తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mumbai : 'బిలియనీర్​ క్యాపిటల్​ ఆఫ్​ ఏషియా'గా ముంబై.. బీజింగ్​ని వెనక్కినెట్టి!

Mumbai : 'బిలియనీర్​ క్యాపిటల్​ ఆఫ్​ ఏషియా'గా ముంబై.. బీజింగ్​ని వెనక్కినెట్టి!

Sharath Chitturi HT Telugu

26 March 2024, 13:33 IST

google News
  • 2024 Global Rich List : ఆసియాలోనే ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్న నగరంగా ముంబై నిలిచింది! చైనా రాజధాని బీజింగ్​ని వెనక్కి నెట్టి, మొదటి స్థానాన్ని దక్కించుకుంది ముంబై.

ముకేశ్​ అంబానీ- నీతా అంబానీ..
ముకేశ్​ అంబానీ- నీతా అంబానీ.. (ANI)

ముకేశ్​ అంబానీ- నీతా అంబానీ..

Mumbai 2024 Global Rich List : ‘బిలియనీర్​ క్యాపిటల్​ ఆఫ్​ ఏషియా’గా అవతరించింది భారత వాణిజ్య రాజధాని ముంబై. చైనా రాజధాని బీజింగ్​ని వెనక్కి నెట్టి, ఈ జాబితాలో.. తొలిసారిగా మొదటి స్థానానికి చేరింది. హురున్ రీసెర్చ్ 2024 గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం.. ముంబైలో 92 మంది బిలియనీర్లు ఉండగా, బీజింగ్​లో ఆ నెంబర్​ 91గా ఉంది. ఇక భారత్​లో 271 మంది బిలియనీర్లు ఉన్నారు. కానీ చైనాలో ఈ నెంబర్​ 814గా ఉంది.

ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే.. అత్యధిక బిలియనీర్లు ఉన్న మొదటి నగరం న్యూయార్క్​ (119). రెండో స్థానంలో లండన్​(97) ఉంది. మూడో స్థానం ముంబైది.

ముంబైలో ఎంతమంది కొత్త బిలియనీర్లు ఉన్నారు?

ఈ ఏడాది.. ముంబైలో 26 మంది బిలియనీర్లు చేరగా, నెట్​ బేసిస్​ కింగ్​ బీజినంగ్​.. 18 మంది బిలియనీర్లను కోల్పోయింది.

ముంబైలోని బిలియనీర్ల మొత్తం సంపద ఎంత?

ముంబైలోని బిలియనీర్ల మొత్తం సంపద.. గత ఏడాదితో పోలిస్తే 47 శాతం పెరిగి 445 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మరోవైపు, బీజింగ్​ బిలియనీర్ల మొత్తం సంపద 265 బిలియన్ డాలర్లుగా ఉంది.

ముంబై సంపద రంగాలు ఏవి?

Billionaire capital of Asia : ముంబైలోని ఎనర్జీ, ఫార్మా రంగాల్లోనే సంపద ఎక్కువగా జనరేట్​ అవుతోంది. ఈ సెక్టార్లలో వ్యాపారాలు చేస్తున్న ముకేశ్​ అంబానీ వంటి వ్యాపారవేత్తల సంపద.. భారీగా పెరుగుతోంది.

ముంబైలో అత్యధిక సంపదను ఆర్జించిన వ్యక్తి ఎవరు?

పర్సెంటేజ్​ పరంగా చూసుకుంటే.. రియల్ ఎస్టేట్ దిగ్గజం మంగళ్ ప్రభాత్ లోధా ముంబైలోనే అతిపెద్ద సంపదను ఆర్జించారు (116%).

గ్లోబల్ రిచ్ లిస్ట్ సంగతేంటి?

ప్రపంచ ర్యాంకింగ్​లో భారతీయ బిలియనీర్లు..స్వల్పంగా వెనకపడ్డారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 10వ స్థానంలో నిలిచారు. గౌతమ్ అదానీ 8 స్థానాలు ఎగబాకి 15వ స్థానంలో నిలవగా, హెచ్​సీఎల్​ అధినేత శివ్ నాడార్, ఆయన కుటుంబం 16 స్థానాలు ఎగబాకి 34వ స్థానంలో నిలిచింది. సీరమ్ ఇన్​స్టిట్యూట్​కి చెందిన సైరస్ ఎస్ పూనావాలా 9 స్థానాలు క్షీణించి 82 బిలియన్ డాలర్ల సంపదతో 55వ స్థానానికి పడిపోయారు.

Richest people in the world : సన్ ఫార్మాస్యూటికల్స్ దిలీప్ సంఘ్వీ (61వ స్థానం), కుమార మంగళం బిర్లా (100వ స్థానం) సైతం ఈ జాబితాలో ఉన్నారు. రాధాకిషన్ దమానీ ఎనిమిది స్థానాలు ఎగబాకి 100వ స్థానంలో నిలిచాడు.

తదుపరి వ్యాసం