Demat account nominee : మీ డీమ్యాట్ అకౌంట్లో నామినీ వివరాలను ఇలా అప్డేట్ చేసుకోండి..
Demat account nominee : డీమ్యాట్ అకౌంట్‌కి ఎవరిని నామినీగా పెట్టొచ్చు? ఆన్లైన్లో నామినీ వివరాలను ఎలా అప్డేట్ చేయాలి? లేదా ఎలా తొలగించాలి? అని చాలా ప్రశ్నలు వస్తున్నాయి. వాటన్నింటికీ ఇక్కడ సమాధానం తెలుసుకుందాము..
Demat account nominee add last date : ఇప్పుడు చాలా మంది ఫోకస్.. స్టాక్ మార్కెట్! దేశీయ సూచీలు గత కొన్నేళ్లుగా అప్‌ట్రెండ్‌లో ఉండటంతో, చాలా మంది ఇన్వెస్ట్మెంట్స్ మొదలుపెడుతున్నారు. ఇందుకోసం డీమ్యాట్ అకౌంట్ తీసుకుంటున్నారు. అయితే.. డీమ్యాట్ ఖాతాకు నామినీ విషయంలో చాలా సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ఎవరిని నామినీగా పెట్టొచ్చు? ఆన్లైన్లో నామినీ వివరాలను ఎలా అప్డేట్ చేయాలి? అని చాలా ప్రశ్నలు వస్తున్నాయి. వాటన్నింటికీ ఇక్కడ సమాధానం తెలుసుకుందాము..
నామినీ అంటే ఎవరు?
తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలు లేదా ఇతర వ్యక్తులు వంటి కుటుంబ సభ్యులను.. నామినీగా మీరు నామినేట్ చేయవచ్చు. మీరు మైనర్‌ను నామినేట్ చేయాలనుకుంటే, వారి సంరక్షకుడి ఉంటూ ఆ వివరాలను కూడా అందించాలి. అప్పుడు సదరు వ్యక్తి.. మీ డీమ్యాట్ అకౌంట్‌ని సొంతం చేసుకోగలడు, నిర్వహించగలడు, ప్రయోజనం పొందగలడు.
మీరు మీ డీమ్యాట్ ఖాతాకు గరిష్ఠంగా ముగ్గురు నామినీలను నియమించుకోవచ్చు. ప్రతి నామినీకి.. ఖాతా నిర్దిష్ట శాతాన్ని కేటాయించవచ్చు.
How to add nominee in Zeordha : ఉదాహరణకు, మీరు ముగ్గురిని నామినేట్ చేస్తే.. మీరు ఒక నామినీకి 35 శాతం, మరొకరికి 40 శాతం, మూడొవ వ్యక్తికి 25 శాతం కేటాయించవచ్చు.
నామినీ వివరాలను ఎలా జోడించాలి/అప్డేట్ చేయాలి?
ఆన్లైన్లో మీ డీమ్యాట్ ఖాతాకు నామినీని జోడించడం / అప్డేట్ చేయడం ఒక సాధారణ ప్రక్రియ. మొదట, మీరు మీ బ్రోకర్‌కి సమర్పించిన అకౌంట్ ఒపెనింగ్ ఫామ్‌లో నామినీ వివరాలను జోడించవచ్చు. తరువాతి కాలంలో నామినీలను జోడించడానికి, లేదా తొలగించడానికి, మీ బ్రోకర్‌కు అనుబంధం 1A ఫామ్‌ని సబ్మిట్ చేయండి.
ఆన్లైన్లో నామినీని జోడించడానికి/అప్డేట్ చేయడానికి ఈ స్టెప్స్‌ని అనుసరించండి:
- మీ డీమ్యాట్ అకౌంట్లో లాగిన్ చేయండి.
- అకౌంట్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీ వ్యక్తిగత ఖాతా వివరాలను యాక్సెస్ చేసుకోండి.
- నామినీ పేరు, పుట్టిన తేదీ, సంబంధం, కేటాయింపు శాతంతో సహా నామినీ సమాచారాన్ని నమోదు చేయండి/ అప్డేట్ చేయండి.
