Hyundai Alcazar: కొత్త 1.5 లీటర్ టర్బొ పెట్రోల్ ఇంజిన్ తో హ్యుండై అల్కజార్
08 January 2024, 20:01 IST
Hyundai Alcazar: హ్యుండై తన ప్రీమియం ఎస్యూవీ అల్కజార్ ను 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో తీసుకువస్తోంది. 2.0 లీటర్ నాచురల్లీ అస్పైర్డ్ పెట్రోల్ ఇంజిన్ స్థానంలో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ను ఇప్పుడు ఆల్కజార్ లో అమర్చారు.
1.5 టర్బొ పెట్రోల్ ఇంజిన్ తో కొత్త హ్యుండై అల్కజార్
Hyundai Alcazar: అల్కజార్ ఎస్యూవీ కొత్త వర్షన్ లో హ్యుండై 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ను అమర్చింది. ఇప్పటివరకు అల్కజార్ మోడల్స్ లో ఉన్న 2. 0 లీటర్ నాచురల్లీ అస్పైర్డ్ పెట్రోల్ ఇంజిన్ స్థానంలో ఈ అడ్వాన్స్డ్ టర్బో పెట్రో ఇంజిన్ ను అమర్చింది.
Hyundai Alcazar: రూ. 16 లక్షల నుంచి..
Hyundai Alcazar: హ్యుండై అల్కజార్ (Hyundai Alcazar) 7 సీటర్ బేసిక్ వేరియంట్ అయిన ‘ప్రెస్టీజ్(Prestige)’ ఎక్స్ షో రూమ్ ధరను రూ. 16.74 లక్షలుగా హ్యుండై నిర్ణయించింది. అలాగే, అల్కజార్ టాప్ వేరియంట్ ‘సిగ్నేచర్ (Signature(O)’ వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధరను రూ 20. 25 లక్షలుగా నిర్ణయించింది. టర్బో ఇంజిన్ అమర్చిన అల్కజార్ (Hyundai Alcazar) మోడల్ ఎస్యూవీ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ నెలాఖరు నుంచి వాహనాల డెలివరీ కూడా ప్రారంభమయ్యే అవకాశముంది.
Hyundai Alcazar 1.5-litre turbo: న్యూ అల్కజార్ ఫీచర్స్
- కొత్త 1.5 టర్బో పెట్రోల్ ఇంజిన్ అల్కజార్ (Hyundai Alcazar) గరిష్టంగా 160 హెచ్పీ పవర్, 253 ఎన్ఎం టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. మరోవైపు, ఇప్పటివరకు ఉన్న 2.0 లీటర్ నాచురల్లీ అస్పైర్డ్ పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 159 హెచ్ పీ వవర్, 192 ఎన్ ఎం టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది.
- కొత్త టర్బో ఇంజిన్ మోడల్ లో 6 స్పీడ్ మాన్యువల్, 7 స్పీడ్ డ్యుయల్ క్లచ్ ట్రాన్స్ మిషన్(డీసీటీ) గేర్ బాక్స్ ను అమర్చారు. ఇప్పటివరకు వచ్చిన ఆల్కజార్ లో 6 స్పీడ్ ఆటొమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ ఉంది.
- కొత్త టర్బొ ఇంజిన్ అల్కజార్ (Hyundai Alcazar) లో, అన్ని వేరియంట్లలో 6 ఎయిర్ బ్యాగ్స్ ను ఏర్పాటు చేశారు. అలాగే, ఇంటిగ్రేటెడ్ స్టార్ట్ - స్టాప్ టెక్నాలజీని అమర్చారు. ఈ కొత్త మోడల్ ఆల్కజార్ లీటర్ కు 17.5 నుంచి 18 కిమీల వరకు మైలేజీ ఇస్తుంది.
- బేసిక్ వేరియంట్ ప్రెస్టీజ్ (Prestige), టాప్ ఎండ్ వేరియంట్ సిగ్నేచర్ (Signature(O) కాకుండా, ఈ కొత్త ఆల్కజార్ లో ప్లాటినం (platinum), ప్లాటినం (ఓ) (platinum (O)) వేరియంట్లు కూడా ఉన్నాయి. ప్లాటినం (platinum) వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 18.65 లక్షలు కాగా, ప్లాటినం (ఓ) (platinum (O) వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 19.96 లక్షలుగా హ్యుండై నిర్ణయించింది.
టాపిక్