాయి. కొత్తగా ఆర్డర్​ చేసిన లేదా వెయిటింగ్​ పీరియడ్​లో ఉన్న వాహనాలపై ఈ ప్రభావం పడనుంది.

టాపిక్

తదుపరి వ్యాసం