Stocks to buy today : ఈ రూ. 250 వద్ద ఉన్న స్టాక్‌ని కొంటే షార్ట్ టర్మ్‌లో భారీ లాభాలు!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
Stocks to buy today : ఇండియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ను నష్టాల్లో ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 76 పాయింట్లు కోల్పోయి 64,756 వద్ద ఓపెన్ అయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 43 పాయింట్ల నష్టంతో 19,352 వద్ద ప్రారంభమైంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్‌ని స్వల్ప నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 143 పాయింట్లు కోల్పోయి 64,832 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 48 పాయింట్ల నష్టంతో 19,395 వద్ద ముగిసింది. ఇక 25 పాయింట్లు పెరిగిన బ్యాంక్ నిఫ్టీ.. 43,684 వద్దకు చేరింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. 19,450- 19,500 లెవల్స్ వద్ద నిఫ్టీకి బలమైన రెసిస్టెన్స్ ఉంది. అది దాటితే.. నిఫ్టీ మరింత పెరిగే అవకాశం ఉంది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
Stock market news today : గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1712.33 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1512.14 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
అమెరికా సూచీలు.. గురువారం ట్రేడింగ్ సెషన్లో నష్టాలను చూశాయి. డౌ జోన్స్ 0.65శాతం, ఎస్ అండ్ పీ 500 0.81శాతం, నాస్డాక్ 0.94శాతం మేర నష్టపోయాయి.
వడ్డీ రేట్ల విషయంలో ఫెడ్ ఛైర్మన్ పావెల్ నెగివిట్ స్టేట్మెంట్స్ చేయడంతో మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు తాము చేపట్టిన చర్యలు సరిపోకపోవచ్చని ఆయన అన్నారు.
స్టాక్స్ టు బై..
మారుతీ సుజుకీ:- బై రూ. 10400, స్టాప్ లాస్ రూ. 10200, టార్గెట్ రూ. 10800
లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్టీ):- బై రూ. 3024.85, స్టాప్ లాస్ రూ. 2950, టార్గెట్ రూ. 3150
Tata Power share price target : టాటా పవర్:- బై రూ. 248, స్టాప్ లాస్ రూ. 242, టార్గెట్ రూ. 260
భారత్ ఫోర్జ్:- బై రూ. 1032, స్టాప్ లాస్ రూ. 1010, టార్గెట్ రూ. 1070
పీఐ ఇండస్ట్రీస్:- బై రూ. 3645- రూ. 3648, స్టాప్ లాస్ రూ. 3385, టార్గెట్ రూ. 4016
Intraday stocks to buy today : ఎఫ్డీసీ:- బై రూ. 385- రూ. 386, స్టాప్ లాస్ రూ. 361, టార్గెట్ రూ. 420
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం