transferring shares: షేర్లను ఒక డీమ్యాట్ ఖాతా నుంచి మరో డీమ్యాట్ ఖాతాకు ఎలా బదిలీ చేయాలి?.. ఇలా సులువుగా చేసేయండి..
28 March 2024, 14:15 IST
Demat account: చాలా మంది ఇన్వెస్టర్లు ఒకటికి మించిన డీమ్యాట్ ఖాతాలను నిర్వహిస్తుంటారు. అయితే, స్టాక్ మార్కెట్లో లాభాలు పొందాలంటే సరైన విధంగా పోర్ట్ ఫోలియో నిర్వహణ ఉండాలి. ఒక డీమ్యాట్ ఖాతా నుంచి మరో డీమ్యాట్ ఖాతాకు షేర్లను బదిలీ చేయడం అనేది చాలా మంది ఇన్వెస్టర్లు ఉపయోగించే తెలివైన విధానం.
ప్రతీకాత్మక చిత్రం
Demat account: మీకు, ఒకటికి మించి డీమ్యాట్ ఖాతాలు ఉంటే, వాటిలో కేవలం షేర్లు, సెక్యూరిటీలను కలిగి ఉంటే సరిపోదు. వివిధ ఖాతాల్లో సరైన విధంగా షేర్ల నిర్వహణను కొనసాగిస్తుండాలి. షేర్లను మరో డీమ్యాట్ ఖాతాకు నిరాటంకంగా బదిలీ చేయడం అందులో ఒకటి. ఈ ఫీచర్ వల్ల షేర్ల కన్సాలిడేషన్ ఈజీ అవుతుంది. అంతేకాదు, దీనివల్ల మొత్తం పోర్ట్ ఫోలియోను సమర్థవంతంగా నిర్వహించే, పర్యవేక్షించడం సులభం అవుతుంది.
షేర్లను బదిలీ చేయడం వల్ల ప్రయోజనాలు
డీమ్యాట్ ఖాతా (Demat account) ల మధ్య సరైన విధంగా షేర్లను బదిలీ చేయడం వల్ల పెట్టుబడులు మార్కెట్లో కొనసాగుతున్న తీరుపై సరైన అవగాహన లభిస్తుంది. స్టాక్స్ కన్సాలిడేషన్ ప్రయోజనాలు లభిస్తాయి. షేర్లను సమర్థవంతంగా నిర్వహించడం, పర్యవేక్షించడం సులభం అవుతుంది.
షేర్ల కన్సాలిడేషన్: బహుళ ఖాతాల నుండి షేర్లను ఒకే డీమ్యాట్ ఖాతా (Demat account) కు బదిలీ చేయడం ద్వారా, వాటాదారులు తమ హోల్డింగ్ లను ఏకీకృతం చేయవచ్చు. వారి పోర్ట్ ఫోలియో నిర్వహణ ప్రక్రియను క్రమబద్ధీకరించవచ్చు. ఈ కన్సాలిడేషన్ షేర్ హోల్డర్ వద్ద ఉన్న అన్ని షేర్లను సమగ్రంగా అర్థం చేసుకునే వీలు లభిస్తుంది. దీనివల్ల పెట్టుబడులను ట్రాక్ చేయడం, పర్యవేక్షించడం సులభం అవుతుంది.
యాజమాన్య మార్పులను సులభతరం చేస్తుంది: కుటుంబ సభ్యులకు షేర్లను బహుమతిగా ఇవ్వడం, భార్యాభర్తల మధ్య వాటాలను బదిలీ చేయడం లేదా విలీనాలు లేదా డీమెర్జర్లు వంటి కార్పొరేట్ చర్యలను అమలు చేయడం వంటి యాజమాన్య మార్పుల సందర్భాల్లో వాటా బదిలీలు తరచుగా అవసరం. డీమ్యాట్ ఖాతాల మధ్య షేర్లను బదిలీ (Transferring shares between Demat accounts) చేసే సామర్థ్యం ఈ ప్రక్రియలను సులభతరం చేస్తుంది.
సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన లావాదేవీలు: డీమ్యాట్ ఖాతా ద్వారా షేర్లను ఎలక్ట్రానిక్ రూపంలో బదిలీ చేయడం వల్ల ఫిజికల్ షేర్ సర్టిఫికేట్లు, కాగితం ఆధారిత లావాదేవీల అవసరం లేకుండా పోతుంది. ఇది మరింత సౌకర్యవంతంగా, సమర్థవంతంగా, సురక్షితంగా ఉంటుంది. షేర్ హోల్డర్లు ఆన్ లైన్ లో షేర్ బదిలీలను ప్రారంభించవచ్చు. షేర్ల పనితీరును ట్రాక్ చేయవచ్చు.
రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా ఉండటం: డీమ్యాట్ ఖాతాల మధ్య షేర్ బదిలీలు రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. పారదర్శక, ఆడిటబుల్ లావాదేవీలను సులభం చేస్తాయి.
పోర్ట్ ఫోలియో మేనేజ్ మెంట్ ను మెరుగుపరుస్తుంది: ఒకే డీమ్యాట్ ఖాతాలో షేర్లను కన్సాలిడేట్ చేయడం ద్వారా అన్ని పెట్టుబడుల నిర్వహణ సులభం అవుతుంది. తద్వారా పోర్ట్ ఫోలియో మేనేజ్ మెంట్ మెరుగుపడుతుంది. ఇన్వెస్టర్లు తమ పోర్ట్ ఫోలియో పనితీరును విశ్లేషించవచ్చు. సరైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవచ్చు. అవసరమైన విధంగా వారి హోల్డింగ్లను సమర్థవంతంగా బ్యాలెన్స్ చేయవచ్చు.
డీ మ్యాట్ ఖాతాల బదిలీ ఎలా?
ఒక డీమ్యాట్ ఖాతా నుంచి మరో డీమ్యాట్ ఖాతాకు షేర్లను ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ పద్ధతుల ద్వారా బదిలీ చేయవచ్చు. ఆఫ్ లైన్ ప్రక్రియ కొంత సమయం తీసుకుంటుంది. ప్రస్తుతం ఆఫ్ లైన్ కన్నా.. ఆన్ లైన్ విధానం పాపులర్ అయింది. ఆన్ లైన్ విధానం ద్వారా సులభంగా డీ మ్యాట్ ఖాతాల బదిలీ సాధ్యమవుతుంది.
ఆఫ్ లైన్ షేర్ బదిలీ విధానం
- బదిలీ చేయవలసిన షేర్ల జాబితాను వాటి ఐఎస్ఐఎన్ నంబర్లతో సహా సిద్ధం చేయండి.
- క్లయింట్ ఐటీ, డీపీ ఐడీలు ఉన్న టార్గెట్ క్లయింట్ ఐడీని నోట్ చేసుకోండి.
- ఇంట్రా-డిపాజిటరీ లేదా ఆఫ్-మార్కెట్ వంటి తగిన బదిలీ విధానాన్ని ఎంచుకోండి.
- మీ డిపాజిటరీ పార్టిసిపెంట్ (DP) అందించిన డెబిట్ ఇన్స్ట్రక్షన్ స్లిప్ (DIS) నింపండి. సంతకం చేయండి.
- పూర్తి చేసిన డిఐఎస్ స్లిప్ ను మీ ప్రస్తుత బ్రోకర్ లేదా డీపీకి సమర్పించండి. వారి నుంచి రసీదు పొందండి.
మూడు నుండి ఐదు పనిదినాల్లో, మీ పాత డీమ్యాట్ ఖాతా నుండి కొత్తదానికి షేర్లు బదిలీ అవుతాయి. అయితే, ఇందుకు మీరు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ఆన్ లైన్ విధానంలో షేర్ బదిలీ
- సీడీఎస్ఎల్ (CDSL) వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి. అకౌంట్ కోసం రిజిస్టర్ చేసుకోండి.
- రిజిస్ట్రేషన్ తర్వాత, అవసరమైన సమాచారాన్ని నింపి, వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) తో మీ సెల్ ఫోన్ నంబర్ ను ధృవీకరించండి.
- ధృవీకరించిన తర్వాత, మీరు మీ ఖాతాలోకి లాగిన్ అయి, వాటా బదిలీ ప్రక్రియను ప్రారంభించవచ్చు.
- ఒక డీమ్యాట్ ఖాతా నుంచి మరో డీమ్యాట్ ఖాతాకు షేర్లను బదిలీ చేయడానికి వెబ్ సైట్ లోని సూచనలను అనుసరించండి.
