తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Book A Uber Via Whatsapp: వాట్సాప్ నుంచి కూడా ‘ఉబర్’ బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే?

Book a Uber via WhatsApp: వాట్సాప్ నుంచి కూడా ‘ఉబర్’ బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే?

HT Telugu Desk HT Telugu

27 December 2022, 19:54 IST

google News
  • Book a Uber via WhatsApp: యూజర్లకు మరిన్ని సేవలను అందించే లక్ష్యంతో పని చేసే వాట్సాప్.. తాజాగా టాక్సి అగ్రిగేటర్ ఉబర్ తో జత కట్టింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Book a Uber via WhatsApp: టాక్సి అగ్రిగేటర్ యాప్ ఉబర్ సేవలను పొందాలంటే, ఆ యాప్ ను మన స్మార్ట్ ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకుని కానీ, ఉబర్ వెబ్ సైట్ ద్వారా కానీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, తాజాగా, వాట్సాప్ నుంచి కూడా ఉబర్ రైడ్ ను బుక్ చేసుకోవచ్చు.

Book a Uber via WhatsApp: వాట్సాప్ - ఉబర్

ఉబర్ సేవలు వాట్సాప్ లోనూ లభించనున్నాయి. అందుకు గాను కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. అవేంటంటే..

  • ముందుగా ఉబర్ అఫిషియల్ నెంబర్ +91 7292000002 ను మీ ఫోన్ కాంటాక్ట్స్ లో సేవ్ చేసుకోవాలి.
  • ఆ నెంబర్ కు మీ వాట్సాప్ నుంచి Hi అనే సందేశం పంపించండి. లేదీ ఈ http://wa.me/917292000002 సైట్ నుంచి కూడా ఉబర్ తో నేరుగా చాట్ చేయవచ్చు.
  • మీ పిక్ అప్, డెస్టినేషన్ లొకేషన్ ను కానీ, అడ్రస్ ను కానీ పంపించాలి. లేదా పికప్ కోసం లైవ్ లొకేషన్ ను షేర్ చేయవచ్చు.
  • మీ రైడ్ చార్జి ఇతర వివరాలు వస్తాయి. వాటిని మీరు అంగీకరిస్తున్నట్లుగా కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది.
  • ఉబర్ డ్రైవర్ మీ రైడ్ ను యాక్సెప్ట్ చేసిన తరువాత, ఆ వివరాలన్నీ మీ వాట్సాప్ కు వస్తాయి. వాట్సాప్ పే ద్వారా పేమెంట్ చేయవచ్చు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ సేవలను మీరు పొందవచ్చు.
  • అయితే, ప్రస్తుతానికి భారత్ లో ఢిల్లీ, ఎన్ సీఆర్, లక్నో రీజియన్లలో మాత్రమే వాట్సాప్ ఈ సేవలను అందిస్తోంది. త్వరలో దేశవ్యాప్తం చేయనున్నామని వెల్లడించింది.
  • మరోవైపు, మరో కొత్త ఫీచర్ ను వాట్సాప్ తీసుకురానుంది. స్టేటస్ అప్ డేట్స్ లో అభ్యంతరకరమైనవి ఏమైనా ఉంటే, యూజర్లు వాటిని రిపోర్ట్ చేసే విధంగా కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది.

టాపిక్

తదుపరి వ్యాసం