- ఒకవేళ.. ఒకరి కన్నా ఎక్కువ మంది నామినీలు ఉన్నట్లయితే, ప్రతిదానికి ఎంత శాతం కేటాయింపును ఇవ్వాలో పేర్కొనండి.
- అవసరమైన అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత, మార్పులను ఖరారు చేయడానికి 'సబ్మిట్' మీద క్లిక్ చేయండి.
నామినీని నియమించేటప్పుడు ఇవి గుర్తుపెట్టుకోండి..
How to add nominee in Upstox : డీమ్యాట్ ఖాతాకు నామినీని నియమించేటప్పుడు, ఈ క్రింది ముఖ్య అంశాలను గుర్తుంచుకోండి:
కార్పొరేట్ సంస్థలును నామినీగా నియమించలేరు. వ్యక్తులను మాత్రమే నామినీ చేయవచ్చు. ఫామ్‌లో ఖాతాదారుడి సంతకంతో పాటు నామినీ పేరు, చిరునామా అవసరం. నామినీ ఐడీ ప్రూఫ్ సమర్పించడం ఆప్షనల్. ఖాతాదారుడు వేలిముద్రను ఉపయోగిస్తే సాక్షి పేరు, సంతకం అవసరం. నామినీ మైనర్ అయితే సంరక్షకుడి పేరు, చిరునామాతో పాటు మైనర్ పుట్టిన తేదీ కూడా అవసరం. నామినీ, సంరక్షకుడు, ఖాతాదారుడు ఒకే వ్యక్తిగా ఉండకూడదు. ఇప్పటికే ఉన్న నామినీని తొలగించడానికి లేదా "ఆప్ట్-అవుట్" ఎంపికను ఎంచుకోవడానికి.. ఖాతాదారుడు నామినేషన్ చేయకూడదనే వారి ఉద్దేశాన్ని తెలియజేస్తూ అదే ఫామ్‌ని పూర్తి చేయాలి.
ఆన్లైన్ నామినేషన్ సదుపాయం మీ పెట్టుబడులను నియమించిన వ్యక్తికి సమర్థవంతంగా బదిలీ చేయడానికి అనుమతిస్తుంది. అనుకోని పరిస్థితుల్లో మీ కుటుంబ ఆర్థిక భద్రతను నిర్ధరిస్తుంది. కొత్త ఇన్వెస్టర్లు డీమ్యాట్ ఖాతా తెరిచేటప్పుడు నామినీని జోడించవచ్చు, ఇప్పటికే ఉన్న ఖాతాదారులు నామినీలను జోడించడానికి ఖాతా వివరాలను సవరించవచ్చు.
డీమ్యాక్ అకౌంట్ ప్రశ్నలు- సమాధానాలు..
డీమ్యాట్ ఖాతాకు ఎవరు నామినేట్ కావచ్చు?
నామినీలలో తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలు, తోబుట్టువులు లేదా ఇతర బంధువులు ఉండవచ్చు. మైనర్లను కూడా నామినేట్ చేయవచ్చు. వారి సంరక్షకుడి వివరాలను అందించవచ్చు. నామినీ, సంరక్షకుడు ఖాతాదారుడు ఒకే వ్యక్తిగా ఉండకూడదు.
నేను ఒకరి కంటే ఎక్కువ మందిని నామినేట్ చేయవచ్చా?
Demat account nominee : అవును, మీరు ఒక డీమ్యాట్ ఖాతాలో ముగ్గురు నామినీలను జోడించవచ్చు. ప్రతి నామినీకి ఖాతా హోల్డింగ్స్‌లో నిర్దిష్ట శాతాన్ని కేటాయించవచ్చు.
నేను నామినీని జోడించకపోతే ఏమి జరుగుతుందని?
మీరు నిర్దేశించిన గడువులోగా నామినీని జోడించకపోతే, మీరు నామినేషన్ ఆవశ్యకతను తీర్చే వరకు మీ డీమ్యాట్ ఖాతా, ట్రేడింగ్ ఖాతాను డీయాక్టివేట్ చేసే అవకాశం ఉంది.
సంబంధిత కథనం