- బదిలీ పూర్తయిన తర్వాత, మీకు ధృవీకరణ ఇమెయిల్ వస్తుంది.
రెండు పద్ధతులు వాటి స్వంత ప్రయోజనాలను అందిస్తాయి, ఆఫ్ లైన్ పద్ధతి సాంప్రదాయకంగా ఉంటుంది. ఆన్ లైన్ పద్ధతి అదనపు సౌలభ్యాన్ని అందిస్తుంది. డీమ్యాట్ ఖాతాల మధ్య షేర్లను నిరాటంకంగా బదిలీ చేయడానికి మీ ప్రాధాన్యతలు మరియు అవసరాలకు బాగా సరిపోయే పద్ధతిని ఎంచుకోండి.
FAQs: తరచుగా అడిగే ప్రశ్నలు
- డీమ్యాట్ ఖాతాల మధ్య షేర్లను బదిలీ చేయడానికి ఎంత సమయం పడుతుంది?
ఇది బదిలీ విధానం పై ఆధారపడి ఉంటుంది. ఇందులో సంబంధిత బ్రోకర్లు, డిపీల సామర్థ్యం, మార్కెట్ పరిస్థితులు వంటి అంశాలపై కూడా షేర్ల బదిలీ కాలపరిమితి ఆధారపడుతుంది. సాధారణంగా ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మూడు నుంచి ఐదు పనిదినాలు పడుతుంది. సాధారణంగా ఆన్ లైన్ విధానంలో త్వరగా పూర్తవుతుంది.
- డీమ్యాట్ ఖాతాల మధ్య షేర్ల బదిలీకి సంబంధించి ఏవైనా ఫీజులు ఉన్నాయా?
అవును, షేర్లను బదిలీ చేయడం కొరకు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. బ్రోకర్ పాలసీ, బదిలీ విధానాన్ని బట్టి (ఇంట్రా-డిపాజిటరీ, ఇంటర్-డిపాజిటరీ లేదా ఆఫ్-మార్కెట్) ఈ రుసుములు మారవచ్చు.
- నా షేర్ బదిలీ స్థితిని ట్రాక్ చేయవచ్చా?
ట్రాక్ చేయవచ్చు. సాధారణంగాబ్రోకర్ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా లేదా మీ డిపాజిటరీ పార్టిసిపెంట్ (DP)ని సంప్రదించడం ద్వారా మీ షేర్ బదిలీ స్థితిని ట్రాక్ చేయవచ్చు.
- షేర్ బదిలీ ప్రక్రియలో సమస్యలు ఉంటే ఏం చేయాలి?
షేర్ బదిలీ ప్రక్రియలో ఏవైనా సమస్యలు ఎదురైతే, సహాయం కోసం వెంటనే మీ బ్రోకర్ లేదా డీపీని సంప్రదించడం మంచిది.
- వివిధ బ్రోకర్లతో డీమ్యాట్ ఖాతాల మధ్య షేర్లను బదిలీ చేయవచ్చా?
చేయవచ్చు. వివిధ బ్రోకర్ల వద్ద ఉన్న డీమ్యాట్ ఖాతాల మధ్య షేర్లను బదిలీ చేయవచ్చు. ఈ ప్రక్రియలో సాధారణంగా ఇంటర్-డిపాజిటరీ బదిలీ ఉంటుంది. ఒకే బ్రోకర్ వద్ద ఉన్న ఖాతాల మధ్య బదిలీలతో పోలిస్తే అదనపు ఛార్జీలు లేదా ప్రాసెసింగ్ సమయాలు ఉండవచ్చు.
- డీమ్యాట్ ఖాతాల మధ్య బదిలీ చేసే షేర్ల సంఖ్యకు పరిమితి ఉందా?
సాధారణంగా డీమ్యాట్ ఖాతాల మధ్య బదిలీ అయ్యే షేర్ల సంఖ్యకు పరిమితి ఉండదు. అయితే, డిపాజిటరీ యొక్క విధానాలు, నియంత్రణ మార్గదర్శకాలు, బదిలీ చేస్తున్న షేర్ల రకాన్ని బట్టి కొన్ని పరిమితులు వర్తించవచ్చు. మీ బదిలీ అభ్యర్థనకు సంబంధించి నిర్దిష్ట వివరాల కోసం మీ బ్రోకర్ లేదా డీపీని సంప్రదించడం మంచిది.