Diwali Stock Picks : దీపావళి టాప్​-5 స్టాక్​ పిక్స్​.. ఇవి మీ పోర్ట్​ఫోలియోలో ఉంటే భారీ లాభాలు!-diwali 2023 stock picks top 5 buys from religare broking ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Diwali Stock Picks : దీపావళి టాప్​-5 స్టాక్​ పిక్స్​.. ఇవి మీ పోర్ట్​ఫోలియోలో ఉంటే భారీ లాభాలు!

Diwali Stock Picks : దీపావళి టాప్​-5 స్టాక్​ పిక్స్​.. ఇవి మీ పోర్ట్​ఫోలియోలో ఉంటే భారీ లాభాలు!

Sharath Chitturi HT Telugu
Nov 10, 2023 11:20 AM IST

Diwali 2023 Stock Picks : ప్రముఖ రెలిగేర్​ బ్రోకింగ్​ సంస్థ.. తన టాప్​ 5 దీపావళి స్టాక్​ పిక్స్​ లిస్ట్​ను ప్రకటించింది. ఆ వివరాలు..

ఇవి మీ పోర్ట్​ఫోలియోలో ఉంటే భారీ లాభాలు!
ఇవి మీ పోర్ట్​ఫోలియోలో ఉంటే భారీ లాభాలు!

Diwali Stock Picks : మంచి స్టాక్స్​లో ఇన్​వెస్ట్​ చేయాలని చూస్తున్నారా? ఈ దీపావళి నుంచే మీ ఇన్​వెస్ట్​మెంట్​ జర్నీని మొదలుపెట్టాలని భావిస్తున్నారా? అయితే ఇది మీకోసమే. రెలిగేర్​ బ్రోకింగ్​ సంస్థ టాప్​- 5 దీపావళి స్టాక్​ పిక్స్​ లిస్ట్​ను ఇక్కడ చూడండి.

దీపావళి స్టాక్​ పిక్స్​ 2023..

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​ (టీసీఎస్​):- టార్గెట్​- రూ. 4089, పర్సెంటెజ్​ రిటర్న్​- 20.9శాతం

లార్జ్​ క్యాప్​ ఐటీ స్టాక్స్​లో టీసీఎస్​ మంచి పిక్​. గత ఐదేళ్లుగా ఈ స్టాక్.​. 12.9శాతం సీఏజీఆర్​తో వృద్ధి చెందుతోంది. డిజిటల్​వైపు జరుగుతున్న ట్రాన్స్​ఫార్మేషన్​లో ఈ సంస్థది కీలక పాత్ర. ఆర్థిక విషయాలను చూస్తే.. ఎఫ్​వై23- ఎఫ్​వై25 మధ్యలో ఈ సంస్థ.. రెవెన్యూ/ఎబిట్​ వృద్ధి 16.7/19.8 శాతంగా ఉంటాయని అంచనాలు ఉన్నాయి.

Diwali Stock Picks 2023 : "ఎఫ్​వై24 క్యూ2 ఫలితాల తర్వాత ఈ స్టాక్​లో మంచి కరెక్షన్​ కనిపించింది. ఇప్పుడు వాల్యూ జోన్​లోకి వచ్చింది. అందుకే టీసీఎస్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ని రూ. 4,089కి పెంచాము," అని రెలిగేర్​ బ్రోకింగ్​ సంస్థ వెల్లడించింది.

ఐటీసీ:- టార్గెట్​ ప్రైజ్​- రూ. 535, పర్సెంటేజ్​ రిటర్న్​- 22.4శాతం

ఐటీసీ నెక్ట్స్​ స్ట్రాటజీని సంస్థ సీరియర్​గా అమలు చేస్తోంది. ఫలితంగా ఈ సంస్థ ఫ్యూచర్​ రెడీ పోర్ట్​ఫోలియో పటిష్ఠంగా మారొచ్చు. అంతేకాకుండ నాన్​-సిగరెట్​ బిజినెస్​, మరీ ముఖ్యంగా ఎఫ్​ఎంసీజీ రంగంలో తమ వ్యాపారాన్ని పెంచుకోవాలని సంస్థ చూస్తోంది. హోటల్​ బిజినెస్​ని డీమర్జ్​ చేయడం కూడా పాజిటివ్​ విషయం.

