తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Iphone 16 India Sale : ఇండియాలో నేటి నుంచి ఐఫోన్​ 16 సేల్స్​- ఈ ఆఫర్స్​ తెలుసుకోండి..

iPhone 16 India sale : ఇండియాలో నేటి నుంచి ఐఫోన్​ 16 సేల్స్​- ఈ ఆఫర్స్​ తెలుసుకోండి..

Sharath Chitturi HT Telugu

20 September 2024, 9:45 IST

google News
  • iPhone 16 India sale : యాపిల్​ లవర్స్​కి అప్డేట్​! ఇండియాలో శుక్రవారం ఐఫోన్​ 16 సేల్స్​ ప్రారంభంకానున్నాయి. పలు ఎగ్జైటింగ్​ ఆఫర్స్​తో మీరు కొత్త ఐఫోన్​ 16 సిరీస్​ స్మార్ట్​ఫోన్స్​ని కొనుగోలు చేసుకోవచ్చు..

ఇండియాలో ఐఫోన్​ 16 సేల్స్​- పూర్తి వివరాలు..
ఇండియాలో ఐఫోన్​ 16 సేల్స్​- పూర్తి వివరాలు.. (Apple)

ఇండియాలో ఐఫోన్​ 16 సేల్స్​- పూర్తి వివరాలు..

యాపిల్​ ఐఫోన్​ 16 సేల్స్​ కోసం ఎదురుచూస్తున్న వారికి కీలక అప్డేట్​! ఇండియాలో సెప్టెంబర్ 20 నుంచి ఐఫోన్ 16 సేల్స్​ ప్రారంభం కానున్నాయి. సేల్స్​ వివరాలతో పాటు ఆఫర్స్​కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోండి..

ఇండియాలో ఐఫోన్​ 16 సేల్స్​..

యాపిల్ గ్లోటైమ్ ఈవెంట్ 2024లో లాంచ్ చేసిన ఐఫోన్ 16 సిరీస్​లో ఐఫోన్​ 16, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్​, ఐఫోన్ 16 ప్లస్ వంటి మోడల్స్​ ఉన్నాయి. ఈ కొత్త స్మార్ట్​ఫోన్​ సిరీస్​లో అత్యంత సరసమైన మోడల్ ఐఫోన్​ 16.

ఐఫోన్ 16 కోసం ప్రీ-బుకింగ్స్ సెప్టెంబర్ 13నే ప్రారంభమయ్యాయి. మోడల్స్ డెలివరీలు సెప్టెంబర్ 20న ప్రారంభమవుతాయి. మీరు మీ ఐఫోన్ 16 ను రిజర్వ్ చేసుకునే అవకాశాన్ని కోల్పోతే, అవైలబులిటీని చెక్​ చేసిన తర్వాత మీరు ఆఫ్​లైన్​, ఆన్​లైన్​ స్టోర్ల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు.

ఇదీ చూడండి:- Apple iOS 18.1: అప్ డేటెడ్ సిరి, ఏఐ ఫీచర్లతో ఆపిల్ ఐఓఎస్ 18.1 బీటా 4 లాంచ్

ఐఫోన్ 16 ధర..

యాపిల్ కొత్త ఐఫోన్ 16 ధరను దాని మునుపటి ఐఫోన్ 15 మాదిరిగానే ఉంచింది. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఐఫోన్ 16 ధర రూ.79,900గా ఉంది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ల ధరలు వరుసగా రూ.89,900, రూ.10,99,900గా ఉన్నాయి. అల్ట్రా మెరైన్, టీల్, పింక్, వైట్, బ్లాక్ అనే ఐదు కలర్ ఆప్షన్లలో కొత్త ఐఫోన్ 16 స్మార్ట్​ఫోన్స్​ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.

ఐఫోన్ 16 సేల్: ఆఫర్లు ఇవే..

ఐఫోన్​ 16 కొనేందుకు చూస్తున్న వారికి పలు ఎగ్జైటింగ్​ ఆఫర్స్​ కూడా అందుబాటులో ఉన్నాయి. అమెరికన్ ఎక్స్​ప్రెస్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి అర్హత కలిగిన కార్డులతో కొనుగోలుదారులు ఐఫోన్ 16పై రూ .5000 వరకు ఇన్​స్టెంట్​గా సేవ్​ చేసుకోవచ్చు. ఇదే కాకుండా, కొనుగోలుదారులు చాలా ప్రముఖ బ్యాంకుల నుంచి 3 లేదా 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐతో తక్కువ నెలవారీ ఇన్​స్టాల్మెంట్స్​ వెసులుబాటును ఉపయోగించి ఐఫోన్​ 16 స్మార్ట్​ఫోన్స్​ని దక్కించుకోవచ్చు.

యాపిల్ ట్రేడ్-ఇన్: మీరు మీ ప్రస్తుత పరికరాన్ని ఎక్స్​ఛేంజ్​ చేసినప్పుడు రూ. 4000 - రూ . 67500 వరకు పొందొచ్చు. మీ కొత్త ఐఫోన్​కి కొనుగోలుకు ఇది ఉపయోగపడుతుంది. ఆన్​లైన్​లో కూడా ఈ ప్రాసెస్​ని ట్రై చేయొచ్చు.

ఇక మీ కొత్త ఐఫోన్ కొనుగోలుతో 3 నెలల యాపిల్ మ్యూజిక్ ఉచితంగా పొందండి. అలాగే 3 నెలల యాపిల్ టీవీ+ , యాపిల్ ఆర్కేడ్ ఉచితంగా పొందండి. మరిన్ని వివరాల కోసం యాపిల్​ ఇండియా వెబ్​సైట్​ని చూడొచ్చు.

ఇంకో విషయం! హెచ్​టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్​ ఛానెల్స్​లో అందుబాటులో ఉంది. టెక్​ ప్రపంచం నుంచి లేటెస్ట్​ అప్డేట్స్​ కోసం వాట్సాప్​లో హెచ్​టీ తెలుగు ఛానెల్​ని ఫాలో అవ్వండి..

తదుపరి వ్యాసం