Family electric scooter : హోండా యాక్టివ్ ఎలక్ట్రిక్ సేల్స్ ఎప్పుడు మొదలవుతాయి? కీలక అప్డేట్ ఇదిగో..
30 November 2024, 6:41 IST
- Honda Activa electric : ఇటీవలే లాంచ్ అయిన హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు నచ్చిందా? ఈ ఈ-స్కూటర్ని కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వివరాలు మీరు కచ్చితంగా తెలుసుకోవాలి..
హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్
మచ్ అవైటెడ్ హోండా యాక్టివా ఎలక్ట్రిక్‌ని ఇటీవలే లాంచ్ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ). తద్వారా హై-డిమాండ్, అధిక పోటీ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లోకి అడుగుపెట్టింది. కాగా, 'యాక్టివా ఈ'తో పాటు క్యూసీ 1 అనే స్కూటర్ని సంస్థ ఇటీవలే లాంచ్ చేసింది. ఈ రెండు ఈ-స్కూటర్లు బెంగళూరు సమీపంలోని ఫ్యాక్టరీలో తయారవుతాయి. మరీ ముఖ్యంగా హోండా యాక్టివా ఎలక్ట్రిక్ ఒక ఫ్యామిలీ స్కూటర్‌గా మంచి ఆదరణ పొందుతుందని సంస్థ ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో యాక్టివా ఈవీకి సంబంధించిన ఒక కీలక అప్డేట్ని ఇక్కడ తెలుసుకోండి..
హోండా యాక్టివా ఎలక్ట్రిక్ సేల్స్ ఎప్పుడు స్టార్ట్?
హోండా యాక్టివా ఎలక్ట్రిక్, క్యూసీ 1 స్కూటర్ల సేల్స్‌పై సంస్థ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ రెండూ కూడా.. 2025 స్ప్రింగ్, అంటే వచ్చే ఏడాది మార్చ్-మే మధ్యలో సేల్‌లోకి వెళతాయి. వీటికి సంబంధించిన బుకింగ్స్ 2025 జనవరిలో స్టార్ట్ అవుతాయి. ఆ సమయంలోనే ధరల వివరాలు కూడా అందుబాటులోకి వస్తాయి.
పర్ల్ సెరెనిటీ బ్లూ, మ్యాట్ ఫాగీ సిల్వర్ మెటాలిక్, పర్ల్ మిస్టీ వైట్, పర్ల్ షాడో బ్లూ, పర్ల్ ఇగ్నియస్ బ్లాక్ అనే ఐదు విభిన్న కలర్ ఆప్షన్లలో హోండా యాక్టివా ఈ అందుబాటులోకి వస్తుంది.
యాక్టివా ఈ- క్యూసీ 1 కంటే భిన్నంగా ఉంటుంది! రెండు వైపులా ఎల్ఈడీ కాంబినేషన్ లైట్లు, ఇండికేటర్లు, హై-మౌంటెడ్ రాప్అరౌండ్ డీఆర్ఎల్ యూనిట్ వంటివి ఉంటాయి. యాక్టివా ఎలక్ట్రిక్‌లో రెండు స్వాపెబుల్ బ్యాటరీలు ఉంటాయి. ఇది అధిక స్థాయి ఛార్జింగ్ సౌలభ్యాన్ని అందిస్తుంది. స్వాప్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు హెచ్ఎంఎస్ఐ పేర్కొంది.
హోండా యాక్టివా ఈ: ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..
హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్లో డే అండ్ నైట్ మోడ్లతో కూడిన 7 ఇంచ్ టీఎఫ్టీ డిస్ప్లేను అమర్చారు. ఇది స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ కోసం హోండా రోడ్‌సింక్ డుయోను కలిగి ఉంది. ఈ-స్కూటర్లో 6 కిలోవాట్ల మోటారు, రెండు స్వాపబుల్ 1.5 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీలు ఉన్నాయి. యాక్టివా ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్ రేంజ్ 102 కిలోమీటర్లు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 80 కిలోమీటర్ల వేగంతో 7.3 సెకన్లలో 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఎకాన్, స్టాండర్డ్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లను స్టాండర్డ్‌గా అందిస్తోంది సంస్థ.
హోండా యాక్టివా ఈ స్కూటర్: ప్రత్యర్థులు..
కొత్త హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్.. టీవీఎస్ ఐక్యూబ్, వీసా వి1, బజాజ్ చేతక్, అథర్ రిజ్టా, ఓలా ఎస్ 1 ప్రో, సింపుల్ వన్, యాంపియర్ నెక్సస్ వంటి మోడల్స్‌తో పోటీపడనుది.
మీరు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని భారతదేశంలోని హోండా డీలర్‌షిప్‌లలో కొనుగోలు చేయవచ్చు. అమ్మకాలు 2025 స్ప్రింగ్‌లో ప్రారంభమవుతాయి.