Hero Xoom Scooter: అదిరిపోయే డిజైన్‍తో హీరో జూమ్ స్కూటర్ వచ్చేసింది.. ధర, పూర్తి వివరాలు ఇవే..-hero xoom scooter launched in india check price features ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hero Xoom Scooter: అదిరిపోయే డిజైన్‍తో హీరో జూమ్ స్కూటర్ వచ్చేసింది.. ధర, పూర్తి వివరాలు ఇవే..

Hero Xoom Scooter: అదిరిపోయే డిజైన్‍తో హీరో జూమ్ స్కూటర్ వచ్చేసింది.. ధర, పూర్తి వివరాలు ఇవే..

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 30, 2023 06:01 PM IST

Hero Xoom Scooter launched: హీరో జూమ్ స్కూటర్ ఇండియాలో లాంచ్ అయింది. షార్ప్ డిజైన్, మంచి ఫీచర్లతో ఈ స్కూటర్ అడుగుపెట్టింది. ధర సహా పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Hero Xoom Scooter: అదిరిపోయే డిజైన్‍తో హీరో జూమ్ స్కూటర్ వచ్చేసింది
Hero Xoom Scooter: అదిరిపోయే డిజైన్‍తో హీరో జూమ్ స్కూటర్ వచ్చేసింది (HT Auto)

Hero Xoom Scooter launched: పాపులర్ టూ-వీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) కొత్తగా మరో స్కూటర్‌ను తీసుకొచ్చింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న హీరో జూమ్ 110 సీసీ స్కూటర్ (Hero Xoom 110 cc Scooter) సోమవారం (జనవరి 30) భారత మార్కెట్‍లో లాంచ్ అయింది. ఎల్ఎక్స్, వీఎక్స్, జెడ్‍ఎక్స్ అనే మూడు వేరియంట్లలో ఈ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే Xoom Scooter బుకింగ్‍లను కూడా Hero మొదలుపెట్టింది. హీరో మాస్ట్రోతో పోలిస్తే అప్‍డేటెడ్ డిజైన్, సరికొత్త ఫీచర్లతో ఈ నయా స్కూటర్ అడుగుపెట్టింది. పూర్తి వివరాలు ఇవే.

Hero Xoom Scooter: ధర

హీరో జూమ్ స్కూటర్ మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.

  • Hero Xoom LX ధర: రూ.68,599 (ఎక్స్-షోరూమ్)
  • Hero Xoom VX ధర: రూ.71,799 (ఎక్స్-షోరూమ్)
  • Hero Xoom ZX ధర: రూ.76,699 (ఎక్స్-షోరూమ్)

ఆరెంజ్, బ్లాక్, రెడ్, బ్లూ, వైట్ కలర్ ఆప్షన్‍లలో Hero Xoom స్కూటర్ లభిస్తుంది. ఇప్పటికే బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. టీవీఎస్ జ్యూపిటర్, హోండా యాక్టివా స్మార్ట్ స్కూటర్లకు ఈ జూమ్ పోటీగా వస్తోంది.

Hero Xoom Scooter: డిజైన్

షార్ప్ డిజైన్‍ను హీరో జూమ్ స్కూటర్ కలిగి ఉంది. X-షేప్డ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్ ఉంటుంది. H-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్‍లతో వస్తోంది. కార్నరింగ్ లైట్స్ కూడా ఉంటాయి. ఈ సెగ్మెంట్‍లో ఈ తరహా లైట్స్ ఉండడం ఇదే తొలిసారి. ఇక 12 ఇంచుల అలాయ్ వీల్స్‌ను ఈ స్కూటర్ కలిగిఉంది.

Hero Xoom Scooter: ఇంజిన్

110.9 cc సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఎఫ్ఐ ఇంజిన్‍తో ఈ సరికొత్త హీరో జూమ్ స్కూటర్ వస్తోంది. 8.04 బీహెచ్‍పీ పీక్ పవర్, 8.7 Nm పీక్ టార్క్యూను ఈ ఇంజిన్ ఉత్పత్తి చేయగలదు.

Hero Xoom Scooter: ఫీచర్లు

ఫుల్లీ డిజిటల్ డిస్‍ప్లేతో హీరో జూమ్ స్కూటర్ వస్తోంది. బ్లూటూత్ ద్వారా ఈ స్కూటర్ ను స్మార్ట్ ఫోన్‍కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ డిస్‍ప్లేలో స్కూటర్ కు సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఐ3 ఇంజిన్ స్టార్ట్/స్టాప్ ఫంక్షన్, యూఎస్‍బీ చార్జింగ్ పోర్ట్ ఉంటాయి. టెలి స్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్‌ను ఈ జూమ్ స్కూటర్ కలిగి ఉంది. టాప్ వేరియంట్‍కు ఫ్రంట్ డిస్క్ బ్రేక్‍ ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం