Amazon Great Indian Festival 22024 : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డేట్స్, ఆఫర్స్ వివరాలు..
Amazon Great Indian Festival 2024 date : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 పై కీలక్ అప్డేట్! సేల్‌కి సంబంధించిన డేట్‌ని అమెజాన్ ప్రకటించింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఇండియాలో పండగ సీజన్‌కి దిగ్గజ ఈ-కామర్స్ సంస్థలు రెడీ అవుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే తన బిగ్ బిలియన్ డేస్ సేల్‌పై ప్రకటన చేసింది. ఇక ఇప్పుడు అమెజాన్ కూడా భారతదేశంలో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 డైట్స్‌ని అధికారికంగా వెల్లడించింది. ఈ ఏడాది ఫెస్టివల్ సీజన్లో స్మార్ట్‌ఫోన్స్, టీవీలు, ల్యాప్‌టాప్స్‌తో సహా అనేక ప్రాడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. ఈవెంట్ షెడ్యూల్, ఎక్స్పెక్టెడ్ డీల్స్‌తో పాటు మరెన్నో వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024: ప్రైమ్ మెంబర్స్ కోసం కీలక తేదీలు..
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సెప్టెంబర్ 27 న ప్రారంభమవుతుంది. అయితే అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు సెప్టెంబర్ 26 అర్ధరాత్రి నుంచే డిస్కౌంట్లు లభిస్తాయి. ఫలితంగా ప్రైమ్ మెంబర్స్, సాధారణ ప్రజల కన్నా ముందే క్రేజీ డీల్స్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు.
బ్యాంక్ ఆఫర్లు, క్యాష్ బ్యాక్ డీల్స్..
సేల్ సమయంలో, షాపర్లు ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి 10 శాతం ఇన్స్టెంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా, ఎలాంటి గరిష్ఠ లిమిట్ లేకుండా, వెల్కమ్ ఆఫర్ కింద 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను దక్కించుకోవచ్చు.
ముఖ్యంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా, గెలాక్సీ ఎం35 5జీ, గెలాక్సీ ఎం15 వంటి స్మార్ట్ ఫోన్లపై అమెజాన్ పలు డీల్స్‌ను ప్రకటించింది. గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా ధర రూ.69,999కు తగ్గవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి.
డిస్కౌంట్లు, ఎక్స్ ఛేంజ్ ఆఫర్ల..
ఐఫోన్స్‌పై డిస్కౌంట్స్‌కి సంబంధించి అమెజాన్ ప్రివ్యూని విడుదల చేసింది. ఐఫోన్ 13 రూ .39,999 కు లభిస్తుంది. దీని ఎంఆర్పీ నుంచి రూ .10,000 తగ్గింపు వస్తోంది. బ్యాంక్ ఆఫర్ల ద్వారా అదనంగా రూ .2,500 తగ్గింపు ఉంటుంది. ఈ మోడల్‌పై రూ.20,250 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా లభిస్తున్నాయి. ఈ సేల్‌లో ఐఫోన్ 15 రూ.55,000 లోపు, ఐఫోన్ 14 ధర రూ.50,000 లోపు ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి.
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 యొక్క అన్ని వివరాలను అమెజాన్ ఇంకా ధృవీకరించనప్పటికీ, ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్లు ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. అఫీషియల్ వివరాలు వచ్చినప్పుడు మేము మీకు అప్డేట్ చేస్తాము.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్..
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 వచ్చేసింది! ఈ మెగా ఆఫర్ సేల్.. సెప్టెంబర్ 30న ప్రారంభమవుతుంది. దసరా దీపావళి పండుగ డిమాండ్ కోసం ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ఫోన్స్తో సహా అనేక విభాగాలలో భారీ డిస్కౌంట్లను అందిస్తుంది.
పండుగ సీజన్లో తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తూనే, వినియోగదారులు తమ పొదుపును పెంచుకోవడానికి బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లను కూడా ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. అంతేకాదు ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు సెప్టెంబర్ 29 నుంచే ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఈవెంట్‌పై పూర్తి వివరాలను తెలుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సప్ ఛానల్స్‌లో అందుబాటులో ఉంది! టెక్నాలజీ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సప్‌లో హెచ్‌టీ తెలుగు ఛానెల్‌ని ఫాలో అవ్వండి!
సంబంధిత కథనం