తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hero Xoom Vs Honda Activa: ఈ రెండు స్కూటర్లు ఎలా ఉన్నాయి? దేంట్లో ఏది బెస్ట్!

Hero Xoom vs Honda Activa: ఈ రెండు స్కూటర్లు ఎలా ఉన్నాయి? దేంట్లో ఏది బెస్ట్!

05 February 2023, 12:17 IST

google News
    • Hero Xoom vs Honda Activa: హీరో జూమ్, హోండా యాక్టివా 110 సీసీ స్కూటర్లు ఏ అంశంలో ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.
Hero Xoom vs Honda Activa: ఈ రెండు స్కూటర్లు ఎలా ఉన్నాయి? దేంట్లో ఏది బెస్ట్!
Hero Xoom vs Honda Activa: ఈ రెండు స్కూటర్లు ఎలా ఉన్నాయి? దేంట్లో ఏది బెస్ట్!

Hero Xoom vs Honda Activa: ఈ రెండు స్కూటర్లు ఎలా ఉన్నాయి? దేంట్లో ఏది బెస్ట్!

Hero Xoom vs Honda Activa: స్కూటర్ల విభాగంలో హోండా యాక్టివా చాలాకాలంగా ఆధిపత్యం చెలాయిస్తోంది. భారత మార్కెట్‍లో అమ్మకాల్లో దూకుడు కొనసాగిస్తోంది. అయితే ఇటీవల హీరో మోటోకార్ప్.. జూమ్ 110 స్కూటర్‌ను లాంచ్ చేసింది. ముఖ్యంగా హోండా యాక్టివాకు పోటీగా హీరో జూమ్ అడుగుపెట్టింది. ఈ రెండు 110 సీసీ స్కూటర్లను పోల్చి చూస్తే ఏది ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

Hero Xoom vs Honda Activa: లుక్ పరంగా..

హెండా యాక్టివా 110 సీసీ డిజైన్‍పరంగా కాస్త అప్‍డేట్ అవుతున్నా.. మరీ అంత మార్పులైతే లేవు. యాక్టివాను కొనే ఎక్కువ మంది డిజైన్‍ను ఎక్కువగా పరిగణనలోకి తీసుకోరు. మరోవైపు హీరో జూమ్‍కు డిజైనే ప్రధానమైన హైలైట్‍గా ఉంది. దీని బాడీ చాలా స్పోర్టీగా ఉంటుంది. ఎక్స్- షేప్డ్ హెడ్‍ ల్యాంప్, టైల్‍ల్యాంప్‍తో స్పోర్టీగా ఈ జూమ్ స్కూటర్ కనిపిస్తుంది.

Hero Xoom vs Honda Activa: స్పెసిఫికేషన్లు

110.9 సీసీ ఇంజిన్‍ను హీరో జూమ్ కలిగి ఉంది. 7,250 rmp వద్ద 8.03 bhp పవర్, 5,750 rpm వద్ద 8.7 Nm పీక్ టార్క్యూను ప్రొడ్యూజ్ చేస్తుంది. హోండా యాక్టివా 110cc మోడల్ 8,000 rpm వద్ద 7.69 bhp పవర్, 5,000 rpm వద్ద 8.9 Nm టార్క్యూను ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజిన్లు సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‍ను కలిగి ఉన్నాయి.

Hero Xoom vs Honda Activa: హార్డ్‌వేర్

రెండు స్కూటర్లకు ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక మోనోషాక్ ఉన్నాయి. ఫ్రంట్ వీల్‍కు 190mm డిస్క్ లేదా 130 mm డ్రమ్ బ్రేక్ వేరియంట్లలో హీరో జూమ్ స్కూటర్ వస్తోంది. వెనుక 130 mm డ్రమ్ బ్రేక్ ఉంటుంది. హోండా యాక్టివా వెనుక, ముందు డ్రమ్ బ్రేక్‍లనే కలిగి ఉంది. ఫ్రంట్ హోండా యాక్టివా 110సీసీ లైనప్‍లో డిస్క్ బ్రేక్ ఆప్షన్ లేదు.125 ccలో అయితే ఉంది.

Hero Xoom vs Honda Activa: ఫీచర్లు

కార్నరింగ్ లైట్స్ హీరో జూమ్ స్కూటర్‌కు హైలైట్‍గా ఉన్నాయి. 110cc స్కూటర్ సెగ్మెంట్‍లో ఇలాంటి లైట్లను కలిగి ఉన్న తొలి స్కూటర్ ఇదే. డిజిటల్ ఇన్‍స్ట్రుమెంటల్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, యూఎస్‍బీ చార్జర్ ఉంటాయి. మరోవైపు హోండా యాక్టివా.. ఎక్స్‌టర్నర్ ఫ్యుయల్ ఫిల్లర్ క్యాప్‍ను కలిగి ఉంటుంది. హెచ్-స్మార్ట్ వేరియంట్‍లో కీలెస్ ఎంట్రీ ఫీచర్ కూడా ఉంటుంది.

Hero Xoom vs Honda Activa: ధర

హీరో జూమ్ ధర రూ.68,599 నుంచి రూ.76,699 మధ్య ఉంది. మూడు వేరియంట్లు లభిస్తున్నాయి. హోండా యాక్టివా ధర రూ.74,536 నుంచి రూ.80,537 మధ్య ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.

టాపిక్

తదుపరి వ్యాసం