Honda Elevate Apex Edition : హోండా ఎలివేట్ అపెక్స్ ఎడిషన్ లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. ధర ఎంత?-honda elevate apex edition launched in india at 12 86 lakh rupees know new features ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Honda Elevate Apex Edition : హోండా ఎలివేట్ అపెక్స్ ఎడిషన్ లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. ధర ఎంత?

Honda Elevate Apex Edition : హోండా ఎలివేట్ అపెక్స్ ఎడిషన్ లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. ధర ఎంత?

Anand Sai HT Telugu
Sep 16, 2024 03:00 PM IST

Honda Elevate Apex Edition : హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌సీఐఎల్) తన పాపులర్ మిడ్-సైజ్ ఎలివేట్ ఎస్‌యూవీ కొత్త అపెక్స్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం జరుగుతున్న గ్రేట్ హోండా ఫెస్ట్ ఫెస్టివల్ క్యాంపెయిన్ సందర్భంగా ఈ ఎడిషన్‌ను ప్రవేశపెట్టారు.

హోండా ఎలివేట్ అపెక్స్ ఎడిషన్ లాంచ్
హోండా ఎలివేట్ అపెక్స్ ఎడిషన్ లాంచ్

హోండా కార్ ఇండియా లిమిటెడ్ ఎలివేట్ మోడల్‌లో కొత్తగా అపెక్స్ ఎడిషన్‌ను విడుదల చేసింది. అపెక్స్ ఎడిషన్‌గా పిలిచే ఈ కారులో ఎక్‌టీరియర్, ఇంటీరియర్ పరంగా రెగ్యులర్ ఎస్‌యూవీతో పోలీస్తే.. కొన్ని ఫీచర్లు అదనంగా ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న గ్రేట్ హోండా ఫెస్ట్ ఫెస్టివల్ క్యాంపెయిన్ సందర్భంగా ఈ ఎడిషన్‌ను ప్రవేశపెట్టారు. అపెక్స్ ఎడిషన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్(ఎంటీ), కంటిన్యూయస్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ (సీవీటీ) రెండింటిలోనూ పరిమిత వాల్యూమ్‌లో లభిస్తుంది. ఇది హోండా ఎలివేట్ వి, విఎక్స్ గ్రేడ్ల ఆధారంగా రూపొందించారు. దీని ధర సాధారణ వేరియంట్ కంటే రూ.15 వేలు ఎక్కువ.

డిజైన్, ఎక్కువ స్థలం, సౌకర్యవంతమైన ఇంటీరియర్స్, హోండా ఎలివేట్ అధునాతన ఫీచర్ల ఆధారంగా అపెక్స్ ఎడిషన్ ఎక్ట్సీరియర్, ఇంటీరియర్‌తో వస్తుంది. ఇది అన్ని కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ .12.86 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఇది మారుతి గ్రాండ్ విటారా, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి వాటికి పోటీగా ఉంటుంది.

హోండా ఎలివేట్ అపెక్స్ ఎడిషన్ హైలైట్స్

ఎక్స్టీరియర్ ప్రత్యేకతలు : సిల్వర్ యాక్సెంట్స్‌తో కూడిన స్పాయిలర్ కింద పియానో బ్లాక్ ఫ్రంట్, స్పాయిలర్ కింద పియానో బ్లాక్ సైడ్, క్రోమ్ ఇన్సర్ట్స్‌తో పియానో బ్లాక్ రియర్ లోయర్ గార్నిష్, ఫెండర్స్‌పై అపెక్స్ ఎడిషన్ బ్యాడ్జ్, టెయిల్ గేట్‌పై అపెక్స్ ఎడిషన్ చిహ్నం ఉన్నాయి.

ఇంటీరియర్ ప్రత్యేకత ఏమిటంటే : దీని ఇంటీరియర్ గురించి చూస్తే.. ఇందులో విలాసవంతమైన డ్యూయల్-టోన్ ఐవరీ, బ్లాక్ ఇంటీరియర్, ప్రీమియం లెథరెట్ డోర్ లైనింగ్స్, ప్రీమియం లెథరెట్ ఐపీ ప్యానెల్, రిథమిక్ యాంబియంట్ లైట్స్ 7 రంగులు, అపెక్స్ ఎడిషన్ సిగ్నేచర్ సీట్ కవర్లు, కుషన్లు ఉన్నాయి.

అపెక్స్ ఎడిషన్ విడుదల సందర్భంగా హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ కునాల్ బహల్ మాట్లాడారు. 'ఎలివేట్ మా విజయంలో కీలక పాత్ర పోషించింది. మా దేశీయ అమ్మకాలు, ఎగుమతులకు ఉపయోగపడింది. భారతదేశంలో పండుగ సీజన్ ప్రారంభమైంది. హోండా ఎలివేట్ కొత్త అపెక్స్ ఎడిషన్‌ను లాంచ్ చేయడం మాకు సంతోషంగా ఉంది. ఇది మెరుగైన క్యాబిన్ అనుభవం కోసం విలాసవంతమైన ఇంటీరియర్‌ను కలిగి ఉంది. డైనమిక్, స్టైలిష్ అప్పీల్‌ను పెంచే కొత్త బోల్డ్ ఎక్స్టీరియర్ ఎలిమెంట్స్‌ను కలిగి ఉంది. ఈ కొత్త కారుతో హోండా ఫ్యామిలీలోకి మరింత మంది కస్టమర్లను ఆహ్వానించడానికి మేం సిద్ధంగా ఉన్నాం.' అని కునాల్ చెప్పారు.

టాపిక్