New features in WhatsApp in 2022: వాట్సాప్ లో 2022లో వచ్చిన న్యూ ఫీచర్స్ ఇవే-whatsapp in 2022 top features rolled out by whatsapp this year ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Whatsapp In 2022: Top Features Rolled Out By Whatsapp This Year

New features in WhatsApp in 2022: వాట్సాప్ లో 2022లో వచ్చిన న్యూ ఫీచర్స్ ఇవే

HT Telugu Desk HT Telugu
Dec 27, 2022 05:34 PM IST

WhatsApp new features: సోషల్ మీడియాలో అత్యధికంగా వాడే ప్లాట్ ఫామ్ వాట్సాప్ (WhatsApp). ఈ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తమ ప్లాట్ ఫామ్ కు జత చేస్తూ వస్తుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (REUTERS/Dado Ruvic/Illustration/File Photo)

WhatsApp new features: 2022లో కూడా వాట్సాప్(WhatsApp) లో సరికొత్త ఫీచర్లు చాలా వచ్చాయి. వాటిలో కొన్ని వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటే, మరికొన్ని పెద్దగా ఆదరణ పొందలేదు. 2022 సంవత్సరంలో 20కి పైగా కొత్త ఫీచర్లను, అప్ డేట్స్ ను వాట్సాప్(WhatsApp) తీసుకు వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

WhatsApp new features: ఇవే వాట్సాప్ లో వచ్చిన కొత్త ఫీచర్లు

  • హైడ్ ఆన్ లైన్ స్టేటస్(Hide online status): యూజర్లు తమ స్టేటస్ ను ఎవరూ చూడకుండా, లేదా ఎంపిక చేసుకున్న వారికి మాత్రమే కనిపించలా మార్చుకోవచ్చు. అలాగే, తాము ఆన్ లైన్ లో ఉన్నామన్న విషయాన్ని కూడా దాచేయొచ్చు.
  • లీవ్ గ్రూప్ సైలెంట్లీ(Leave groups silently) ఇష్టం లేని, లేదా పెద్దగా అవసరం లేని, లేదా విపరీతంగా మెసేజ్ లు వచ్చిపడే గ్రూప్ ల నుంచి కామ్ గా బయటపడొచ్చు. గ్రూప్ నుంచి వెళ్లిపోతున్న విషయం గ్రూప్ లోని అందరికి కాకుండా, కేవలం అడ్మిన్ కు మాత్రమే తెలుస్తుంది.
  • యాక్సిడెంటల్ డిలీట్(Accidental delete): పొరపాటున ‘డిలీట్ ఫర్ మీ(delete for me)’ ని నొక్కితే, మళ్లీ ఆ మెసేజ్ ను తిరిగిపొందడం అసంభవంగా ఉండేది. ఆ సమస్యను తీర్చి, ఇప్పుడు పొరపాటున ‘డిలీట్ ఫర్ మీ(delete for me)’ ఆప్షన్ ను యూజ్ చేసినా, ఆ యాక్షన్ ను అన్ డూ() చేసుకోవడానికి ఈ accidental delete feature ద్వారా 5 సెకన్ల సమయం లభిస్తుంది.
  • కమ్యూనిటీస్(Communities): వేరువేరు గ్రూప్ లను ఒకే గూటికి తెచ్చేలా కమ్యూనిటీస్(Communities) ఫీచర్ ను ప్రారంభించింది. స్కూల్స్, లోకల్ క్లబ్స్, వర్క్ ప్లేసెస్ వంటి కామన్ గ్రూప్స్ ను ఈ కమ్యూనిటీస్(Communities) లో యాడ్ చేసుకోవచ్చు.
  • గ్రూప్ కాల్స్(32-person calls): ఇప్పుడు వాట్సాప్ లో ఒకేసారి గరిష్టంగా 32 మందితో గ్రూప్ కాల్ చేసుకోవచ్చు. గతంలో గరిష్టంగా 8 మందితో మాత్రమే గ్రూప్ కాల్ సాధ్యమయ్యేది.
  • Message or mute call participants: కాల్ లో ఉన్న సభ్యులకు ప్రత్యేకంగా, కాల్ లో ఉండగానే మెసేజ్ చేసే, లేదా ఆ సభ్యుడిని మ్యూట్ చేసే సదుపాయం.
  • Call links: లింక్ ను పంపించి, గ్రూప్ కాల్ కు ఇన్వైట్ చేసే అవకాశం.
  • Draft preview: వాయిస్ మెసేజ్ ను పంపించేమందు, ఒకసారి విని సరి చూసుకునే సదుపాయం. అలాగే, వాయిస్ మెసేజ్ ప్లే బ్యాక్ ను 1.5ఎక్స్, 2 ఎక్స్ స్పీడ్ తో వినే అవకాశం.
  • Emoji reactions: కొత్త ఎమోజీలతో పాటు మెసేజ్ కు నేరుగా ఎమోజీతో స్పందించే అవకాశం. స్టేటస్ లకు కూడా ఎమోజీలతో స్పందించే ఫెసిలిటీ.
  • Avatars: అవతార్ లను క్రియేట్ చేసుకుని, ప్రొఫైల్ ఫొటోలుగా వాడుకునే సదుపాయం.
  • Message yourself: మనకు మనమే మెసేజ్ పంపించుకునే అవకాశం.
  • 2 జీబీ వరకు ఫైల్స్, ఫొటోస్, వీడియోస్ షేరింగ్. గతంలో ఇది 100 ఎంబీ వరకు మాత్రమే ఉండేది.
  • Migrate chats from Android to iOS and vice versa: ఐ ఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫొన్ కు, ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐ ఫోన్ కు అకౌంట్ సమాచారాన్ని, చాట్ హిస్టరీని, ప్రొఫైల్ ఫొటోను ట్రాన్స్ ఫర్ చేసుకునే అవకాశం.

WhatsApp channel

టాపిక్