Best stocks to buy for Diwali : "మొత్తం మీద.. ఐటీసీ గ్రోత్​పై పాజిటివ్​గా ఉన్నాము. ఎఫ్​వై23-ఎఫ్​వై25లో సంస్థ రెవెన్యూ/ పాట్​లు 15/19.2శాతాలుగా ఉంటాయని భావిస్తున్నాము. అందుకే ఐటీసీ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ రూ. 535కి పెంచాము," అని రెలిగేర్​ బ్రోకింగ్​ సంస్థ స్పష్టం చేసింది.

యాక్సిస్​ బ్యాంక్​:- టార్గెట్​ ప్రైజ్​- రూ. 1,167. పర్సెంటేజ్​ రిటర్న్​- 14.2శాతం.

Axis bank share price target " యాక్సిస్​ బ్యాంక్​ రీటైల్​ అసెస్ట్స్​ గ్రోత్​ బలంగా ఉంది. ఎఫ్​వై20-23 మధ్యలో 17శాతం సీఏజీఆర్​తో గ్రో అయ్యింది. బ్యాంక్​ డిపాజిట్లు సైతం 15శాతం సీఏజీఆర్​తో వృద్ధి చెందాయి.

అసెట్​ బుక్​, డిపాజిట్ల ప్రీమియమైజేషన్​, వెల్త్​ మేనేజ్​మెంట్​ బిజినెస్​, క్రెడిట్​ కార్డ్​ సెగ్మెంట్​ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని యాక్సిస్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ని రూ. 1,167గా ఇస్తున్నట్టు పేర్కొంది రెలిగేర్​ బ్రోకింగ్​.

మారుతీ సుజుకీ ఇండియా:- టార్గెట్​ రూ. 12714, పర్సెంటెజ్​ రిటర్న్​- 23.2శాతం

Stocks to by for Muhurat trading : 'మారుతీ సుజుకీ ఇండియా మార్కెట్​ షేరు పెరుగుతుందని ఆశిస్తున్నాము. కమోడిటీ ధరలు కూడా సంస్థకు సానుకూలంగా ఉన్నాయి. రెవెన్యూ వృద్ధిచెందుతుంది,' అని రెలిగేర్​ బ్రోకింగ్​ పేర్కొంది.

ఆర్థిక విషయాలకొస్తే.. సంస్థ రెవెన్యూ/ ఎబిట్​డా/ పాట్​లు వరుసగా 18.2శాతం/ 34.9శాతం / 33.5శాతం సీఏజీఆర్​ (ఎఫ్​వై23-25ఈ)తో వృద్ధి చెందాయి. ఫలితంగా ఈ స్టాక్​లో రిస్క్​-రివార్డ్​ ఫేవరెబుల్​గా ఉంది. అందుకే రెలిగేర్​ బ్రోకింగ్​ సంస్థ. మారుతీ సుజుకీ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ని రూ. 12,714గా ఇస్తోంది.

ఎస్​బీఐ లైఫ్​:- టార్గెట్​ ప్రైజ్​- రూ. 1644, పర్సెంటెడ్​ రిటర్న్​- 22.2శాతం

SBI Life share price target : ఎఫ్​వై20-23 మధ్యలో ఎస్​బీఐ లైఫ్​ ఇన్ష్యూరెన్స్​ ఏపీఈ (యాన్యువల్​ ప్రీమియం ఈక్వివాలెంట్​).. 16శాతం సీఏజీఆర్​తో వృద్ధిచెందింది. గ్రాస్​ రిటెన్​ ప్రీమియం.. 18.3శాతంతో పెరిగింది. బిజినెస్​ మోడల్​ చాలా బాగుందని, మార్కెట్​ షేర్​ కూడా పెరిగే అవకాశం ఉందని బ్రోకరేజ్​ అభిప్రాయపడుతోంది.

"ఎఫ్​వై23- 25ఈలో ఏపీఈ, ఎన్​బీపీ, వీఎన్​బీలు 19శాతం, 21శాతం, 23శాతం సీఏజీఆర్​తో వృద్ధి చెందుతాయని ఆశిస్తున్నాము. అందుకే ఎస్​బీఐ లైఫ్​ ఇన్ష్యూరెన్స్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ని రూ. 1,644గా ఇస్తున్నాము," అని రెలిగర్​ బ్రోకింగ్​ పేర్కొంది.

(గమనిక:- ఇవి బ్రోకింగ్​ సంస్థ అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్​వెస్ట్​ చేసే ముందు.. మీ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ను సంప్రదించడం శ్రేయస్కరం.)

సంబంధిత కథనం