How to book Uber ride via WhatsApp : వాట్సాప్‌లో ఉబెర్ రైడ్ బుక్ చేసుకోండిలా!
How to book Uber ride from WhatsApp : ఉబెర్ యాప్ లేకుండానే ఇప్పుడు మీరు రైడ్‌ను బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్‌లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
How to book Uber ride from WhatsApp : వాట్సాప్‌తో ఈ ఏడాదిలో భాగస్వామ్యం ఏర్పరచుకుంది రైడింగ్ యాప్ ఉబెర్. ఫలితంగా ఇప్పుడు కస్టమర్లు.. ఉబెర్ యాప్ లేకుండానే.. వాట్సాప్ నుంచి రైడ్ బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సదుపాయం ఢిల్లీ-ఎన్సీఆర్, లక్నోతో పాటు ఇతర ప్రాంతాల్లో అందుబాటులో ఉంది.
కేవలం ఒక మొబైల్ నెంబర్‌తోనే రైడ్‌ను బుక్ చేసుకోవచ్చు అని ఉబెర్ చెబుతోంది. రైడ్‌ని బుక్ చేసుకోవడమే కాకుండా.. ట్రిప్ రిసిప్ట్లు కూడా వాట్సాప్‌లోనే పొందవచ్చని అంటోంది. ప్రస్తుతానికి ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఈ సదుపాయం ఉంది. అయితే.. రానున్న రోజుల్లో ఇండియా వ్యాప్తంగా ఈ సేవలను ప్రారంభించాలని ఉబెర్ ప్లాన్ చేస్తోంది.
వాట్సాప్‌లో నుంచి ఉబెర్ రైడ్‌ను ఇలా బుక్ చేసుకోండి..
స్టెప్ 1:- ఉబెర్ అఫీషియల్ నెంబర్ అయిన +91 7292000002 ను మీ ఫోన్ కాంటాక్ట్స్‌లో సేవ్ చేసుకోవాలి.
స్టెప్ 2:- సేవ్ చేసుకున్న తర్వాత.. వాట్సాప్ ఓపెన్ చేసి చాట్‌ను రిఫ్రెష్ చేయాలి. ఆ తర్వాత ఉబెర్ నెంబర్.. మీ వాట్సాప్ కాంటాక్ట్స్ లిస్ట్‌లో కనిపిస్తుంది.
Book Uber ride via WhatsApp : స్టెప్ 3:- 'హాయ్' అని మెసేజ్ చేయండి.
స్టెప్ 4:- ఇప్పుడు.. పిక్అప్ కోసం మీ పూర్తి అడ్రెస్‌ను టైప్ చేసి మెసేజ్ చేయండి. డెస్టినేషన్ పాయింట్‌ను కూడా మెసేజ్ చేయాల్సి ఉంటుంది. పిక్అప్ కోసం లైవ్ లొకేషన్‌ను కూడా షేర్ చేసే వెసులుబాటు ఉంది.
How to book Uber from whatsApp location : స్టెప్ 5:- రైడ్‌కు సంబంధించిన ఛార్జీలు, ట్రిప్ కోసం ఇతర వివరాలు మీకు ఉబెర్ నుంచి మెసేజ్ వస్తుంది.
స్టెప్ 6:- రైడ్‌ను కన్ఫర్మ్ చేయాలి.
వాట్సాప్ నోటిఫికేషన్‌తో..
సమీపంలోని డ్రైవర్.. మీ రిక్వెస్ట్‌ను అంగీకరించిన తర్వాత.. ఉబెర్ నుంచి మీ వాట్సాప్‌కు నోటిఫికేషన్ వస్తుంది. ఈ విధంగా.. మీరు ఉబెర్ యాప్ లేకుండా.. వాట్సాప్‌లో రైడ్ బుక్ చేసుకోవచ్చు.
Uber services : కస్టమర్లకు యూజర్ ఫ్రెండ్లీ యాక్సెస్, ట్రిప్‌ను ఇచ్చేందుకు నిత్యం కృషి చేస్తోంది ఉబెర్. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు తనని తాను అప్డేట్ చేసుకుంటోంది. ఓ సందర్భంలో.. స్వయంగా ఉబెర్ సీఈఓ ప్రభజీత్ సింగ్ ఢిల్లీ వీధుల్లో క్యాబ్ నడుపుతూ.. కస్టమర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ కూడా పొందారు. అప్పట్లో ఈ వార్త వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. మరి భవిష్యత్తులో రైడ్ బుకింగ్ మరింత సులభతరంగా మారే అవకాశాలు లేకపోలేదు.
సంబంధిత కథనం