రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇటీవల ఇండియాలో లాంచ్ అయింది. దీని ధర ఓలా ఎస్1 ప్రో ధరకు దగ్గర్లో ఉంది.
By Chatakonda Krishna Prakash Mar 07, 2023
Hindustan Times Telugu
రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్, ఓలా ఎస్ 1 ప్రో.. రెండు స్కూటర్లలో 4 కిలో వాట్ హవర్ (4 kWh) బ్యాటరీ ఉంటుంది.
ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే రివర్ ఇండీ స్కూటర్‌పై 120 కిలోమీటర్లు ప్రయాణించేలా రేంజ్ ఉంటుంది. ఓలా ఎస్1 ప్రో 181 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.
రివర్ ఇండీ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు (90 kmph)గా ఉంది. ఓలా ఎస్1 ప్రో టాప్ స్పీడ్ 116 kmph.
డిజైన్ పరంగా రివర్ ఇండీ చాలా డిఫరెంట్‍గా ఉంది. ఫ్రంట్ లుక్ చాలా విభిన్నంగా ఉంది. ఓలా ఎస్1 ప్రో క్లాసీ లుక్‍తో వస్తోంది.
ఓలా ఎస్1 ప్రో అండర్ సీట్ బూట్ స్టోరేజ్ సామర్థ్యం 36 లీటర్లుగా ఉంది. రివర్ ఇండీలో ఈ స్టోరేజ్ స్పేస్ 43 లీటర్లుగా ఉంటుంది.
రెండు స్కూటర్లు ఎల్ఈడీ డిస్‍ప్లేలు, ఎల్ఈడీ లైట్లను కలిగి ఉన్నాయి. డిస్క్ బ్రేక్స్ ఉంటాయి.
రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.25లక్షలుగా ఉంది. ఓలా ఎస్1 ప్రో ధర రూ.1.32లక్షలు. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. ఈ రెండు స్కూటర్లు బుకింగ్‍లకు అందుబాటులో ఉన్నాయి.
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి