MS Dhoni latest news : ఎస్బీఐ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంఎస్ ధోనీ..!
MS Dhoni SBI news : ఎస్బీఐ బ్రాండ్ అంబాసిడర్‌గా ఇకపై ఎంఎస్ ధోనీ వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని బ్యాంకు తాజాగా వెల్లడించింది.
MS Dhoni SBI news : దేశ బ్యాంకింగ్ వ్యవస్థలోనే అతిపెద్ద సంస్థ ఎస్బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా).. టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీతో కొలాబొరేషన్ను ఫిక్స్ చేసుకుంది. ఇకపై.. ఎస్బీఐకి అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు ధోనీ.
"ఒత్తిడిలోనూ ధోనీ కూల్‌గా ఉంటారు. చాలా స్పష్టంగా ఆలోచిస్తారు. వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇన్ని లక్షణాలు ఉన్న ధోనీ.. ఎస్బీఐకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండటం సంతోషకరం. ధోనీ.. ఈ బ్యాంక్‌ను, కస్టమర్లకు మరింత చేరువ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక నుంచి బ్యాంక్ మార్కెటింగ్, ప్రొమోషన్స్లో ధోనీ కీలక పాత్ర పోషిస్తారు," అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది.
"కస్టమర్లతో లోతైన సంబంధాలను ఏర్పరచుకునేందుకు మా బ్యాంక్ కృషి చేస్తోందని, విలువలు- నాయకత్వ లక్షణాలను ప్రాధాన్యతనిస్తుంది ధోనీని ఎంపిక చేసుకోవడంతో అర్థం చేసుకోవచ్చు," అని ఎస్బీఐ స్పష్టం చేసింది.
"మా బ్రాండ్‌కు ధోనీ సరిగ్గా సూట్ అవుతారు. కస్టమర్లలో నమ్మకం మరింత పెరుగుతుంది. దేశం, భారతీయులతో నమ్మకంగా కలిసి పనిచేసేందుకు మేము కట్టుబడి ఉన్నాము. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాము," అని ఎస్బీఐ ఛైర్మన్ దినేశ్ ఖారా తెలిపారు.
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత.. ధోనీ చాలా బిజీబిజీగా గడుపుతున్నారు. అనేక సంస్థలతో కలిసి యాడ్స్ చేస్తున్నారు. సొంతంగా వ్యాపారాలు చూసుకుంటున్నారు. ఇక ఇప్పుడు.. ఎస్బీఐకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారడంతో.. ఇకపై ఈ బ్యాంక్ యాడ్స్‌లో ధోనీ కనిపించనున్నారు!
ధోనీలో కొత్త యాంగిల్..
ఇక ఇతర విషయాలకొస్తే.. మిస్టర్ కూల్ ధోనీ.. తనలోని ఓ కొత్త యాంగిల్‌ని ఇటీవలే బయటపెట్టారు. బెంగళూరు వేదికగా జరిగిన ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆయన.. స్టాక్ మార్కెట్ల గురించి మాట్లాడి, అందరిని ఆశ్చర్యపరిచారు.
Dhoni on stock markets : "గత రెండు రోజులుగా నా పోర్ట్‌ఫోలియో 8శాతం పడిపోయిందని, వీరందరు సంతోషంగా ఉన్నారు. 19,300 దగ్గర బలమైన సపోర్ట్ ఉందని, కచ్చితంగా మార్కెట్ పైకి వెళుతుందని వీరు (స్టాక్ మార్కెట్ నిపుణులు) చెబుతారు. కానీ ఆ మరుసటి రోజే.. నిఫ్టీ 18,800కి పడిపోయింది," అని ధోనీ అన్న మాటలకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ధోనీ అన్న మాటలతో ఈవెంట్లో ఉన్న వారందరు నవ్వుకున్నారు.
ఆ తర్వాత.. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గురించి కూడా ధోనీ మాట్లాడినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం