WhatsApp new feature: వాట్సాప్ లో పొరపాటున `డిలీట్ ఫర్ మి` నొక్కారా? డోంట్ వర్రీ-whatsapps accidental delete feature will save you from awful situations ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Whatsapp's 'Accidental Delete' Feature Will Save You From Awful Situations

WhatsApp new feature: వాట్సాప్ లో పొరపాటున `డిలీట్ ఫర్ మి` నొక్కారా? డోంట్ వర్రీ

HT Telugu Desk HT Telugu
Dec 20, 2022 09:37 PM IST

WhatsApp new feature: యూజర్ల అభిమానం చూరగొంటూ, వారి అవసరాలకు అనుగుణంగా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కు చాలా అవసరం. యూజర్లను తమ నెట్ వర్క్ నుంచి బయటకు వెళ్లకుండా చూడడంతో పాటు, వారి నుంచి నెగటివ్ ఫీడ్ బ్యాక్ రాకుండా చూసుకోవడం కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంటారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

WhatsApp new feature: యూజర్ల అవసరాలు ప్రాతిపదికగా వాట్సాప్ వంటి సోషల్ మీడియా, పర్సనల్ కమ్యూనికేషన్ ప్లాట్ ఫామ్స్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తుంటాయి.

ట్రెండింగ్ వార్తలు

Delete for Me option: ‘డిలీట్ ఫర్ మి’

‘డిలీట్ ఫర్ మి(Delete for Me)’, డిలీట్ ఫర్ ఎవ్రీవన్ (Delete for everyone) ఆప్షన్లను ఉపయోగించని వాట్సాప్ యూజర్లు చాలా తక్కువగా ఉంటారు. ఏదో ఒక సందర్భంలో, పొరపాటున, పంపాల్సిన వ్యక్తకి కాకుండా, మరెవరికో మెసేజ్ పంపిన పరిస్థితి,లేదా మసేజ్ ను పూర్తిగా టైప్ చేయకముందే పొరపాటున పంపించిన పరిస్థితి మనకందరికీ వచ్చే ఉంటుంది. అప్పుడు ఆ మెసేజ్ ను డిలీట్ చేయడానికి వాట్సాప్ లో రెండు ఆప్షన్స్ ఉంటాయి. అవి ‘డిలీట్ ఫర్ మి(Delete for Me)’, డిలీట్ ఫర్ ఎవ్రీవన్ (Delete for everyone). ‘డిలీట్ ఫర్ మి(Delete for Me) ఆప్షన్ న క్లిక్ చేస్తే, మీ ఫీడ్ నుంచి మాత్రమే ఆ మెసేజ్ మాయమవుతుంది. మీరు పంపిన వ్యక్తి ఫీడ్ లో అలాగే ఉంటుంది. డిలీట్ ఫర్ ఎవ్రీవన్ (Delete for everyone) ఆప్షన్ ను క్లిక్ చేస్తే, మీతో పాటు మీరు పంపిన వ్యక్తుల ఫీడ్ నుంచి కూడా డిలీట్ అవుతుంది. అయితే, ఈ రెండు ఆప్షన్లు ఒకదాని కింద మరొకటి ఉండడంతో పొరపాటున డిలీట్ ఫర్ ఎవ్రీవన్ (Delete for everyone) ఆప్షన్ బదులుగా ‘డిలీట్ ఫర్ మి(Delete for Me) పై క్లిక్ చేస్తుంటాం. దాంతో, మన ఫీడ్ లో నుంచి ఆ మెసేజ్ మాయమవుతుంది. తిరిగి, దాన్ని రిట్రీవ్ చేసుకోవడానికి గానీ, మళ్లీ డిలీట్ ఫర్ ఎవ్రీవన్ (Delete for everyone) ఆప్షన్ ను వాడడానికి కానీ వీలుండదు. ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి.

Undo Delete for Me option: అన్ డూ ఆప్షన్

యూజర్లు ఈ విషయంలో పడుతున్న ఇబ్బందిని గ్రహించిన వాట్సాప్ ఇందుకు ఒక పరిష్కారాన్ని సరికొత్త ఫీచర్ రూపంలో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇప్పుడు, ఒకవేళ మీరు పొరపాటున డిలీట్ ఫర్ ఎవ్రీవన్ (Delete for everyone) ఆప్షన్ బదులుగా ‘డిలీట్ ఫర్ మి(Delete for Me) ఆప్షన్ ని వాడితే, ఆ పొరపాటును సరిదిద్ధుకోవడానికి మీకు 5 సెకన్ల సమయం లభిస్తుంది. ఆ 5 సెకన్ల లోపు మీరు మీ తప్పును సరిదిద్దుకుని ‘అన్ డూ’ ఆప్షన్ వాడి, తిరిగి, డిలీట్ ఫర్ ఎవ్రీవన్ (Delete for everyone) ఆప్షన్ ను వినియోగించవచ్చు.

available to iPhone and android users: అందరికీ అందుబాటులో..

ఈ ‘అన్ డూ డిలీట్ ఫర్ మీ’ ఆప్షన్ ఐఫోన్, ఆండ్రాయిడ్ వినియోగదారులందరికీ అందుబాటులో ఉందని వాట్సాప్ తెలిపింది. ఈ ఆప్షన్ ను ఉపయోగించుకుని వినియోగదారులు అనవసర ఇబ్బందికర పరిస్థితుల నుంచి తప్పించుకోవచ్చని వెల్లడించింది.

WhatsApp channel

టాపిక్