Honda 5 Million Customers : ఈ రాష్ట్రంలో 50 లక్షల కస్టమర్ల మైలురాయి దాటిన హోండా
29 October 2024, 9:41 IST
- Honda Customers : హోండా కంపెనీ టూ వీలర్స్‌కు మంచి డిమాండ్ ఉంది. మిడిల్ క్లాస్ వాళ్లకు ఇష్టమైన వాటిలో ఇది ఒకటి. అయితే ఈ కంపెనీ తాజాగా రికార్డు సృష్టించింది. ఓన్లీ కర్ణాటకలోనే 50 లక్షల కస్టమర్ల మైలురాయిని దాటింది.
హోండా యాక్టివా
దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో ఒకటైన హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) కర్ణాటకలో ముఖ్యమైన మైలురాయిని సాధించినట్లు ప్రకటించింది. కర్ణాటకలో హోండా 5 మిలియన్ (50 లక్షలు) యూనిట్ల వాహనాలను విక్రయించింది. కర్ణాటకలో ద్విచక్ర వాహన కొనుగోలుదారులు హోండాకు ప్రాధాన్యత ఇస్తారు. కస్టమర్ సంతృప్తికి హోండా ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, దక్షిణ భారతదేశంలో కంపెనీ ప్రజాదరణను పెంచుతుందని హోండా పేర్కొంది.
జూన్ 2001లో ప్రారంభించినప్పటి నుండి హోండా తన ఖాతాదారుల అవసరాలను తీర్చడానికి కృషి చేస్తోంది. అత్యాధునిక సాంకేతికతను అప్‌డేట్ చేస్తూ.. మోటార్ సైకిళ్లు, స్కూటర్‌లను అందిస్తోంది. యాక్టివా, షైన్ రాష్ట్రంలో అత్యధికంగా అమ్ముడవుతున్న హోండా మోడల్స్ అని కంపెనీ తెలిపింది. 5 మిలియన్ల విక్రయాల మైలురాయి కర్ణాటకలోని కస్టమర్ల బలమైన విశ్వాసానికి నిదర్శనమని వెల్లడించింది.
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ యోగేష్ మాథుర్ మాట్లాడుతూ.. 'హోండా బ్రాండ్‌పై విశ్వాసం ఉంచినందుకు, 5 మిలియన్ల మైలురాయిని చేరుకోవడానికి మాకు సహాయం చేసినందుకు కర్ణాటకలోని కస్టమర్‌లకు మేం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా కస్టమర్‌ల నిరంతర మద్దతు, విశ్వాసం వెలకట్టలేనిది. ఇదే మార్గంలో కొనసాగుతాం.' అని ఆయన చెప్పారు.
హోండా కంపెనీ ఉత్పత్తి శ్రేణిలో నాలుగు స్కూటర్ మోడల్స్ ఉన్నాయి. 110సీసీ స్కూటర్‌లలో తొమ్మిది అద్భుతమైన మోడల్‌లు, 125cc స్కూటర్లలో డియో, యాక్టివా 125, డియో 125 ఉన్నాయి. మోటార్ సైకిళ్లలో 100, 110సీసీ సెగ్మెంట్‌లో షైన్ 100, Dre CD డీలక్స్ 110ఎక్స్ ఉన్నాయి.
125సీసీ విభాగంలో షైన్ 125, ఎస్పీ125 ఉండగా.. 160సీసీ విభాగంలో యునికార్న్, ఎస్పీ160 ఉన్నాయి. 180-200సీసీ విభాగంలో హార్నెట్ 2.0, సీబీ200ఎక్స్ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ ప్రస్తుతం భారతదేశంలో హోండాకు అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్స్‌గా చెప్పవచ్చు. ఇవే కాకుండా మరికొన్ని మోడల్స్ కూడా హోండాలో దొరుకుతాయి.