Hyundai Exter SUV : ఇండియాలో లాంచ్‌కు సిద్ధమవుతున్న హ్యుందాయ్ ఎక్స్టర్ ఇదే..!
05 May 2023, 6:33 IST
- Hyundai Exter : హ్యుందాయ్ ఎక్స్టర్ ఎస్యూవీ ఆన్లైన్లో రివీల్ అయ్యింది. త్వరలోనే ఇండియాలో లాంచ్ అవుతుంది. పూర్తి వివరాలు..
హ్యుందాయ్ ఎక్స్టర్
Hyundai Exter SUV : ఇండియాలో లాంచ్ అయ్యేందుకు హ్యుందాయ్ ఎక్స్టర్ ఎస్యూవీ సిద్ధమవుతోంది. అయితే.. అధికారిక లాంచ్‌కు ముందు ఈ కొత్త ఎస్యూవీ ఫొటోలు రివీల్ అయ్యాయి. టాటా పంచ్, సిట్రోయెన్ సీ3కి గట్టిపోటీనిచ్చే విధంగా ఉన్న ఈ ఎక్స్టర్.. సౌత్ కొరియా విధుల్లో టెస్ట్ డ్రైవ్ చేస్తుండగా కనిపించింది. ఎస్యూవీ వెనక, ముందు భాగాలను తొలిసారిగా ఈ ఫొటోల ద్వారా చూడవచ్చు. ఈ కారుకు సంబంధించిన డిజైన్ రెండర్‌ను హ్యుందాయ్ మోటార్స్ ఇటీవలే రివీల్ చేసిన విషయం తెలిసిందే.
హ్యుందాయ్ ఎక్స్టర్.. వావ్ అనిపించేలా!
Hyundai Exter SUV launch in India : స్పై షాట్స్ ప్రకారం.. ఎక్స్టర్ ఎస్యూవీ సైడ్‌లో అలాయ్ వీల్స్‌తో కూడిన స్క్వేర్డ్ వీల్ ఆర్చీస్ ఉన్నాయి. సీ- పిల్లర్‌కు డ్యూయెల్ టోన్, బ్లాక్ రూఫ్ రెయిల్స్ లభిస్తున్నాయి. రేర్‌లో ఎస్‌యూవీకి వ్రాప్ అరౌండ్ టెయిల్‌లైట్స్, ఫ్రెంట్లో ఎల్ఈడీ యూనిట్ తరహా హెడ్లైడ్స్ వస్తున్నాయి. టెయిల్లైట్స్కి కూడా హెచ్ షేప్ డీఆర్ఎల్స్ లభిస్తున్నాయి. ఫ్రెంట్ లైట్స్‌కి ఇవి ఉన్నట్టు డిజైన్ రెండర్లో స్పష్టమైంది. ఎస్యూవీ రేర్‌లో టెయిల్లైట్స్ని కనెక్ట్ చేస్తూ లైట్ బార్ వస్తోంది. రెండర్ ప్రకారం ఫ్రెంట్లో పారామెట్రిక్ పాటర్న్‌తో కూడిన గ్రిల్ ఉంటుంది.
ఇదీ చదవండి :- Hyundai Ai3 SUV launch : హ్యుందాయ్ నుంచి కొత్త ఎస్యూవీ.. త్వరలోనే లాంచ్!
ఈ ఎక్స్టర్ ఎస్‌యూవీని కేవలం పెట్రోల్ ఇంజిన్‌తోనే హ్యుందాయ్ ఆఫర్ చేస్తుందని తెలుస్తోంది. ఇందులో మేన్యువల్, ఆటోమెటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఉండనున్నాయి! ఐఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా ఉండొచ్చు. ఫీచర్-లోడెడ్ ఎస్‌యూవీగా ఇది ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. భారీ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, కనెక్టెడ్ టెక్నాలజీలతో పాటు ఇతర ఫీచర్స్ ఉండొచ్చు. ఇక హ్యుందాయ్ పోర్ట్‌ఫోలియోలో ఈ కొత్త ఎస్యూవీ గ్రాండ్ ఐ10 నియోస్, వెన్యూల మధ్యలో ఉండొచ్చు.
కొత్త ఎస్యూవీ ధర ఇదే..!
Hyundai Exter SUV price in India : హ్యుందాయ్ ఎక్స్టర్ అతి త్వరలోనే ఇండియాలోకి వస్తుందని తెలుస్తోంది. దీని ప్రారంభం ఎక్స్‌షోరూం ధర రూ. 6లక్షలుగా ఉండొచ్చు. లాంచ్ సమయంలో ఈ ఎస్‌యూవీకి సంబంధించిన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధరపై పూర్తి వివరాలు తెలిసే అవకాశ ఉంది. ఇక లాంచ్ తర్వాత ఈ ఎస్యూవీ.. టాటా పంచ్, సిట్రోయెన్ సీ3, మారుతీ సుజుగీ ఇగ్నిస్, నిస్సాన్ మాగ్నైట్ వంటి మోడల్స్‌కు గట్టి పోటీనిస్తుందని మార్కెట్ వర్గాల్లో అంచనాలు ఉన్నాయి.