తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ola Electric Scooters: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై హోలీ ఆఫర్లు.. మరో రెండు రోజులే.. హోలీ స్పెషల్ ఎడిషన్ కూడా..

Ola Electric Scooters: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై హోలీ ఆఫర్లు.. మరో రెండు రోజులే.. హోలీ స్పెషల్ ఎడిషన్ కూడా..

10 March 2023, 9:49 IST

    • Ola Electric Scooters - Holi Offers: హోలీ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆఫర్లతో లభిస్తున్నాయి. ఈనెల 12వ తేదీ వరకు ఈ ఆఫర్లు ఉండనున్నాయి. అలాగే హోలీ స్పెషల్ ఎడిషన్ స్కూటర్‌ను కూడా ఓలా రూపొందిస్తోంది.
ఓలా స్పెషల్ హోలీ ఎడిషన్ స్కూటర్
ఓలా స్పెషల్ హోలీ ఎడిషన్ స్కూటర్

ఓలా స్పెషల్ హోలీ ఎడిషన్ స్కూటర్

Ola Electric Scooters - Holi Offers: హోలీ సందర్భంగా ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ఆఫర్లను, ప్రత్యేక ఎడిషన్ స్కూటర్‌ను తీసుకొచ్చింది. విభిన్న రంగుల కలయిక థీమ్‍తో హోలీ స్పెషల్ ఎడిషన్ స్కూటర్‌ను ఓలా రూపొందిస్తోంది. అయితే ఈ హోలీ ఎడిషన్ స్కూటర్ సాధారణంగా బుక్ చేసుకోవడం కుదరదు. ఇందుకోసం కాంటెస్ట్ మొదలుపెట్టారు ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీశ్ అగర్వాల్. అలాగే హోలీ సందర్భంగా ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లపై ప్రత్యేక ఆఫర్లు లభిస్తున్నాయి. స్పెషల్ ఎడిషన్ కాంటెస్ట్ ఏంటి.. హోలీ సందర్భంగా ఈనెల 12వ తేదీ వరకు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఉండనున్న ఆఫర్లు ఏవో ఇక్కడ చూడండి.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై హోలీ స్పెషల్ ఆఫర్లు

Ola Electric Scooters - Holi Offers: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై హోలీ ఆఫర్లు ఈనెల 12వ తేదీ వరకు ఉండనున్నాయి. హోలీ ఆఫర్లలో భాగంగా ఓలా ఎస్1 ప్రో స్కూటర్‌పై రూ.4,000 వరకు తగ్గింపు ఉండనుంది. ఎస్‍1 ప్రో ధర రూ.1.27 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఓలా ఎస్1 స్కూటర్ వేరియంట్లపై రూ.2,000 డిస్కౌంట్ ఉంటుంది.

పెట్రోల్ ఇంజిన్ ఉండే టూ వీలర్‌ను ఎక్స్చేంజ్ చేసి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకునే కస్టమర్లకు రూ.45,000 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. టూ వీలర్ మోడల్, కండీషన్‍ను బట్టి ఎక్స్చేంజ్ విలువ ఉంటుంది.

Ola Electric Scooters - Holi Offers: హోలీ ఆఫర్ల కింద ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లలో రూ.6,999 వరకు విలువైన బెనిఫిట్లను కస్టమర్లు పొందవచ్చు. ఓలా కేర్+ ఆఫ్టర్ సేల్స్ సబ్‍స్క్రిప్షన్, వారెంటీ పొడగింపు ప్లాన్‍లపై ఈ వారాంతం (మార్చి 11, 12) ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లలో 50 శాతం వరకు ఆఫర్లు పొందవచ్చు. ఓలా కేర్ ప్లాన్‍లో సర్వీస్‍పై ఫ్రీ లేబర్, థెఫ్ట్ అసిస్టెంట్స్ హెల్ప్ లైన్, రోడ్‍సైడ్ పంక్చర్ అసిస్టెంట్ లాంటి మరిన్ని సదుపాయాలు ఉంటాయి.

హెలీ స్పెషల్ ఎడిషన్ కాంటెస్ట్ ఇదే..

Ole Special Holi Edition: ఎప్పటికే ఉన్న ఎస్‍1 ఎలక్ట్రిక్ స్కూటర్‌తో హోలీ సెలెబ్రేట్ చేసుకున్న ఫొటో/వీడియోతో కామెంట్ చేసి హోలీ స్పెషల్ ఎడిషన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పొందండి అంటూ భవీశ్ అగర్వాల్ ట్వీట్ చేశారు. టాప్ బెస్ట్-5 ఈ హోలీ స్కూటర్లు పొందుతారని ఆయన తెలిపారు. “ఎక్కువ మంది నుంచి డిమాండ్ వస్తున్న కారణంగా.. స్పెషల్ హోలీ ఎడిషన్‍‍‍గా మేం 5 యూనిట్లను రూపొందిస్తాం. మీరు ఎస్1తో హోలీని ఎలా సెలెబ్రేట్ చేసుకున్నారో ఫొటో/వీడియోతో కామెంట్ చేయండి. బెస్ట్-5 ఒక్కొక్కటి పొందుతారు” అని భవీశ్ ట్వీట్ చేశారు. ఆయన చేసిన ఈ ట్వీట్‍కు చాలా మంది ఎస్1తో తాము హోలీ సెలెబ్రేట్ చేసుకున్న ఫొటోలు, వీడియోలతో కామెంట్ చేస్తున్నారు. అందులో 5 మందిని సెలెక్ట్ చేసి.. హోలీ స్పెషల్ ఎడిషన్ స్కూటర్‌ను ఓలా ఇవ్వనుంది.