Uber | బడా కంపెనీ సీఈఓ.. మీ క్యాబ్​ డ్రైవర్​గా మారితే?-uber india ceo as cab driver delights internet ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Uber India Ceo As Cab Driver Delights Internet

Uber | బడా కంపెనీ సీఈఓ.. మీ క్యాబ్​ డ్రైవర్​గా మారితే?

HT Telugu Desk HT Telugu
Mar 12, 2022 03:53 PM IST

క్యాబ్​ బుక్​ చేసిన తర్వాత.. కార్​ నెంబర్​, డ్రైవర్​ పేరు చూడటం సహజం. ఒకవేళ.. మీ డ్రైవర్​ ఓ బడా కంపెనీకి సీఈఓ అని తెలిస్తే? ఢిల్లీవాసులకు ఇటీవల ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇంతకి అసలు కథ ఏంటంటే..

డ్రైవర్​గా ఉబెర్​ ఇండియా సీఈఓ
డ్రైవర్​గా ఉబెర్​ ఇండియా సీఈఓ (LinkedIn/@Ananya Dwivedi)

Uber India CEO | వర్క్​ ఫ్రం ఆఫీస్​ హడావుడి మొదలైపోయింది. రెండేళ్ల తర్వాత మళ్లీ ఉరుకుల పరుగుల జీవితం తిరిగొచ్చింది. ఆఫీసుకు ఆలస్యమవుతోందని కంగారు పడటం మళ్లీ మామూలైపోయింది. క్యాబ్​ దొరుకుతుందా? లేదా? దొరికితే సమయానికి ఆఫీసుకు వెళతామా? అన్న సందేహాలతో గుండెల్లో అలజడి మళ్లీ షురూ అయ్యింది. ఈ పరిస్థితుల్లో.. క్యాబ్​ ఎక్కిన తర్వాత.. డ్రైవర్​ ఓ బడా కంపెనీకి సీఈఓ అని తెలిస్తే? ఢిల్లీ- ఎన్​సీఆర్​ ప్రజలకు ఇటీవల ఈ అనుభవమే ఎదురైంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

ట్రెండింగ్ వార్తలు

డ్రైవర్​గా సీఈఓ..

ఉబెర్​ ఇండియా, దక్షిణాసియా సీఈఓ ప్రభజీత్​ సింగ్.. సంస్థ చేపట్టిన ఓ రీసెర్చ్​ కోసం​ ఇటీవలే కొన్ని గంటల పాటు డ్రైవర్​ అవతారం ఎత్తారు. ఢిల్లీ వీధుల్లో క్యాబ్​ డ్రైవ్​ చేసి ప్రయాణికులను ఎక్కించుకున్నారు. వారితో కొంతసేపు ముచ్చటించి.. వారిని గమ్యస్థానాలకు చేర్చారు.

ఈ విషయాలను.. క్యాబ్​లో ఎక్కిన ప్రయాణికులు సామాజిక మాధ్యమాల్లో వెల్లిడించారు. ఈ వార్త వెంటనే వైరల్​గా మారిపోయింది.

లింక్​డిన్​ యూజర్​.. అనన్యా ద్వివేదీ.. ఈ విషయంపై తన అనుభవాలను పంచుకుంది.

"చాలా రోజుల తర్వాత వర్క్​ ఫ్రం ఆఫీస్​ కోసం బయటకొచ్చి నేను క్యాబ్​ బుక్​ చేశాను. డ్రైవర్​ ఎవరో తెలుసా? ఉబెర్​ ఇండియా బాస్​.. ప్రభజీత్​ సింగ్​! ఓ రీసెర్చ్​ కోసం డ్రైవర్​గా మరారంట. తొలుత నాకు ఏదో డౌట్​ కొట్టింది. ఆయన గురించి గూగుల్​ చేశాను. ఫొటోలు చూసిన తర్వాతే నేను నమ్మాను. ఇది నిజమే. సమస్యలను అర్థం చేసుకునేందుకు.. ఇలా డ్రైవర్​ అవతారం ఎత్తడమనేది చాలా గొప్ప విషయం," అని ఆమె రాసుకొచ్చింది.

Prabhjeet Singh Uber | మరో ప్రయాణికుడు సౌరభ్​ కుమార్​ కూడా తన అనుభవాలను షేర్​ చేసుకున్నాడు.

"ఓ బడా కంపెనీకి సీఈఓ.. మన క్యాబ్​ డ్రైవర్​గా మారితే మనకు ఎంతో విలువనిస్తున్నట్టే కదా! మనం మరింత భద్రంగా ఉన్నట్టే కదా. ప్రయాణికులను మరింతగా అర్థంచేసుకునేందుకు ప్రభజీత్​ సింగ్​ ప్రయత్నిస్తున్నారు. అందుకే వారితో మాట్లాడుతున్నారు. వారిని పిక్​ చేసుకుని, కావాల్సిన చోట దింపుతున్నారు. కుడోస్​," అని అన్నాడు.

మరో ప్రయాణికురాలు మధువంతి సుందర్​రాజన్​ కూడా దీనిపై స్పందించారు.

"'నేను వస్తున్నాను' అని ఉబెర్​ డ్రైవర్​ నుంచి మెసేజ్​ వచ్చింది. నా డ్రాప్​ లోకేషన్​ కూడా అడగలేదు. కాస్త ఆశ్చర్యమేసింది. క్యాబ్​ కోసం ఎదురుచూస్తుండగానే.. వచ్చింది. 'హాయ్​ మధువంతి నేను ఉబెర్​ ఇండియా సీఈఓ! ఈరోజు మీరే నా మొదటి ప్రయాణికురాలు,' అని ఆయన అన్నారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది," అని ఆమె చెప్పుకొచ్చింది.

ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారగా.. నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. ఉబెర్​ ఇండియా సీఈఓపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం