Mutual Funds : మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ మరణిస్తే డబ్బులు ఎవరు పొందుతారు? ఎలా క్లెయిమ్ చేయాలి?
22 October 2024, 18:30 IST
- Mutual Funds Investors : మ్యూచువల్ ఫండ్స్ లాభదాయకమైన పెట్టుబడి. అయితే ఇందులో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి మరణిస్తే.. డబ్బులు ఎవరికి వెళ్తాయి? ఎలా క్లెయిమ్ చేయాలి?
మ్యూచువల్ ఫండ్స్
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిలో లాభదాయకమైనది. ఇందులో ప్రమాదాలు కూడా ఉంటాయి. స్టాక్ మార్కెట్ ఊహించని హెచ్చు తగ్గులు కూడా పెట్టుబడిని ప్రభావితం చేసే అవకాశం ఉంది. మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టిన ఖాతాదారుడు మరణిస్తే పెట్టుబడి మొత్తాన్ని ఎవరు పొందుతారు? కుటుంబ సభ్యులు దీనిని ఉపయోగించవచ్చా?
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారు చనిపోయినప్పుడు చట్టపరమైన వారసులు, నామినీలు ఈ పెట్టుబడిని క్లెయిమ్ చేయగలరు. ఈ ప్రక్రియను యూనిట్ ట్రాన్స్‌మిషన్ అంటారు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ మరణిస్తే పెట్టుబడిని ఎలా క్లెయిమ్ చేయాలో చూద్దాం.
డిపాజిటర్ మరణిస్తే డిపాజిట్‌ను వారి పేరు మీద మరొక లబ్ధిదారునికి బదిలీ చేయవచ్చు. ఆ ప్రయోజనం కోసం మ్యూచువల్ ఫండ్ హౌస్‌కి క్లెయిమ్ సమర్పించే వ్యక్తి లేదా వ్యక్తులను క్లెయింట్లు అంటారు. ఇందులో మూడు రకాల హక్కుదారులు ఉన్నారు. జాయింట్ అకౌంట్ హోల్డర్స్, నామినీ, చట్టపరమైన వారసులు.
పెట్టుబడిదారునికి ఇతర వారసులు లేకుంటే వయోజన నామినీ పెట్టుబడిదారుడి మరణంపై క్లెయిమ్ చేయవచ్చు. మ్యూచువల్ ఫండ్ యూనిట్‌లను ముందుగా ఫారమ్ టీ3ని ఆర్టీఏలకు లేదా నేరుగా ఏఎంసీ బ్రాంచ్‌లలో సమర్పించడం ద్వారా నామినీ పేరుకు బదిలీ చేయవచ్చు. డిపాజిటర్ మరణ ధృవీకరణ పత్రం, క్లెయిం చేసిన వ్యక్తి పాన్ కార్డ్, కేవైసీ ఫారమ్, క్యాన్సిల్ చెక్/బ్యాంక్ స్టేట్‌మెంట్/పాస్‌బుక్, మరణించిన వ్యక్తి ఐడీ రుజువుతో సహా పత్రాలు ఈ దరఖాస్తుతో పాటు సమర్పించాలి. ఫారమ్ టీ3లో పేర్కొన్న విధంగా మొత్తం సమాచారాన్ని ఇవ్వాలి.
దరఖాస్తును సమర్పించిన తర్వాత అందుకున్న క్లెయిమ్ మొత్తం రూ.5 లక్షల వరకు ఉంటే అనుబంధం-I(A) ప్రకారం బ్యాంక్ మేనేజర్ నామినీ సంతకం ధృవీకరించాలి. కానీ అందుకున్న మొత్తం రూ.5 లక్షల కంటే ఎక్కువ అయితే, నామినీ సంతకం తప్పనిసరిగా నోటరీ పబ్లిక్ లేదా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్‌తో ధృవీకరించాలని గుర్తుంచుకోండి.
నామినీ మైనర్ అయితే ఈ పత్రాలు కావాలి. పిల్లల జనన ధృవీకరణ నకలు, పిల్లల తల్లిదండ్రుల పాన్ కార్డ్ కాపీ, తల్లిదండ్రుల కేవైసీ, తల్లిదండ్రుల సంతకాన్ని ధృవీకరించాలి.
ఫారమ్ టీ3లో పేర్కొన్న విధంగా ఉండాలి. చివరి ధృవీకరణ కోసం ఒరిజినల్ డాక్యుమెంట్లను తీసుకెళ్లాలి. ఈ మ్యూచువల్ ఫండ్ ఖాతాలో నామినేషన్ నమోదు కాకపోతే.. చట్టపరమైన వారసుడు దానిని క్లెయిమ్ చేయవచ్చు.