Hyundai India car sales : హ్యుందాయ్ ఇండియా కార్ సేల్స్‌లో 8.8శాతం వృద్ధి
01 March 2023, 13:40 IST
- Hyundai India car sales : ఫిబ్రవరి కార్ సేల్స్ డేటాను ప్రకటించింది హ్యుందాయ్ ఇండియా. మొత్తం మీద 8.8శాతం వృద్ధిని సాధించింది!
హ్యుందాయ్ ఇండియా కార్ సేల్స్‌లో 8.8శాతం వృద్ధి
Hyundai India car sales : ఫిబ్రవరి నెలకు సంబంధించిన కార్ సేల్స్‌ను ప్రకటించింది ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ ఇండియా. గత నెలలో దేశీయంగా 47,001 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలతో (44,050) పోల్చుకుంటే అది 6.7శాతం అధికం. ఇక గత నెలలో 10,850 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది. 2022 ఫిబ్రవరి అది 9,109గా ఉంది. అంటే 19.1శాతం వృద్ధిని నమోదు చేసినట్టు. మొత్తం మీద.. గత నెలలో 57,851 యూనిట్లను విక్రయించింది హ్యుందాయ్ ఇండియా. గతేడాది ఇదే సమయంతో (53,159) పోల్చుకుంటే అది 8.8శాతం ఎక్కువ.
కొత్తగా లాంచ్ అయిన ఐయానిక్ 5, టుక్సాన్, గ్రాండ్ ఐ10 నియోస్, ఆరాలకు మంచి డిమాండ్ కనిపిస్తోందని, ఫలితంగా అమ్మకాల్లో వృద్ధి సాధిస్తున్నామని హ్యుందాయ్ ఇండియా పేర్కొంది. ఇక హ్యుందాయ్‌కు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉన్న క్రేటాకు డిమాండ్ ఏమాంత్రం తగ్గడం లేదు. లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు 8.3లక్షల క్రేట్ యూనిట్లు అమ్ముడుపోయినట్టు హ్యుందాయ్ ఇండియా స్పష్టం చేసింది.
Hyundai India car sales in February : "ఇండియాలోని అన్ని సెగ్మెంట్లలో సేల్స్ నెంబర్లు సంతోషకరంగా ఉన్నాయి. ప్రజల నమ్మకం దక్కుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది," అని హ్యుందాయ్ ఇండియా స్పష్టం చేసింది.
ఎంజీ మోటార్..
ఫిబ్రవరి నెలకు సంబంధించిన సేల్స్‌ను ఎంజీ హెక్టార్ ప్రకటించింది. గత నెలలో 4,193 యూనిట్లను విక్రయించింది. సప్లై చెయిన్ వ్యవస్థలో ఆటంకాలు ఎదురైనట్టు, కానీ ఎస్‌యూవీల తయారీపై అధిక దృష్టిపెట్టినట్టు సంస్థ స్పష్టం చేసింది.
MG motors February car sales : మరోవైపు 2023 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన నెక్స్ట్ జెన్ హెక్టార్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నట్టు సంస్థ వెల్లడించింది. కొత్త హెక్టార్లో 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ పెట్రోల్ హైబ్రీడ్, 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ వస్తున్నాయి.