Nominee for stock market: స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు నామినీని యాడ్ చేశారా?.. లాస్ట్ డేట్ దగ్గర పడుతోంది..
Nominee for stock market: ట్రేడింగ్ అకౌంట్స్, డీమాట్ ఖాతాలు, మ్యుచ్యువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టినవారు తమ అకౌంట్లకు నామినీలను యాడ్ చేయాల్సి ఉంటుంది. అలా చేయని వారు సెప్టెంబర్ 30 లోగా నామినీలను యాడ్ చేయాలి.
Nominee for stock market: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, ట్రేడింగ్ ఖాతాలు, డిమ్యాట్ ఎకౌంట్లు తదితర ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలకు నామినీలను జతపరిచే అవకాశం సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఉంటుంది. అంటే మరో పది రోజుల్లో డెడ్లైన్ ముగుస్తుంది. అందువల్ల మ్యూచువల్ ఫండ్స్, డిమ్యాట్ ఖాతాలు మొదలైన వాటిలో పెట్టుబడులు పెట్టిన వారు తమ ఖాతాలకు వెంటనే నామినీలను జతపరచుకోవాలి.
అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది..
సెప్టెంబర్ 30 లోగా ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ఖాతాలకు నామినీలను యాడ్ చేసుకోవాలని మార్కెట్ రెగ్యులేటర్ ‘సెబీ’ మార్చి 27న ఒక సర్కులర్ జారీ చేసింది. ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్ హోల్డర్లు నామినీలను ఆడ్ చేయడానికి సెప్టెంబర్ 30 వ తేదీ వరకు అవకాశం ఇస్తున్నట్లు ఆ సర్కులర్లో సెబి తెలిపింది. అందువల్ల డిమ్యాట్ ఖాతాలను నిర్వహించేవారు, మ్యుచ్యువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టినవారు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వారు వెంటనే తమ ఖాతాలకు నామినీలను జతపరచుకోవాలని, ఈ విషయంలో ఆలస్యం చేయవద్దని నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరి లిమిటెడ్ (nsdl) సూచించింది. ఇప్పటివరకునామినేషన్ యాడ్ చేయని వారు ఇకనైనా త్వరపడి తమ ట్రేడింగ్ కథలకు నామినీలను యాడ్ చేసుకోవడం మంచిది. నామినీలను జత చేయని ఖాతాలు సెప్టెంబర్ 30 తరువాత ఫ్రీజ్ చేయబడతాయి.
కొత్తగా ఓపెన్ చేసేవారు..
అలాగే కొత్తగా ట్రేడింగ్, డిమ్యాట్ ఎకౌంట్లను ఓపెన్ చేసేవారు కచ్చితంగా నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. తమ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ఖాతాలకు ఇప్పటికే నామినేషన్లను ఇచ్చినవారు మరోసారి నామినీలను ఆడ్ చేయాల్సిన అవసరం లేదు.
నామినీలను యాడ్ చేయడం ఎలా?
- నామినీలను యాడ్ చేయడం కోసం ముందుగా మీ డీమ్యాట్ అకౌంట్ లోకి లాగిన్ కావాలి.
- అందులో మై నామినేషన్ సెక్షన్ లోకి వెళ్ళాలి అది ప్రొఫైల్ సెగ్మెంట్లో ఉంటుంది.
- అనంతరం నామిని డీటెయిల్స్ పేజీలోకి వెళ్తారు. అక్కడ ఆడ్ నామిని ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి.
- నామిని డీటెయిల్స్ ను ఎంటర్ చేయాలి. నామినీకి సంబంధించిన ఐడి ప్రూఫ్ ను ఎంటర్ చేయాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయాలి. ఒకరికి మించిన నామినీలు ఉంటే వారి వారి శాతాలను స్పష్టంగా వివరించాలి.
- ఆధార్ ఓటిపి ద్వారా డాక్యుమెంట్ పై ఈ - సైన్ చేయాలి. దాంతో మీ నామిని యాడ్ చేసే ప్రక్రియ పూర్తవుతుంది.