iPhone 14 price drop : భారీగా తగ్గిన ఐఫోన్ 14 ధర.. అమెజాన్‌లో ఈ డీల్ చెక్ చేయండి
13 April 2024, 9:06 IST
Offers on iPhone 14 : ఐఫోన్ 14 కొనాలని భావిస్తున్నారా? ఐఫోన్ 14 ధర తగ్గింది. అమెజాన్‌లో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్స్, ఆఫర్స్ వివరాలను ఇక్కడ చెక్ చేయండి..
ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ ఇస్తున్న అమెజాన్..
iPhone 14 price drop : కొత్త యాపిల్ డివైజ్ కొనాలనుకుంటున్నారా లేదా ఐఓఎస్ అప్ గ్రేడ్ కోసం చూస్తున్నారా? 2022లో లాంచ్ అయిన ఐఫోన్ 14పై అమెజాన్ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. మీరు ఆండ్రాయిడ్ నుంచి ఐఓఎస్‌కు మారాలనుకుంటే లేదా పాత ఐఫోన్ మోడళ్లను కలిగి ఉంటే, ఐఫోన్ 14కు మారడం మీకు అధునాతన ఫీచర్లతో గొప్ప అప్‌గ్రేడ్‌ను ఇస్తుంది. గుడ్ న్యూస్ ఏమిటంటే.. మీరు అమెజాన్ నుంచి సరసమైన ధరలో యాపిల్ ఐఫోన్ 14 పొందవచ్చు. డీల్స్, డిస్కౌంట్ల వివరాలు తెలుసుకోండి..
ఐఫోన్ 14 డిస్కౌంట్..
ఐఫోన్ 14 అసలు ధర రూ.79,900. అయితే, అమెజాన్ నుంచి.. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌పై 21శాతం తగ్గింపు పొందవచ్చు. ఇది ధరను గణనీయంగా తగ్గిస్తుంది. అంతేకాదు.. మీరు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా పొందవచ్చు. ఇది ఐఫోన్ 14 ధరను మరింత తగ్గిస్తుంది.
ఐఫోన్ 14 బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్..
iPhone 14 price cut : మీరు చేసే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై ఫ్లాట్ రూ.3000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు లావాదేవీలపై రూ.41,940 కనీస కొనుగోలు విలువపై రూ.3000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ పొందొచ్చు.
ఐఫోన్ 14 కొనుగోలుదారులు పాత స్మార్ట్‌ఫోన్స్‌ని ఎక్స్ఛేంజ్ చేసేటప్పుడు రూ .33400 వరకు తగ్గింపును అందించే ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ వ్యాల్యూ.. స్మార్ట్‌ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుందని గమనించండి. పాత స్మార్ట్‌ఫోన్ సరిగ్గా పనిచేస్తుందని నిర్ధారించుకోండి.
ఐఫోన్ 14 ఎందుకు కొనాలి?
offers on iPhone 14 in Amazon : ఐఫోన్ 14 స్మార్ట్‌ఫోన్‌లో 6.1 ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీ ర్ డిస్ప్లేను అందించింది యాపిల్ సంస్థ. 5 కోర్ జీపీయూతో కూడిన ఏ15 బయోనిక్ చిప్‌తో ఈ గ్యాడ్జెట్ పనిచేస్తుంది. ఫోటోగ్రఫీ విషయానికొస్తే, ఈ స్మార్ట్‌ఫోన్‌తో 12 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా ఉంది. ఐఫోన్ 14లో ముందువైపు 12 మెగాపిక్సెల్ కెమెరాను అందించింది యాపిల్ఐఐఐ సంస్థ. దీర్ఘకాలిక పనితీరు కోసం, ఐఫోన్ 14.. 20 గంటల వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది. అదనంగా, ఇది ఎమర్జెన్సీ ఎస్ఓఎస్, క్రాష్ డిటెక్షన్ వంటి ఫీచర్లను కూడా పొంది ఉంది.