Elevate vs Grand Vitara : హోండా ఎలివేట్ కొనాలా? మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా తీసుకోవాలా?
29 October 2023, 11:48 IST
- Honda Elevate vs Maruti Suzuki Grand Vitara : హోండా ఎలివేట్ వర్సెస్ మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా.. ఈ రెండు ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్?
హోండా ఎలివేట్ కొనాలా? మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా తీసుకోవాలా?
Honda Elevate vs Maruti Suzuki Grand Vitara : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లోని ఎస్యూవీ సెగ్మెంట్లో ఇప్పుడు చాలా ఆప్షన్స్ లభిస్తున్నాయి. ఇక లేటెస్ట్ ఎంట్రీ హోండా ఎలివేట్‌కి కూడా మంచి డిమాండ్ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఎస్‌యూవీని.. మారుతీ సుజుకీ గ్రాండ్ విటారాతో పోల్చి.. ఈ రెండింట్లో ఏది బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
ఈ రెండు ఎస్‌యూవీల లుక్స్ ఇవే..
హోండా ఎలివేట్‌లో కర్వ్డ్ ఎడ్జ్‌లతో కూడిన ఫ్లాట్ బానెట్, బ్లాక్డ్ ఔట్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌లైట్స్, డీఆర్ఎల్స్, డోర్ మౌంటెడ్ ఓఆర్వీఎంలు, 16 ఇంచ్ డైమెండ్ కట్ డిజైనర్ అలాయ్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటీనా, వ్రాప్ అరౌండ్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్ వంటివి వస్తున్నాయి.
Honda Elevate on road price Hyderabad : మారుతీ సుజుకీ గ్రాండ్ విటారాలో స్కల్ప్టెడ్ బానెట్, క్రోమ్ స్టడెడ్ గ్రిల్, బంపర్ మౌంటెడ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, స్ప్లిట్ టైప్ డీఆర్ఎల్స్, స్కిడ్ ప్లేట్స్, వీల్ ఆర్చీస్, 17 ఇంచ్ అలాయ్ వీల్స్, కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ ఉన్నాయి.
ఈ రెండు ఎస్‌యూవీల ఫీచర్స్ ఇవే..
హోండా ఎలివేట్ స్పేషియస్ 5 సీటర్ కేబిన్‌లో సింగిల్ పేన్ సన్‌రూఫ్, క్రూజ్ కంట్రోల్, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, హోండా సెన్సింగ్ ఏడీఏఎస్ ఫీచర్స్ వంటివి ఉన్నాయి.
గ్రాండ్ విటారాలో 5 సీటర్ స్పేషియస్ కేబిన్‌లో హెడ్ అప్ డిస్ప్లే, పానారోమిక్ సన్‌రూఫ్, యాంబియెంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రెంట్ సీట్స్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 9 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ వంటివి వస్తాయి.
ఈ రెండు వాహనాల్లోని ఇంజిన్ ఆప్షన్స్..
Honda elevate price Hyderabad : హోండా ఎలివేట్‌లో 1.5 లీటర్, డీఓహెచ్సీ, ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది.ఇది 119 హెచ్‌పీ పవర్‌ను, 145ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మేన్యువల్, సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్స్ వస్తున్నాయి.
మారుతీ సుజుకీ గ్రాండ్ విటారాలో 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రీడ్ పెట్రోల్ ఇంజిన్ (115 హెచ్‌పీ- 141 ఎన్ఎం), 1.5 లీటర్ కే సిరీస్ మైల్డ్ హైబ్రీడ్ ఇంజిన్ (103 హెచ్- 135ఎన్ఎం) ఉంటాయి. 5 స్పీడ్ మేన్యువల్, 6 స్పీడ్ ఆటోమెటిక్, సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్స్ లభిస్తున్నాయి.
ఈ రెండు ఎస్‌యూవీల ధరలు ఇవే..
Maruti Suzuki Grand Vitara price Hyderabad : ఇండియాలో హోండా ఎలివేట్ ఎక్స్‌షోరూం ధర రూ. 11లక్షలు- రూ. 16లక్షల మధ్యలో ఉంటుంది. ఇక గ్రాండ్ విటారా ఎక్స్‌షోరూం ధర రూ. 10.7లక్షలు- రూ. 19.95లక్షల మధ్యలో ఉంటుంది.