తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Honda Activa Ev : రేపే హోండా యాక్టివా ఈవీ లాంచ్​- సూపర్​ రేంజ్​తో ఛార్జింగ్​ కష్టాలు దూరం..

Honda Activa EV : రేపే హోండా యాక్టివా ఈవీ లాంచ్​- సూపర్​ రేంజ్​తో ఛార్జింగ్​ కష్టాలు దూరం..

Sharath Chitturi HT Telugu

26 November 2024, 6:15 IST

google News
    • Honda Activa electric launch date : హోండా యాక్టివా ఎలక్ట్రిక్ భారతదేశంలో రేపు లాంచ్​ కాబోతోంది. ఈ నేపథ్యంలో సరికొత్త టీజర్​ని సంస్థ విడుదల చేసింది. టీజర్​లో విశేషాలతో పాటు రేంజ్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ చూసేయండి..
హోండా యాక్టివా ఎలక్ట్రిక్​ స్కూటర్​..
హోండా యాక్టివా ఎలక్ట్రిక్​ స్కూటర్​..

హోండా యాక్టివా ఎలక్ట్రిక్​ స్కూటర్​..

2 వీలర్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ప్రియులకు కీలక అప్డేట్​! మచ్​ అవైటెడ్​ హోండా యాక్టివా ఈవీ.. నవంబర్​ 27, బుధవారం భారత మార్కెట్​లో లాంచ్​కానుంది. జపనీస్​ ద్విచక్ర వాహన దిగ్గజం నుంచి వస్తున్న ఈ తొలి ఎలక్ట్రిక్​ స్కూటర్​పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇప్పుడు, లాంచ్​కి ముందు, మరో టీజర్​ని సంస్థ విడుదల చేసింది. ఇందులో ఒక కీలక అప్డేట్​ని పంచుకుంది. హోండా యాక్టివా ఎలక్ట్రిక్​ పేరుతో వస్తున్న ఈ ఈవీ ఛార్జింగ్ పోర్ట్​ని టీజర్​లో కంపెనీ ప్రదర్శించింది.

హోండా యాక్టివా ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనానికి ప్రధాన పోటీదారులలో ఒకటైన టీవీఎస్ ఐక్యూబ్ మాదిరిగానే హోండా యాక్టివా ఈ కూడా కొంత ఛార్జింగ్ పోర్ట్​ను పొందుతుందని టీజర్ ద్వారా స్పష్టమైంది. అయితే హోండా ఛార్జింగ్ పోర్ట్ దాని ప్రత్యేకమైన ఫీచర్లను కలిగి ఉంటుందని అంచనాలు ఉన్నాయి.

ఇంతకు ముందు విడుదల చేసిన ఒక టీజర్​లో హోండా యాక్టివా ఎలక్ట్రిక్​ స్కూటర్​ రెండు స్వాపెబుల్ బ్యాటరీ ప్యాక్​లతో కూడిన స్వాపెబుల్ బ్యాటరీ టెక్నాలజీని పొందుతుందని స్పష్టమైంది. ఆధునిక మొబైల్ పవర్ ప్యాక్ ఇంటర్ఛేంజబుల్ బ్యాటరీ సెటప్​ సైతం ఇందులో ఉండొచ్చు.

హోండా యాక్టివా ఎలక్ట్రిక్: స్పెసిఫికేషన్స్, రేంజ్​..

హోండా యాక్టివా ఎలక్ట్రిక్​ స్కూటర్ రేంజ్​​ 104 కిలోమీటర్లు అని సంస్థ ఇప్పటికే వెల్లడించింది.100 శాతం బ్యాటరీ ఛార్జ్​తో హోండా యాక్టివా ఈ స్టాండర్డ్ మోడ్​లో 104 కిలోమీటర్ల పరిధిని పొందుతుందని మునుపటి టీజర్ చూపించింది. అదనంగా, ఎలక్ట్రిక్ స్కూటర్ మెరుగైన థ్రాటిల్ రెస్పాన్స్ కోసం స్పోర్ట్ మోడ్​ని కూడా పొందుతుంది. అయితే స్పోర్ట్ మోడ్​తో రేంజ్​ తగ్గొచ్చు.

బజాజ్ చేతక్, విడా వీ1 మాదిరిగానే హోండా యాక్టివా ఎలక్ట్రిక్​ స్కూటర్​ కూడా స్వింగ్ ఆర్మ్ మౌంటెడ్ మోటార్లను కలిగి ఉంటుంది. ఈ యాక్టివా ఎలక్ట్రిక్ కుటుంబ కొనుగోలుదారును లక్ష్యంగా చేసుకుంటుందని భావిస్తున్నారు.

హోండా యాక్టివా ఎలక్ట్రిక్: ఫీచర్లు..

హోండా యాక్టివా ఎలక్ట్రిక్​ స్కూటర్​ రెండు ట్రిమ్ లెవల్స్​లో లభిస్తుందని ఇంతకు ముందు మరో టీజర్​లో వెల్లడైంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు విభిన్న రకాల డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్స్​ని పొందుతుంది. ఇది రెండు ట్రిమ్ స్థాయిలను సూచిస్తుంది. హోండా యాక్టివా ఈవీ తక్కువ వేరియంట్లు టీఎఫ్​టీ డిస్​ప్లేని పొందుతాయి, హై ట్రిమ్ లెవల్ మల్టీ కలర్ స్క్రీన్​ని కలిగి ఉంటుంది.

పెద్ద స్క్రీన్​లో బ్యాటరీ ఛార్జర్, రేంజ్ లెఫ్ట్, స్పీడ్, మోడ్ వంటి కీలక సమాచారం కనిపిస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ టర్న్ బై టర్న్ నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్ ఫంక్షనాలిటీని పొందుతుందని పెద్ద స్క్రీన్ సూచించింది. మునుపటి టీజర్లలో ఎల్​ఈడీ హెడ్ ల్యాంప్, కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్​లోని సీటును ఇప్పటికే సంస్థ రివీల్​ చేసింది.

ఇక హోండా యాక్టివా ఈవీ ధరకు సంబంధించిన వివరాలు లాంచ్​ తర్వాత తెలుస్తాయి. వాటిని మేము మీకు అప్డేట్​ చేస్తాము.

తదుపరి వ్యాసం