HONOR V Purse : వావ్.. ఇది పర్సులా ఉండే ఫోల్డెబుల్ స్మార్ట్‌ఫోన్!
04 September 2023, 14:58 IST
- HONOR V Purse : పర్సులా ఉండే ఫోల్డెబుల్ స్మార్ట్‌ఫోన్‌ను రివీల్ చేసింది హానర్ సంస్థ. ఆ వివరాలు..
వావ్.. ఇది పర్సులా ఉండే ఫోల్డెబుల్ స్మార్ట్‌ఫోన్!
HONOR V Purse : ఫోల్డెబుల్ టెక్నాలజీని ఫ్యాషన్‌కు జతచేసిన హానర్ సంస్థ.. అద్భుతాన్ని సృష్టించింది! పర్సును ప్రతిబింబించే విధంగా ఓ ఫోల్డెబుల్ స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేసింది. ఈ మోడల్ పేరు హానర్ వీ పర్స్. ఐఎఫ్ఏ 2023 ఈవెంట్లో దీనిని ప్రదర్శించింది.
కొత్త డిజైన్ అదిరిపోయింది..!
ఈ ఇన్నోవేటివ్ డిజైన్ చాలా ఐ-క్యాచింగ్గా ఉందనే చెప్పుకోవాలి. ఇందులో ఇంటర్ఛేంజెబుల్ స్ట్రాప్స్, చెయిన్స్ వంటివి వస్తున్నాయి. ఫోల్డెబుల్ ఫోన్‌ను వాడటం అయిపోయిన తర్వాత, దీనిని ఓ పర్సులా మార్చుకోవచ్చు. ఈ హానర్ వీ పర్స్‌లో ఔట్వర్డ్ ఫేసింగ్ డిస్ప్లే ఉంటుంది. ఇందులోని వాల్పపర్స్లో వివిధ పర్సు స్టైల్స్ ఉంటాయి.
అయితే.. బయటవైపు డిస్ప్లే ఉండటం కాస్త ఆందోళనకర విషయం అని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణ ఫోల్డెబుల్ ఫోన్స్‌లో డిస్ప్లే లోపలివైపు ఉంటుందని గుర్తుచేస్తున్నారు. ఫలితంగా ఈ హానర్ వీ పర్స్ డ్యూరెబులిటీ దెబ్బతింటుందని అనుమానిస్తున్నాయి. హానర్ మాత్రం వీటిని కొట్టిపారేస్తోంది. ఈ ఫోల్డెబుల్ స్మార్ట్‌ఫోన్.. 4లక్షలకుపైగా ఫోల్డ్స్ను తట్టుకోగలదని అంటోంది. అయినప్పటికీ.. డిస్ప్లే విషయంలో అనేక సమస్యలు ఎదురవ్వొచ్చని, డిజైన్ పరంగా హానర్ సంస్థ చాలా బోల్డ్ నిర్ణయం తీసుకుందన్నది నిపుణుల మాట.
ఇదీ చూడండి:- Honor pad X9 : హానర్ ప్యాడ్ ఎక్స్9 బుకింగ్స్ షురూ.. ఈ ట్యాబ్లెట్‌ను కొనొచ్చా?
HONOR V Purse price in India : ఏది ఏమైనా.. ఫోల్డెబుల్ ఫోన్‌కి ఫ్యాషన్ టచ్ కూడా ఇవ్వొచ్చని, తన ఇన్నోవేటివ్ ఐడియాతో నిరూపించింది హానర్. పర్సు లాంటి ఈ ఫోల్డెబుల్ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించేందుకు అనేకమంది ఫ్యాషన్ డిజైనర్స్‌తో కొలాబొరేట్ అయినట్టు హానర్ సంస్థ చెప్పింది. ఫలితంగా ఈ హానర్ వీ పర్స్‌లో చాలా కొత్త థీమ్స్ ఉన్నట్టు స్పష్టం చేసింది. త్వరలోనే ఏపీఐని లాంచ్ చేస్తామని, తద్వారా.. కస్టమర్లు తమకు నచ్చినట్టుగా డిజైన్ పాటర్న్‌ని మర్చుకోవచ్చని వెల్లడించింది.
అయితే ఈ హానర్ వీ పర్స్ అనేది లిమిటెడ్ ఎడిషన్‌గా ఉండొచ్చు. డైరక్ట్ ప్రాడక్ట్‌గా అందుబాటులో ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మోడల్‌కు సంబంధించిన టీజర్‌ను తాజాగా విడుదల చేసింది సంస్థ. కాగా.. దీని ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, ధర వంటిపై క్లారిటీ లేదు. త్వరలోనే సంస్థ వీటిని ప్రకటిస్తుందని తెలుస్తోంది. ఈ హానర్ వీ పర్స్‌పై సర్వాత్రా ఆసక్తి నెలకొంది.