Honda Activa H smart launch : హోండా యాక్టివా హెచ్- స్మార్ట్ లాంచ్.. ధర ఎంతంటే!
Honda Activa H smart launch : హోండా యాక్టివా హెచ్- స్మార్ట్ స్కూటర్.. ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ వెహికిల్ ధర, ఫీచర్స్ వంటి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Honda Activa H smart launched in India : హోండా యాక్టివా 6జీకి చెందిన కొత్త వేరియంట్.. “యాక్టివా హెచ్- స్మార్ట్” సోమవారం ఇండియాలో లాంచ్ అయ్యింది. యాక్టివాలోనే టాప్ ఎండ్ వేరియంట్‌గా ఇది మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఈ హోండా యాక్టివా హెచ్- స్మార్ట్ ఎక్స్‌షోరూం ప్రారంభ ధర రూ. 74,536.
సరికొత్త టెక్నాలజీతో..
ఇండియా టూ వీలర్ సెగ్మెంట్లో యాక్టివాకు ఉన్న క్రేజ్, డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హోండా టూ వీలర మోడల్స్‌లో బెస్ట్ సెల్లింగ్‌గా కొనసాగుతోంది ఈ యాక్టివ్. కస్టమర్ల ఆసక్తి, అవసరలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు.. యాక్టివాను అప్డేట్ చేస్తూ వస్తోంది హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ). ఈ క్రమంలోనే హోండా యాక్టివా 6జీ లేటెస్ట్ వర్షెన్.. హోండా యాక్టివా హెచ్- స్మార్ట్ లాంచ్‌ను లాంచ్ చేసింది.
Honda Activa H smart price : మొత్తానికి ఈ యాక్టివా హెచ్- స్మార్ట్ స్కూటర్లో మూడు వేరియంట్స్ ఉంటాయి. అవి.. స్టాండర్డ్, డీలెక్స్, స్మార్ట్. వీటి ఎక్స్‌షోరూం ధరలు వరుసగా రూ. 74,536- రూ. 77,036- రూ. 80,537. హోండాకే సొంతమైన 5 సరికొత్త టెక్నాలజీ అప్లికేష్స్ ఈ స్కూటర్లో ఉంటాయని తెలుస్తోంది.
ఈ స్కుటర్కు ఓ స్మార్ట్ కీ ఉంటుందని, అది ప్రెస్ చేస్తే.. వెహికిల్ రెస్పాండ్ అయ్యే విధంగా ‘స్మార్ట్ ఫైండ్ ఫీచర్’ ఈ యాక్టివా హెచ్- స్మార్ట్‌లో ఉందని హెచ్ఎంఎస్ఐ చెబుతోంది. ఫిజికల్ కీ లేకుండానే.. స్మార్ట్ కీతో స్కూటర్‌ను లాక్, అన్‌లాక్ చేసే ఆప్షన్ ఇచ్చినట్టు స్పష్టం చేసింది. 2 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు.. స్మార్ట్ కీ ప్రెస్ చేస్తే.. స్కూటర్ ఇంజిన్ స్టార్ట్ అవుతుందని పేర్కొంది. వీటితో పాటు ఇంజిన్ స్టార్ట్/ స్టాప్ ఫీచర్ కూడా స్కూటర్‌కు ఇచ్చినట్టు వివరించింది.
స్మార్ట్‌గా.. యాక్టివా హెచ్ స్మార్ట్..!
Honda Activa H smart features : ఈ హోండా యాక్టివా 6జీ లేటెస్ట్ వర్షెన్.. యాక్టివా హెచ్- స్మార్ట్‌లో వీల్‌బేస్, ఫుట్‌బోర్డ్ ఏరియా పెద్దగా ఉన్నాయి. న్యూ పాసింగ్ స్విఛ్, డీసీ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ వచ్చాయి. 12 ఇంచ్ ఆలాయ్ వీల్స్‌ను కొత్తగా డిజైన్ చేశారు. టెలిస్కోపిక్ ఫ్రెంట్ సస్పెన్షన్, అడ్జస్టెబుల్ రేర్ సస్పెన్షన్ వంటివి కూడా ఉన్నాయి.
ఈ కొత్త హోండా యాక్టివాలో 110 సీసీ పీజీఎం- ఎఫ్ ఇంజిన్ ఉంటుంది. లీనియర్ పవర్‌ను జనరేట్ చేసే ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ టెక్నాలజీ (ఈఎస్పీ) కూడా ఉంది. అప్డేటెడ్ ఫ్యూయెల్ ఇంజెక్షన్, ఎన్హాన్స్డ్ స్మార్ట్ టంబుల్ టెక్నాలజీ, ఏసీజీ స్టార్ట్ అండ్ ఫ్రిక్షన్ రిడక్షన్ వంటి టెక్నాలజీలను యాక్టివా హెచ్- స్మార్ట్‌కు ఇచ్చింది హోండా సంస్థ.