తెలుగు న్యూస్ / ఫోటో /
రెట్లను పెంచిన ఉబర్.. జేబుకు భారీ చిల్లు పడినట్లే!
ఓవైపు నిత్యావసరాలు, మరోవైపు గ్యాస్, చమురు ధరల మోతతో సతమతమవుతున్న సామన్యులపై మరో షాక్ తగలనుంది. ఇంధనల ధరలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో Uber 15% అద్దె రెట్లను పెంచింది.
ఓవైపు నిత్యావసరాలు, మరోవైపు గ్యాస్, చమురు ధరల మోతతో సతమతమవుతున్న సామన్యులపై మరో షాక్ తగలనుంది. ఇంధనల ధరలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో Uber 15% అద్దె రెట్లను పెంచింది.
(1 / 6)
ఉబర్ అద్దె ఛార్జీలను పెంచింది. ఇంధన ధరలు పెరగడంతో రెంటల్ ఛార్జీలను 15 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. మెుదటిగా ముంబైలో ఛార్జీల పెంపును అమలు చేస్తున్నట్లు తెలిపింది
(2 / 6)
ప్రస్తుతానికి ముంబైలో మాత్రమే ఛార్జీలను పెంచిన Uber త్వరలో క్రమంగా దేశంలోని అన్ని నగారాల్లో ఛార్జీలను పెంచనున్నది
(3 / 6)
ఉబెర్ ఇండియా, దక్షిణాసియా సెంట్రల్ ఆపరేషన్స్ హెడ్ నితీష్ భూషణ్ మాట్లాడుతూ.. ముంబైలో 15 శాతం ఛార్జీలను పెంచుతున్నమని.. డ్రైవర్లను దృష్టిలో ఉంచుకుని ఛార్జీలు పెంచం. డ్రైవర్ల అభిప్రాయానికి మేం విలువ ఇస్తాం. ప్రస్తుత ఇంధన ధరల పెరుగుదల వారిని ఆందోళన కలిగిస్తోందని మేము అర్థం చేసుకున్నట్లు" వెల్లడించారు.
ఇతర గ్యాలరీలు